Sunday, March 8, 2020

Please consider the above and do not run AC at all below 26 degrees. Keep your body and environment healthy.

*Put AC at 26+ degrees and put the Fan on.*
📣📣📣📣📣📣📣📣
Very useful information sent by an executive engineer from EB:
Correct use of AC:
As hot summer has started and we use  Air conditioners regularly, let us follow the correct method.

Most people have a habit of running their ACs at 20-22 degrees and when they feel cold, they cover their bodies with blankets. This leads to double loss. HOW  ???

Do you know that the temperature of our body is 35 degrees Celsius? The body can tolerate temperature ranging from 23 degrees to 39 degrees easily. It is called human body temperature tolerance. 

When the Room temperature is lower or higher, the body  reacts, by sneezing, shivering, etc.

When you run the AC at 19-20-21 degrees, room temperature is much lower than the normal body temperature and it starts the process called hypothermia in the body which affects blood circulation, whereby, blood supply in some parts of the body is not adequate. There are many disadvantages in  long term such as arthritis etc.

Most of the time there is no sweating when AC is ON, so the toxins of the body can not come out and in the long term, cause risk of many more diseases, such as skin allergy or itching, high blood pressure etc.

When you run AC at such low temperatures, it's  compressor continuously works on full energy, even if it is 5 stars, excessive power is consumed & it blows money from your pocket.

What is the best way to run AC ?? Set up Temperatures for 26 Degrees or more. 
You don't get any benefit by  first setting Temperature of AC to 20 - 21 and then wrap the sheet/ thin Quilt around you.
It is always better to run AC at 26+ degrees and put the fan on at  slow speed. 28 plus degrees is better.

This will cost less electricity and your body temperature will also be in the range and there will be no ill effect on your health.

Another advantage of this is that the AC will consume less electricity, the blood pressure on the brain will also decrease and Saving will ultimately help reduce the effects of global warming. How ?? 

Suppose you save about 5 units per AC per night by running AC on 26+ Degree and other 10 lakh houses also do like you then we save 5 million units of electricity per day.

At the regional level this savings can be crores of units per day.

Please consider the above and do not run  AC at all below 26 degrees. Keep your body and environment healthy.

Forwarded in Public Interest 
Ministry for Power 
and Energy. GOI.
👏👏👏👏👏👏👏👏
*Forward share.*
👍👍👍👍👍👍👍👍

శని గ్రహాన్ని అనుకూలంగా చేసుకోవడం ఎలా?గ్రహాల స్థితిగతులనుబట్టి మన జాతకచక్రం నడుస్తుంటుంది. కనుక నవగ్రహాలను అనుకూలంగా చేసుకోవడం చాలా అవసరం. అందులో శని ప్రభావం మరీ ఎక్కువ కనుక, శని దోషం ఉన్నవారు కొన్ని దానాలు ఇవ్వడం ద్వారా దాన్ని శాంతింపచేసుకోవచ్చు.

శని గ్రహాన్ని అనుకూలంగా చేసుకోవడం ఎలా?

గ్రహాల స్థితిగతులనుబట్టి మన జాతకచక్రం నడుస్తుంటుంది. కనుక నవగ్రహాలను అనుకూలంగా చేసుకోవడం చాలా అవసరం. అందులో శని ప్రభావం మరీ ఎక్కువ కనుక, శని దోషం ఉన్నవారు కొన్ని దానాలు ఇవ్వడం ద్వారా దాన్ని శాంతింపచేసుకోవచ్చు.

శని మహర్దశలో చేయవలసిన దానములు

1. శని మహర్దశ, శని అంతర్దశల్లో నువ్వులు దానము చేయాలి.
2. శని మహర్దశ, రవి అంతర్దశలో ఒక గుమ్మడికాయను, ఇవ్వగలిగినంత బంగారాన్ని దానం చేయాలి.
3. శని మహర్దశ, చంద్రుని అంతర్దశలో తెల్ల ఆవును దానం చేయాలి.
4. శని మహర్దశ, కుజ అంతర్దశలో దున్నపోతును దానం చేయాలి.
5. శని మహర్దశ, బుధుడు అంతర్దశలో దున్నను దానం చేయాలి.
6. శని మహర్దశ, గురుడు అంతర్దశలో బంగారు మేకను దానం చేయాలి.
7. శని మహర్దశ, శుక్రుడు అంతర్దశలో నల్ల మేక, నువ్వులు, ఇనుము, లవణం, నూనెలను దానం చేయాలి.
8. శని మహర్దశ, రాహువు అంతర్దశలో సీసమును దానం చేయాలి.
9. శని మహర్దశ, కేతువు అంతర్దశలో బంగారం, నువ్వులు దానం చేయాలి.

వివిధ గ్రహాల శని అంతర్దశలో చేయవలసిన దానములు: 

1. రవి మహర్దశలో మేకను దానం చేయాలి.
2. చంద్రుని మహర్దశ, శని అంతర్దశలో దున్నపోతును దానం చేయాలి.
3. కుజ మహర్దశ, శని అంతర్దశలో నువ్వుల పిండిని దానం చేయాలి.
4. బుధుని మహర్దశ, శని అంతర్దశలో దున్నపోతును దానం చేయాలి.
5. గురుని మహర్దశ, శని అంతర్దశలో నల్లమేకను దానం చేయాలి.
6. శుక్రుని మహర్దశ, శని అంతర్దశలో దున్నపోతును దానం చేయాలి.
7. రాహువు మహర్దశ, శని అంతర్దశలో నల్లమేకను దానం చేయాలి.
8. కేతు మహర్దశ, శని అంతర్దశలో దున్నపోతును దానం చేయాలి.

పైన సూచించినవి ఏవైనా దొరకనప్పుడు వాటికి బదులుగా ధనమిచ్చుటకన్నా సూచించిన దాని ఆకారంలో వెండితో ప్రతిమ చేయించి దక్షిణతో కలిసి ఇవ్వాలి.

🙏🙏శుక్రవారం విడిచిన దుస్తుల్నే ధరిస్తే..? బియ్యం కొలిచే పాత్రను బోర్లిస్తే?🙏🙏

🙏🙏శుక్రవారం విడిచిన దుస్తుల్నే ధరిస్తే..? బియ్యం కొలిచే పాత్రను బోర్లిస్తే?🙏🙏

శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మీదేవిని ఉపాసన చేస్తే ధన సమృద్ధి కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి. సంపదలతో తులతూగాలి అనుకునే వారు శుక్రవారం పూట అష్టైశ్వర్యాలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం చేయాలి. ఇంకా ఇంట పసుపు, ఉప్పు అయిపోయాయనే మాట వినబడ కూడదు. పసుపును కొనాలి. లేదా ఉప్పును తేవాలి అని చెప్పడం చేయొచ్చు.

ఉప్పు, పసుపు అయిపోయేంతవరకు ఉపయోగించకూడదు. అవి అయిపోయే లోపు ఇంట తెచ్చుపెట్టుకోవడం చేయాలి. అలాగే ఇంట్లో అన్నం వండేందుకు ముందు బియ్యాన్ని కొలుస్తాం. ఆ కొలిచే పాత్రను ఎప్పటికీ బోర్లించకూడదు.

ఇంట సుఖసంతోషాలు, సిరిసంపదలు పొందాలంటే.. విడిచిన బట్టలను తలుపుకు వేలాడదీయకూడదు. విడిచిన బట్టలను రెండో రోజు, మూడో రోజు ధరించకూడదు. ప్రత్యేకించి శుక్రవారం నాడు విడిచిన దుస్తులు ధరిస్తే దరిద్ర్యం చుట్టుకుంటుందని ఆధ్యాత్మిక పండితులు హెచ్చరిస్తున్నారు.

* శుక్రవారం నాడు సాత్త్విక ఆహారాన్ని తీసుకోవాలి. పాలను వినియోగించాలి.

* శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి, రంగ వల్లికలతో అలంకరించి.. దీపారాధన చేయాలి.

* రోజూ లేదా శుక్రవారం రాత్రిపూట కొద్దిపాటి అన్నాన్ని శేషంగా ఓ చిన్నపాటి గిన్నెలో వుంచి వంటింట్లో వుంచడం సంప్రదాయం. ఇలా చేస్తే పితరులు, దేవతలు ఆ ఇంట అన్నం ఎల్లప్పుడూ వుండుగాక అంటూ దీవిస్తారని ప్రతీతి.

* శుక్రవారం నుదుట బొట్టు ధరించే వారికి కలకాలం సౌభాగ్యం నిలిచివుంటుంది. ఇంకా స్టిక్కర్లను నుదుటన ధరించకుండా తెల్ల వక్కలతో తయారైన కుంకుమను శుక్రవారం ధరిస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శుక్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది.

* తెల్ల వక్కలను, నేతిలో వేయించి చూర్ణం చేసి ఆ మిశ్రమానికి కస్తూరి పొడి, కుంకుమ పువ్వు పొడిని కలిపి చూర్ణం చేసుకుంటే కుంకుమ సిద్ధమవుతుంది. ఈ కుంకుమను నుదుటన ధరించడం ద్వారా సుగంధ భరితమైన సువాసనతో పాటు శుక్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది. ధనవృద్ధి వుంటుంది.

* శుక్రవారం పూట తెల్లని వస్త్రాలను ధరించడం ఓ నియమం. తెల్లని వస్త్రాలంటే శుక్రునికి, మహాలక్ష్మీకి ప్రీతికరం. తెల్లని దుస్తులను శుక్రవారం ధరిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

* అలాగే శుక్రవారం పూట కమలములతో, కలువలతో లక్ష్మీదేవికి అర్చన చేసినట్లైతే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇంకా పుష్పాలను దానం చేసినా, అన్నదానం చేసినా, వస్త్ర దానం చేసినా శుభఫలితాలుంటాయి. కస్తూరిని మిత్రత్వం కోరి స్నేహితులకు అందించినా, శుక్రవారం వర్జ్యం వున్న సమయంలో మౌనవ్రతం పాటించినా ఆ ఇంట తప్పకుండా ధన సమృద్ధి కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు.🙏🙏🙏

శివం : సోమవారం శివునికి పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు తెలుసా...?

శివం : సోమవారం శివునికి పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు తెలుసా...?


హిందూ పురాణాల ప్రకారం శివునికి అనేక పేర్లు ఉన్నాయి. భక్తులు ఈశ్వరుడిని భోళా శంకరుడు, విశ్వేశ్వరుడు, పరమేశ్వరుడు, మల్లిఖార్జున స్వామి, మంజునాథ స్వామి.. మరెన్నో పేర్లతో కొలుస్తారు. శివున్ని పూజించే భక్తులంతా ఎక్కువగా సోమవారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సోముడు అంటే చంద్రుడు అని అర్థం. చంద్రుని ధరించినవాడు శివుడు. సోమ అనే శబ్దాన్ని విడగొడితే ఉమాసహితుడు అనే అర్థం వస్తుంది.

ఉమాసహితుడు అంటే శివుడే కాబట్టి సోమవారం శివునికి ప్రత్యేక దినంగా భావించి భక్తులు పూజలు చేస్తారు. సోమవారం శివున్ని పూజించి దద్దోజనం నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధలు ఉండవు. మూడు ఆకులు గల బిల్వ పత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది

స్వామికి వెలగపండు సమర్పించడం వల్ల శుభం చేకూరుతుంది. శివున్ని పూజించేవారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి.

సోమవారం రోజు ఇంట్లోనే చిన్న పరిమాణంలో గల శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని పూజాభిషేకాలు చేయడం మంచిది. శివుడిని చిత్తశుద్ధి, అంకితభావంతో పూజించడం ద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది. సోమవారం శివున్ని పూజిస్తే సమస్త పాపాలు పటాపంచలై పోవడమే కాకుండా భోగభాగ్యాలు, సంపదలు చేకూరుతాయి. ఆది దేవుడికి సంతోషాన్ని కలిగిస్తే ఆ ఇంట ఎప్పటికీ లేమి అనే మాట వినిపించదని పండితులు చెబుతున్నారు

కుంకుడు, మామిడి, దానిమ్మ వంటి చెట్లను గృహాల్లో ఎందుకు పెంచకూడదు?

కుంకుడు, మామిడి, దానిమ్మ వంటి చెట్లను గృహాల్లో ఎందుకు పెంచకూడదు?

ఇలాంటి చెట్లు నీటి శాతాన్ని ఎక్కువగా పీలుస్తాయి. తద్వారా గృహావసరాలకి ఉపయోగపడే అనేక చెట్లు, నీరు సరిపోక పెరగవు. కొన్ని చెట్లు గృహయజమాని జాతకానికి సరిపోవు. అందుకే సర్వసమ్మతమైనవీ, గృహావసరాలకి ఉపయోగపడే చెట్లనే పెంచుకుంటారు. పై చెట్లు పెంచాలనుకుంటే మీ మీ జాతకాల ప్రకారం నక్షత్రాలూ ప్రకారం సరిచూసుకుని పెంచుకోండి

#గబ్బిలం ఇంట్లోకి వస్తే ఇల్లు మూసి క్లీన్ చేయాలి..

#గబ్బిలం ఇంట్లోకి వస్తే ఇల్లు మూసి క్లీన్ చేయాలి..
*******************************************
అని సనాతన ధర్మం చెప్తే, భారతీయులను వారొక పల్లెటూరు గబ్బిలాయిలు అని తీసి పారేస్తారు బాగా చదువుకున్నటువంటి విదేశీ మూర్ఖ శిఖామణులు.. 
ఈ వేళ ప్రపంచంలో #కరోనా వైరస్ రావటం వలన గబ్బిలం అనేది అనేక వైరస్ల పుట్ట అని నిరూపితమైంది.. 
అటువంటి గబ్బిలము ఇంటిలోకి వచ్చి తిరుగుతుంటే మనము భయపడిపోతాం. కారణం ఏమిటి అంటే అది సకల అనారోగ్యాలకు కారణభూతమైనది. అటువంటి గబ్బిలము ఇంటిలో మల మూత్రాదులు విసర్జించిన అందులోని వైరస్లు మనుషుల మీద  దాడిచేస్తాయి కాబట్టి  అనారోగ్యం రావటానికి ఆస్కారాలు అధికంగా ఉంటాయి.. దానికి మనము సంప్రోక్షణ నిర్వహించి ఇంటిని శుద్ధి చేసే కార్యక్రమాన్ని చెప్పడం చేస్తాము. ఇది ఒక పనికిమాలిన వ్యవహారం అన్నారు ఇదివరలో... క్షవరం అయిన తర్వాత గాని వివరం రాదని కరోన వచ్చిన తర్వాత దీనికి మూల కారణం గబ్బిలం అని తెలిసి  అల్లాడిపోతున్నారు.. 

చెపితే వినరు ఏదైనా వస్తే అప్పుడు చేస్తారు..
అవును ఈ విషయం సనాతన హిందూ ధర్మంలో రుషులు వేల సంవత్సరాల క్రితమే చెప్పారు.. అంటూ భారతీయ గ్రంధాలను వెతకటం ప్రారంభిస్తారు..
ఎంతోమంది పోయిన తర్వాత కానీ గబ్బిలం ఇంట్లోకి రాకూడదు అనేది తెలుసుకుంటున్నారు.. 
మహర్షులారా మీరు దర్శించిన సూత్రాలను మాకు అందించి మార్గదర్శకం చేస్తే మేము కొత్త కొత్త చదువులు చదివి మహర్షులను విమర్శించే స్థాయికి వచ్చాము. పావురాయి గద్ద ఇటువంటివి ఇంట్లోకి వస్తే సంప్రోక్షణ చెప్పిన దానికి కూడా విలువైన సమాచారం ఉంటుంది. అనేక రోగ కారక క్రిమి కీటకాలను అవి విసర్జించి మనుషులను అనారోగ్యం పాలు చేస్తాయి కాబట్టి వాటిని ఇంటిలోకి రానీయకుండా ఉంచడం శ్రేష్ఠం అని చెప్పిన మీ వాక్యం అనుసరణీయం. మిగతా పక్షుల వలన కూడా ఏమి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది తెలియదు కానీ ఇప్పటికీ గబ్బిలాయి బయటపడింది.. 
ధన్యోస్మి జై భారత్ జై సనాతన ధర్మ....

కుటుంబం లో స్త్రీ పాత్రహిందూ సంస్కృతికి మూలాధారమైన వేదాలు స్త్రీకి అత్యున్నత స్థానాన్ని ఇచ్చాయి. "యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతా" అని ఆనాడే చెప్పబడింది.స్త్రీ ఎక్కడ పుజింపబడుతుందో అక్కడ దేవతలు తిరుగాడుతారు అని అర్ధం. అంటే, స్త్రీ ఎక్కడ గౌరవింప బడుతుందో, అక్కడ సుఖ సంతోషాలు ఉంటాయి.

కుటుంబం లో స్త్రీ పాత్ర

హిందూ సంస్కృతికి మూలాధారమైన వేదాలు స్త్రీకి అత్యున్నత స్థానాన్ని ఇచ్చాయి. "యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతా" అని ఆనాడే చెప్పబడింది.స్త్రీ ఎక్కడ పుజింపబడుతుందో అక్కడ దేవతలు తిరుగాడుతారు అని అర్ధం. అంటే, స్త్రీ ఎక్కడ గౌరవింప బడుతుందో, అక్కడ సుఖ సంతోషాలు ఉంటాయి. 
ఇతర సంస్కృతుల కన్నా కొన్ని వేల సంవత్సరాల క్రితమే వేద సంస్కృతీ మహిళకు ఉన్నత స్థానాన్ని ఇచ్చింది. కుటుంబ బాధ్యతలను స్త్రీకి కట్టబెట్టినది ఆమెను ఇంట్లో కట్టిపడేయ దానికి కాదు. కుటుంబ నిర్వహణలో ఆమె ఎన్నో పాత్రలు పోషిస్తుంది. 

కుటుంబ సంక్షేమం మొత్తం ఆమె చేతులకు ఇచ్చినది ఆమె యొక్క ప్రజ్ఞను గమనించే. శుచి, శుభ్రత వంట తయారీ ఇంట్లో స్త్రీ బాధ్యత. అంటే ఇవన్ని ఆమె పాటించి, కుటుంబ సభ్యుల చేత పాటింప చేయడం ద్వార ఆమె ఒక వైద్యురాలు. పిల్లలకు విద్య బుద్ధులునేర్పి మంచి గుణములు, నడవడిక అలవాటు చేసి, సమాజమునకు ఉపయోగపడే విధంగా పిల్లలను తయారు చేయడం ద్వార ఆమె ఒక గురువు. భర్తకు అనుగుణంగా నడచుకొని, అతని ఆజ్ఞలు పాటించి, ఆతను చెడు దారులు పట్టకుండా, జీవితంలో కావలసిన చోట మంచి సలహాలు చెప్పి కుటుంబ గౌరవం నిలిపే వేళ ఆమె ఒక మంత్రి. 

అదే విధంగా సంపాదించే బాధ్యత మగవారికి, దానిని ఖర్చుపెట్టే బాధ్యత స్త్రీకి ఉండాలి అన్నాడు మనువు. వచ్చిన సంపాదనలో కొంత మిగులు చేసి, మిగిలిన దానిని సక్రమంగా వినియోగించే వేళ ఆమె ఒక ఆర్ధిక వేత్త. ఒకవేళ భర్త సంపాదన ఇంటి అవసరాలకు సరిపోకపోతే ఇల్లు నడవడానికి ఆమె కూడా కష్టపడి సంపాదించగల ధైర్యవంతురాలు స్త్రీ. ఇంట్లో ఎంతో అవసరమైన ఖర్చు వచ్చినపుడు పిల్లలతో సహా, భర్తకు కూడా ఎక్కడో అక్కడనుంచి తీసి డబ్బు సర్దగల సమర్ధురాలు స్త్రీ. అలాగే ఎన్ని కష్టాలు వచ్చిన ధైర్యంగా ఎదుర్కోగల నిబ్బరం స్త్రీకి ఉంటుంది. 

ఇంటికి వచ్చే అతిథులను, బంధువులను గౌరవించే వేళ ఆమె అన్నపూర్ణ. పిల్లల సంరక్షణ, పెద్దవారి సేవ, అతిథి అభ్యాగాతుల సేవ, ఇలా ఎన్నో పనులు ఒకేసారి చేయగల సామర్థ్యం ఆమె సొత్తు. ఇలా కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలలో ఆమెదే ప్రధాన పాత్ర. 

ఆమె చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట, కుటుంబం మిద ప్రభావం చూపుతాయి. ఆమె పాత్ర వాళ్ళ కుటుంబంలో సంతోషం తాండవిస్తుంది. ఒక కుటుంబం లేదా పిల్లలు బాగుపడిన, లేదా చెడిపోయిన దానికి బాధ్యురాలు స్త్రీయే. 

స్త్రీ శారీరిక శక్తీ లో మగవారి కన్నా బలహీనురాలు అయినప్పటికీ, మానసిక శక్తి లో ఆమెకు ఎవరు సాటిలేరు. కుటుంబాలు అన్ని సంతోషంగా ఉంటె సమాజంలో సంతోషం నిండుతుంది. లోకంలో ఇబ్బందులుండవు. ఇది స్త్రీకి మన సంస్కృతీ ఇచ్చిన అసలు స్థానం. కానీ నాగరికత పెరిగి సమాజం ముందుకు పోతున్న కొద్దీ, సమాజంలో స్త్రీకి గౌరవం లేకుండా పోతోంది. ఆమె మిద ఎన్నో అత్యాచారాలు, అకృత్యాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొని మళ్లీ స్త్రీ యొక్క గౌరవాన్ని పెంపోదించే దిశగా అందరు కృషి చేయాలి.

వాల్మీకి రామాయణం1వ దినము, బాలకాండ

వాల్మీకి  రామాయణం

1వ దినము, బాలకాండ
******************************

వాల్మీకి మహర్షి గురించి స్కాంద పురాణంలొ సనత్ కుమారుడు వ్యాస మహర్షికి వివరించాడు. సుమతి - కౌశికి అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరు అగ్నిశర్మ. ఆ అగ్నిశర్మకి చదువు, అనగా వేదములు మొదలైనవి సరిగ్గా అబ్బలేదు. ఆ రాజ్యంలో క్షామం వచ్చి, ఎవరూ ఎవరికీ దానధర్మాలు చెయ్యడం లేదు. కాబట్టి అగ్నిశర్మ తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్లి, అక్కడ దొరికే కందమూలాలు, తేనె లాంటివి తెచ్చుకొని బ్రతుకుతున్నాడు. చదువు సరిగ్గా అబ్బనందువల్ల అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చెయ్యడం ప్రారంభించాడు. ఒకసారి అటుగా వెళుతున్న కొంతమంది మహర్షులను ఆపి మీదెగ్గర ఉన్నది ఇవ్వండి, లేకపోతె చంపుతాను అన్నాడు. ఆ మహర్షులలో ఉన్న అత్రి మహర్షి "నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు" అని అగ్నిశర్మని అడిగారు. నన్ను నమ్ముకున్న నా భార్యని, నా తల్లిదండ్రులని పోషించుకోవడానికి అని చెప్పాడు శర్మ. అలా అయితే, నువ్వు ఇప్పటిదాకా చేసిన ఈ దొంగతనాల వల్ల నీకు కలిగిన పాపాన్ని, నీ కుటుంబ సభ్యులలో ఎవరన్నా పంచుకుంటారేమో అడిగిరా అని అత్రి మహర్షి అన్నారు.

మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం, కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి. నువ్వు తెచ్చావు, మేము అనుభవిస్తాము. కాని, ఎలా తెచ్చావు అన్నదానికి ఇచ్చె ఫలితాన్ని నువ్వే అనుభవించాలి అని అన్నారు శర్మ కుటుంబసభ్యులు. చాలా బాధ కలిగి, మళ్ళి ఆ ఋషుల దెగ్గరికి వచ్చి, నా పాపాలను పోగొట్టుకునే మార్గం చెప్పమన్నాడు. ధ్యానం చెయ్యి అని అత్రి మహర్షి చెప్పి వెళ్ళిపోయారు. 13 సంవత్సరాల తరువాత ఆ మహర్షులు ఇదే దారిలో తిరిగొస్తుంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనబడింది. ధ్యానమగ్నుడై ఉన్న అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగాయి. తన మీద పుట్టలు(వల్మీకం) కట్టినా  తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి, ఆయనని వాల్మీకి అని పిలిచి, బయటకి రమ్మన్నారు. ఇది ఆయనకి పౌరుష నామమయ్యింది. అప్పుడు ఆ మహర్షులు ఆయనని ఉత్తర దిక్కుకి వెళ్లి భగవంతుడిని ధ్యానం చెయ్యమన్నారు. వాల్మీకి మహర్షి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్లి, పరమశివుడిని ఆరాధన చేశారు. అప్పుడాయనకి విష్ణు కథ రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మగారు ఇచ్చారు. అంటె, ఆయనకి త్రిమూర్తుల అనుగ్రహం లభించిందన్నమాట.

తపస్స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం |
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం ||

వాల్మీకి మహర్షి రామాయణంలొ రాసిన మొదటి శ్లోకం. దీని అర్ధం ఏంటంటె, తపస్వి, ముని, గొప్ప వాగ్విదాంవరుడైన నారద మహర్షిని పరిప్రశ్న చేయడానికి తపస్వియైన వాల్మీకి మహర్షి సిద్ధపడుతున్నారు అని. వాల్మీకి మహర్షి నారదుడిని ఏమడిగారంటె................

కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రతః ||
చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః |
విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చ ఏక ప్రియదర్శనః ||
ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కః అనసూయకః |
కస్య బిభ్యతి దేవాః చ జాత రోషస్య సంయుగే ||

ఈ లోకంలొ ఇప్పుడే, ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞత భావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, ధృడమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్ధుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలొ మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుగోగలిగినవాడు ఉంటె నాకు చెప్పండి అని అడిగాడు.

నువ్వు చెప్పిన గుణాలన్నీ ఒకే మనిషిలొ ఉండడం కష్టమే, కాని ఒకడు ఉన్నాడు, నీకు ఇప్పుడు అతని గురించి చెప్తాను అని నారద మహర్షి ఇలా అన్నారు........
ఇక్ష్వాకువంశములొ రాముడని పేరుగల ఒక వ్యక్తి జన్మించాడు. ఆయనకి నువ్వు అడిగిన 16 గుణాలు ఉన్నాయి అని చెప్పి ఒక 100 శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పాడు.

చెప్పిన తరవాత నారదుడు వెళ్ళిపోయాడు. విన్న వాల్మీకి మనస్సు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు మధ్యాన సమయంలొ సంధ్యావందనం చెయ్యడానికి తమసా నది తీరానికి భారద్వాజుడు అన్న శిష్యుడితో వెళ్లారు. అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న రెండు క్రౌంచ పక్షులని చూశారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిశ్చయుడై మిధున లక్షణంతో ఉన్న ఆ మగ క్రౌంచ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు. కిందపడిన ఆ మగ పక్షి చుట్టూ ఆడ పక్షి ఏడుస్తూ తిరుగుతుంది. అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఈ సంఘటన చూసి, బాధ కలిగి ఆయన నోటివెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది...........

మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః| 
యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్||

ఓ దుర్మార్గుడైన బోయవాడా! మిధున లక్షణంతో ఉన్న రెండు క్రౌంచ పక్షులలొ ఒక క్రౌంచ పక్షిని కొట్టినవాడ, నీవు చేసిన పాపమువలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక, అని శపించాడు.

ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు, కాని ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి, మనసులో ఆ క్రౌంచ పక్షులే కనిపిస్తున్నాయి. అలా ఆయన శిష్యులు కూడా ఈ మాటలని ధారణ చేశారు, అలా అది శ్లోక రూపం దాల్చింది. ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని ఆశ్రమంలోకి తీసుకెళ్ళి కుర్చోపెట్టారు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు "ఓ బ్రాహ్మణుడా!  నీ నోటివెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ." అన్నారు. ఆ శ్లోకానికి అర్ధం చూడండి......

"నిషాద" అంటె బోయవాడు అని ఒక అర్ధం, అలాగే సమస్త లోకములు తనయందున్న నారాయణుడు అని ఒక అర్ధం. "మా" అంటె లక్ష్మి దేవి. "మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః", అంటె లక్ష్మిని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక. " యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్", కామము చేత పీడింపబడి, బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారము పొంది, కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ-మండోదరులలో, రావణుడు అనే క్రౌంచ పక్షిని నీ బాణంతో కొట్టి చంపిన ఓ రామ, నీకు మంగళం జెరుగుగాక, అని ఆ శ్లోక అర్ధం మారింది.

బ్రహ్మగారు అన్నారు, "నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు ఈ రోజు రామాయణాన్ని పలికావు. నాయనా, నేను నీకు వరం ఇస్తున్నాను " నువ్వు కూర్చొని రామాయణం రాద్దామని మొదలెడితే, రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, రాక్షసులు మొదలైన వాళ్ళు మాట్లాడినదే కాదు, వాళ్ల మనస్సులో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి. ఈ భూమి మీద నదులు, పర్వతాలు ఎంత కాలం ఉంటాయో అంత కాలం రామాయణం ఉంటుంది. ఇందులో ఒక్క మాట అబద్ధం కాని, కల్పితం కాని ఉండదు. నువ్వు ఇంక రామాయణం రాయడం మొదలపెట్టు" అని వరం ఇచ్చి వెళ్ళిపోయారు.

వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చోగ ఆయనకి బ్రహ్మ గారి వరం వల్ల జెరిగిన రామాయణం అంతా ఆయనకి కనబడసాగింది. ఆయన రామాయణం రచించడం ప్రారంబించారు. మొత్తం 24,000 శ్లోకాలు, 6 కాండలు, 6 కాండల మీద ఒక కాండ, 500 సర్గల రామాయణాన్ని రచించడం ప్రారంబించారు. తరవాత ఆయన ఈ రామాయణాన్ని ఎవరితో పాడిస్తే బాగుంటుందని చెప్పి అక్కడున్న లవకుశలతో పాడించారు. వాళ్ళు తరవాత ఆ రామాయణాన్ని రాముడి సమక్షంలో అయోధ్యలో పాడడం మొదలుపెట్టారు.........

కథ ప్రారంభం

రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు.............

పూర్వకాలంలొ కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది. ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు. ఆ నగరం 12 యోజనముల పొడువు, 3 యోజనముల వెడల్పు ఉండేది( యోజనం అంటె = 9 మైళ్ళు ). ఆ నగరం మధ్యలొ రాజ ప్రాసాదంలొ దశరథ మహారాజు నివాసముండేవారు. ఆ నగరంలొ రహదారులన్నీ విశాలంగా, ఎప్పుడూ సుగంధ ధూపాలతొ ఉండేవి. ధాన్యం, చెరుకు లాంటి పంటలన్నీ బాగా పండేవి ఆ రాజ్యంలొ. ఏ ఇంట్లోనుకుడా అనవసరంగా ఉన్న నేల లేదు. అయోధ్య నగరంలొ అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు, అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే, ఎవడికి ఉన్నదానితొ వాడు తృప్తిగా ఉండేవాళ్ళు, అందరూ దానం చేసేవాళ్ళు, సత్యమే పలికేవాళ్ళు, అందరూ ఐశ్వర్యవంతులే, ఆవులు, గుర్రాలు, ఏనుగులతొ ఆ నగరం శోభిల్లేది. చెవులకి కుండలములు లేనివాడు, కిరీటం లేనివాడు, మెడలొ పూలహారం లేనివాడు, హస్తములకు ఆభరణములు లేనివాడు, దొంగతనం చేసేవాడు, నాస్తికుడైనవాడు ఆ అయోధ్య నగరంలొ లేడు.

దశరథ మహారాజుకి 8 ప్రధాన మంత్రులు ఎప్పుడూ సహాయం చేసేవారు, వాళ్ళు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంత్రుడు. వశిష్ఠుడు, వామదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చె ఋత్విక్కులు. ఇతరమైన బ్రాహ్మణులూ, మంత్రులు కూడా ఉండేవారు. ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వాళ్ళు, పని చెయ్యడం తెలిసినవాళ్లు, ఇంద్రియములను నిగ్రహించినవాళ్లు, శ్రీమంతులు, శాస్త్రము తెలిసిన వాళ్ళు, సావధాన చిత్తం కలిగినవాళ్ళు. ఆ కోసల దేశంలొ పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు.

ఇన్ని ఉన్నా ఆ దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది. వంశోద్దారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది. ఆయనకి అప్పటికి 60,000 సంవత్సరాలు నిండిపోయాయి. ఆయనకి అశ్వమేథ యాగం చెయ్యాలనే ఆలోచన వచ్చి, వెంటనే సుమంత్రుడిని పిలిచి, ఋత్విక్కులైన వశిష్ఠుడు, వామదేవుడు మరియు ఇతర పురోహితులని పిలవమని చెప్పాడు. అందరికీ తన ఆలోచన చెప్పాడు. అందరూ సరే అన్నారు. అశ్వమేథ యాగానికి కావాల్సిన సంభారములన్నీ తెప్పించి, సరయు నదికి ఉత్తర తీరంలొ యాగమంటపం నిర్మించారు.

దశరథ మహారాజు దక్షిణ నాయకుడు, ఆయనకి 300 కి పైగా భార్యలున్నారు. కాని పత్నులు మాత్రం కౌసల్య, సుమిత్ర, కైకేయి. తను యాగం మొదలపెడుతున్నాడు కాబట్టి, తన పత్నులని దీక్ష స్వీకరించమన్నాడు. అంతఃపురంలోకి వెళుతున్న దశరథ మహారాజుతొ సుమంత్రుడు ఇలా అన్నాడు...........

సనత్కుమారో భగవాన్ పూర్వం కథితవాన్ కథాం |
ఋషీణాం సన్నిధౌ రాజన్ తవ పుత్రాగమం ప్రతి ||

పూర్వకాలంలొ ఒకసారి సనత్కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు............ఇక్ష్వాకువంశములొ జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేథ యాగం చేస్తాడు. ఆ యాగం వల్ల ఆయనకి నలుగురు కుమారులు కలుగుతారు. కాని అశ్వమేథ యాగంతొ పాటు పుత్రకామేష్టి యాగం కూడా చెయ్యాలి. ఈ రెండు యాగాలని చెయ్యగలిగినవాడు రుష్యశృంగుడు. ఆయన ఆ యాగాలని చేస్తేనే బిడ్డలు పుడతారని సనత్కుమారుడు చెప్తుంటే విన్నాను అని సుమంత్రుడు దశరథ మహారాజుతొ అన్నాడు.ఆ రుష్యశృంగుడు పక్కనే ఉన్న అంగదేశంలొ ఉన్నాడు, కాబట్టి మీరు వెళ్లి ఆయనని తీసుకొని రండి అన్నాడు.

అప్పుడు దశరథ మహారాజు, నాకు ఆ రుష్యశృంగుడు గురించి వివరంగా చెప్పు అంటె, సుమంత్రుడు ఇలా చెప్పసాగాడు.............పూర్వకాలంలొ విభణ్డక మహర్షి చాలాకాలం తపస్సు చేసి స్నానం చెయ్యడానికి ఒక సరస్సు దెగ్గరికి వెళ్ళగా, అక్కడ అలా వెళుతున్న ఊర్వశిని చేసేసరికి ఆయన రేతస్థానము నుంచి కదిలిన వీర్యం సరోవరంలొ పడింది. ఆ వీర్యాన్ని ఒక జింక తాగి, గర్భం దాల్చి, శిరస్సు మీద కొమ్ము ఉన్న ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది. అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి రుష్యశృంగుడు అని పేరు పెట్టారు. ఆ విభణ్డక మహర్షి, రుష్యశృంగుడికి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞయాగాదులు అన్నీ చెప్పాడు. కాని ఆ రుష్యశృంగుడికి లోకం తెలీకుండా పెంచాడు, ఆయనకి అసలు ఈ సృష్టిలో స్త్రీ-పురుషులని ఇద్దరు ఉంటారని కూడా తెలీకుండా పెంచాడు. అంటె విషయసుఖాల వైపు వెళ్ళకుండా పెంచాడు. ఎప్పుడూ ఆ ఆశ్రమంలోనే, తండ్రి పక్కనే ఉండేవాడు. ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు ధర్మం తప్పడం వల్ల ఆ రాజ్యంలొ వర్షాలు పడడం మానేశాయి. దేశంలొ క్షామం వచ్చింది. రుష్యశృంగుడు కాని మన దేశంలొ అడుగుపెడితే వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు.

వెంటనే రాజు మంత్రుల్ని పిలిచి విషయం చెప్తే, రుష్యశృంగుడిని తీసుకురావడం మావల్ల కాదు, ఏమి కోరికలు లేని వాడు, మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అన్నారు. ఎంతైనా మంత్రులు కనుక ఒక మాట అన్నారు..... ఇంద్రియార్థైః అభిమతైః నరచిత్త ప్రమాథిభి |. రుష్యశృంగుడికి కుడా ఇంద్రియాలు, మనస్సు ఉంటాయి. వాటికి ఇప్పటిదాకా రుచి తగలక, విషయసుఖాల వైపుకి రాలేదు. కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేశ్యలని పంపిస్తే, విభణ్డకుడు లేని సమయంలో వీళ్ళు ఆ రుష్యశృంగుడి మనస్సుని ఆకర్షించి, ప్రలోభపెడతారు. అప్పుడు ఆయనే వాళ్ళ వెంట వస్తాడు, అని మంత్రులు సలహా ఇచ్చారు.

ఆ వేశ్యలకి విభణ్డకుడి మీద ఉన్న భయం వలన, వాళ్ళు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడడం, నాట్యం చెయ్యడం మొదలుపెట్టారు. ఒకరోజు విభణ్డకుడు లేని సమయంలో గానం విన్న రుష్యశృంగుడు, ఆ గానం వస్తున్న వైపు వెళ్ళాడు. అక్కడున్న ఆ వేశ్యలని చూసి, వాళ్ళు పురుషులే అనుకొని, మహాపురుషులార! మీరు మా ఆశ్రమానికి రండి, మిమ్మల్ని పూజిస్తాను అన్నాడు. అందరూ విభణ్డకుడి ఆశ్రమానికి వెళ్లారు. తరువాత ఆ వేశ్యలు ఆశ్రమంనుంచి వెళ్ళిపోతూ ఆ రుష్యశృంగుడిని గట్టిగ కౌగలించుకుని వెళ్ళిపోయారు. మరునాడు ఆ రుష్యశృంగుడికి మనసులో దిగులుగా అనిపించి, ఆ వేశ్యలని చూడాలనిపించి, వాళ్ళ దెగ్గరికి వెళ్ళాడు. ఈసారి వాళ్ళు ఆయనని కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నారు. సరే అని అందరూ బయలుదేరారు. ఆయన అలా అంగదేశంలో అడుగుపెట్టగానే..........

తత్ర చ ఆనీయమానే తు విప్రే తస్మిన్ మహాత్మని |
వవర్ష సహసా దేవో జగత్ ప్రహ్లాదయన్ తదా ||

ఆకాశం నుంచి బ్రహ్మాండమైన వర్షం కురిసింది. వెంటనే రోమపాదుడు రుష్యశృంగుడికి నమస్కారం చేసి, ప్రార్ధించి, అంతఃపురానికి తీసుకెళ్ళి తన కుమార్తె అయిన శాంతని ఇచ్చి వివాహం జెరిపించారు.

కాబట్టి దశరథ మహారాజు ఆ రుష్యశృంగుడిని పిలవడానికి, అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు. అక్కడ 8 రోజులున్నాక, వెళ్ళిపోతూ దశరథుడు రోమపాదుడితొ ఇలా అన్నాడు...మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది, కనుక నీ కూతుర్ని అల్లుడిని కూడా నాతో పంపిస్తావా, అని అడిగాడు. రోమపాదుడు ఆనందంగా పంపించాడు. దశరథుడు చాలా సంతోషించి, వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్ళాడు.
*****************************

తీర్థం మన దేవాలయాలల్లో ఇచ్చే తీర్థము ఎన్నోరెట్లు కరోనా వైరస్ కు నివారణ గా అద్భుతంగా పనిచేస్తుంది.

తీర్థం 

మన దేవాలయాలల్లో ఇచ్చే తీర్థము ఎన్నోరెట్లు కరోనా వైరస్ కు నివారణ గా అద్భుతంగా పనిచేస్తుంది.
ఎందుకంటే ఈ తీర్థంలో
జాజికాయ 
జాపత్రి 
లవంగాలు 
ఏలకులు 
పచ్చకర్పూరం 
తులసి 
లాంటి అద్భుతమైన మూలికలు ఉంటాయి. ఇవన్నీ కూడా డా చాలా సమర్ధవంతంగా వైరస్ ను ఎదుర్కొనే శక్తివంతమైనవి. ప్రతిరోజు ఒక పావు కప్పు నీళ్లలో లో చిటికెడు ఈ పై చెప్పిన మూలికల మిశ్రమాన్ని కలిపి తీసుకుంటే కరోనా కాదు కదా ఎలాంటి వైరల్ జబ్బులు మనల్ని ఏమీ చేయలేవు ఇది సనాతన హిందూధర్మంలో ఆరోగ్యాన్ని కాపాడే సంప్రదాయానికి ఒక చిన్న ఉదాహరణ.

"అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం"

ఈ మెసేజ్ ని వీలైనంత ఎక్కువ మందికి పంపించండి మన హిందూ సంప్రదాయంలో ఉన్న గొప్పతనాన్ని అందరికీ తెలియజేయండి.
మరొక్క విషయం దేవాలయాలల్లో మోగించే గంటానాదం శంఖనాదం వినిపించనంత దూరం వరకూ గాలిలో ఉండే వైరస్ బ్యాక్టీరియా వంటి సూక్ష్మ క్రిములు నశించిపోతాయని సైంటిఫిక్ గా నిర్ధారణ అయింది

Saturday, March 7, 2020

ప్రతి వ్యక్తీ అనుదినం ఈ మూడు కోరికలు ఆశిస్తే చాలు.ఈశ్వరారాధనలో స్వామిని అర్ధించవలసిన ఆకాంక్షను ఒక శ్లోకంలో అమర్చి చెప్పారు మహాత్ములు."అనాయా సేన మరణం వినా దైన్యేన జీవనమ్! దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే!!

ప్రతి వ్యక్తీ అనుదినం ఈ మూడు కోరికలు ఆశిస్తే చాలు.

ఈశ్వరారాధనలో స్వామిని అర్ధించవలసిన ఆకాంక్షను ఒక శ్లోకంలో అమర్చి చెప్పారు మహాత్ములు.

"అనాయా సేన మరణం వినా దైన్యేన జీవనమ్! 
దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే!!

ఆయాసం లేకుండా మరణం , దైన్యం లేని జీవితం, దేహం విడిచాక మోక్షం..ఈ మూడింటినీ ప్రసాదించవలసినదిగా పార్వతీపతిని అర్ధిస్తున్నారు.

మొదటిది....ముందుగా ముగింపు సుఖంగా జరగాలనే కోరికను వ్యక్తం చేయడం చక్కని ఔచిత్యం. ప్రాణ ప్రయాణ సమయంలో కలిగే శారీరక, మానసిక యాతన మన ఆధీనంలో లేదు. కనుక ఆ సమయంలో ఎటువంటి యాతన ఉండకుండా; భగవత్ స్మరణతో అనాయాసంగా దేహాన్ని విడవడం ఒక వరం.

రెండవది...బతుకు గడవవలసిన తీరు. ఇది దైన్యం లేకుండా ఉండాలి. దిగులు, ఆధివ్యాదులు లేకుండా, మనసును కుంగదీసే పరిస్థితులు రాకుండా సాఫీగా జీవితం సాగాలనే అందరి కోరిక. అదే దీనిలో ఉంది.

మూడవది...అంతిమలక్ష్యం,జీవితానికి చివరి గమ్యం మృత్యువు కాదు. మృత్యువు తరువాత జీవుని స్థితి ఏమిటి? చేసిన దుష్కర్మలకు అనుగుణంగా దుర్గతులు తప్పవు. అందుకే మళ్ళీ దుర్గతుల పాలవకుండా, జన్మ పరంపరలకు లోనుకాకుండా పరమేశ్వరునిలో లీనం కావాలని కోరుకోవాలి.

ఆ లక్ష్యం నెరవేరాలంటే జీవితమంతా సద్బుధ్ధితో, సత్కర్మలతో, సద్భక్తితో సాగాలి. అటువంటి జీవితమే దైన్యరహిత జీవితం. నిరంతరం భక్తితో సదాశివుని స్మరించేవారికి , ఆరాధించేవారికి ఈ మూడు కోరికలు నేరవేరతాయనడంలో సందేహం లేదు.

Tuesday, March 3, 2020

కొరోనా వైరస్ ప్రజల్లో భయాన్ని కాదు, అవగాహన ని పెంచుదాం... నలుగురికీ ఈ విషయాలు తెలిసేలా పంచుదాం..

- కొరోనా వైరస్ కణాలు చాలా పెద్దవి. సుమారు 400-500 మైక్రో సైజులో కలిగి ఉంటాయి. అందుకే, *ఏ మాస్క్ వాడినా సరే, కరోనాని మీ దరి చేరనివ్వదు*. 

- ఈ వైరస్ గాలిలో ఉండిపోదు. వెంటనే నేలని చేరుతుంది. అందుకే, *గాలి ద్వారా వ్యాపించదు*.

- కొరోనా వైరస్ ఏదైనా లోహపు ఉపరితలం మీద 12 గంటలే ఉండగలదు. అందుకే, *సబ్బుతో చేతులను శుభ్రపరచుకుంటే, సరిపోతుంది*.

- కొరోనా వైరస్ బట్టల మీద 9 గంటలు మాత్రమే ఉంటుంది. అందుకే బట్టలు ఉతికినా, లేదా ఎండలో ఒక రెండు గంటలు ఆరేసినా, కొరోనా వైరస్‍ని అరికట్టినట్టే.

- ఈ వైరస్ చేతులపై 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అందుకే, స్పిరిట్ ఆధారిత స్టెరిలైజర్‍ని ఎప్పుడూ మీ వెంట ఉంచుకోవడం చాలా మంచిది.  

- ఈ వైరస్ గనుక, 26-27 ° C లో ఉంటే, చనిపోతుంది. అందుకే వేడిమి గల ప్రదేశాల్లో బ్రతకలేదు. కాబట్టి, వేడి నీళ్ళు తాగడం, ఎండలో నిలబడడం లాంటివి చేయండి. 

- కొన్నాళ్ళు ఐస్‍క్రీమ్ లాంటి చల్ల పదార్థాలకి దూరంగా ఉండడం చాలా ముఖ్యం.

*గోరువెచ్చటనీటిలో ఉప్పు , చిటికెడు పసుపు వేసి పుక్కిలించడం ద్వారా, టాన్సిల్స్ క్రిములను నిర్మూలించవచ్చు. తద్వారా, ఊపిరితిత్తుల్లోకి కొరొనా బ్యాక్టీరియా చేరకుండా నివారించవచ్చు. 

* కొన్ని రోజులపాటు జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లడం మానుకుంటే మంచిది. 

ఈ జాగ్రత్తలు తీసుకుంటే, వైరస్‍ని నివారించవచ్చు.
( UNICEF సౌజన్యంతో)

ప్రజల్లో భయాన్ని కాదు, అవగాహన ని పెంచుదాం... నలుగురికీ ఈ విషయాలు తెలిసేలా పంచుదాం..