Saturday, July 24, 2021

Happy Guru Purnima**************************** *Guru Vs Teacher**Difference between a Guru and a Teacher!***************************1. *A teacher* takes responsibility for your growth. *A Guru* makes you responsible for your growth.

*Happy Guru Purnima*
***************************
 *Guru Vs Teacher*
*Difference between a Guru and a Teacher!*
**************************
1. *A teacher* takes  responsibility for your
     growth.

    *A Guru* makes you   responsible for your growth.

2. A *teacher* gives you things you do not have and require.

   A *Guru* takes away things you have and do not require.

3. A *teacher* answers your questions.

  A *Guru* questions your  answers.

4. A *teacher* requires  obedience and discipline from the pupil.

   A *Guru* requires trust and humility from the pupil.

5. A *teacher* clothes you and prepares you for the outer journey.

    A *Guru* strips you naked and  prepares you for the inner journey.

6. A *teacher* is a guide on the path.

    A *Guru* is a pointer to the  way.

7. A *teacher* sends you on the road to success.

    A *Guru* sends you on the road to freedom.

8. A *teacher* explains the world and its nature to you.

     A *Guru* explains yourself and your nature to you.

9. A *teacher* gives you knowledge and boosts your  ego.

     A *Guru* takes away your knowledge and puncturescyour ego.

10. A *teacher* instructs you.

A *Guru* constructs you.

11. A *teacher* sharpens your  mind.

A *Guru* opens your mind.

12. A *teacher* reaches your mind.

A *Guru* touches your spirit.

13. A *teacher* instructs you on
       how to solve problems.

A *Guru* shows you how to
      resolve issues.

14. A *teacher* is a systematic   thinker.

A *Guru* is a lateral thinker.

15. One can always find a  *teacher.*

      But,

 a *Guru* has to find and
      accept you.

16. A *teacher* leads you by the hand.

 A *Guru* leads you by example.

17.When a *teacher* finishes
     with you, you celebrate.

When a *Guru* finishes with
     you, *life celebrates.*

*Decide yourself, whether you want to become a GURU or TEACHER...*

Friday, July 23, 2021

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 *గురువు....!* *అవతార పురుషుడైన రాముడంతటి వానికి వసిష్ఠుడనే మహర్షి గురుస్థానం వహించాడు.* *జగద్గురువైన శ్రీ కృష్ణునికి కూడా సాందీపుడు గురువయ్యాడు.*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

                      *గురువు....!*
                    

*అవతార పురుషుడైన రాముడంతటి వానికి వసిష్ఠుడనే మహర్షి గురుస్థానం వహించాడు.* 

*జగద్గురువైన శ్రీ కృష్ణునికి కూడా సాందీపుడు గురువయ్యాడు.* 

*గురు పరంపర ఈ జగత్తులో అనాదిగా ఉంది. ఇక సరైన గురువు దొరకడం పూర్వజన్మ సుకృతం.*

*గురువును ప్రత్యక్ష దైవంగా భావించే సంస్కృతి మనది. అన్నిటికీ దైవమే స్వయంగా రాలేడు. అందుకే ఆయన వివిధ రూపాలలో అంటే తల్లి, తండ్రి, గురువు మొదలైన వారిగా మన శ్రేయస్సును చూస్తూ, ప్రేమను పంచుతూ మన అభ్యుదయానికి తోడ్పడతాడు. అందుకే ఈ ముగ్గురినీ దేవుళ్లుగా అభివర్ణించారు.*

*గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గాను సాక్షాత్‌ పరబ్రహ్మంగానూ పేర్కొన్నారు. గురువు అంటే మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి విజ్ఞాన మనే వెలుగును నింపేవాడని స్థూలంగా పేర్కొంటుంటారు. సాధారణంగా గురువుల్లో రెండు రకాల వారిని మనం చూస్తుంటాం. వారిలో కొందరు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే వారైతే, మరి కొందరు లౌకిక విద్యను నేర్పించేవారు.*

*అయితే ఏ వ్యక్తి అయినా జీవితంలో గురువును ఆశ్రయించవలసిందే. ఒక్కోసారి మనం గురువును గుర్తించ లేకపోవచ్చు. తాళం చెవి లేకుండా తలుపు తెరవడం సాధ్యం కానట్లు గురువు తర్ఫీదు లేకుండా మనకు గుర్తింపు, జ్ఞానం కలగదని వేమన తన పద్యాలలో వివరించారు.*

*ఒక్కోసారి ప్రతిభ కలిగిన విద్యార్థుల వల్ల గురువుకు విశేష ఖ్యాతి లభిస్తుంది. కృష్ణుని వల్ల సాందీపునికి ఎవరికీ లభించనంతటి, ఆయన ఊహించనంతటి ప్రయోజనం సిద్ధించింది.* 

*కృష్ణుడు యమలోకానికి వెళ్లి గురు పుత్రుని సజీవుని చేసి తీసుకువచ్చి గరువుగారి ఋణం తీర్చుకున్నాడు. మంచి గురుశిష్యుల సంబంధాన్ని సారవంతమైన నేలపై సకాలంలో సరి పడా పడ్డ వర్షంగా ఒకరు అభివర్ణించారు. ఇక విద్య నేర్వడం అంటే ప్రతి విషయాన్ని మనం తెలునుకునే ప్రయత్నం చేయడం.*

*వివేకానందుని అభిప్రాయం ప్రకారం జ్ఞానం మనలోనే ఉంది.  మన లోనే విజ్ఞానముంటే విద్య నేర్వాలనే ప్రయత్నం దేనికీ అన్న ప్రశ్న ఉదయిస్తుంది. పాలలోనే నెయ్యి, పెరుగు, వెన్న దాగి ఉన్నాయి. అయితే వాటన్నిటినీ బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తేనే అవి కనబడతాయి, బయటకు వస్తాయి. ప్రయత్నం చేయకపోతే అవి ఉన్నా కనబడవు. మనలోని వివేకాన్ని వెలికి తెచ్చుకునే ప్రయత్నానికి సహాయ భూతుడిగా, సలహా దారుడిగా ఉంటాడు గురువు.*

*వేమన వంటి భోగి గురువు ఉపదేశం వల్లనే ప్రజా కవి కాగలిగాడు. పూర్వం రాజకుమారులు సైతం గురు కులానికి వెళ్లి గురువుల్ని సేవించేవారు. గురువు ప్రసన్నుడై విద్య నేర్పితే నేర్చుకోవడం, ఆయనను సేవించడం వల్ల విద్య పొందడం, డబ్బు లేదా ఏదైనా ఇచ్చి విద్య నేర్చుకోవడం మినహా విద్య నేర్చుకునేందుకు వేరే ఎటువంటి మార్గాలు లేవు.*

*గొప్ప గురువు మాత్రమే మన జీవితాల్లో స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తాడు.. అని విశ్వ కవి రవీంద్రనాథ్‌ టాగూర్‌ అన్నారు. మనిషి తన జీవిత కాలంలో ఒక వంతు గురువు ద్వారా, మరొక వంతు తన కృషి వల్ల, ఇంకొక వంతు సహధ్యాయిల సహచర్యం వల్ల, మరొక వంతు పాఠశాలల నుంచి నేర్చుకుంటూనే ఉంటాడు. నేర్చుకునే ప్రక్రియ లౌకికంగా ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది.*

*మనిషికి తొలి గురువు తల్లే. ఆమె వెంట ఉండే శిశువు చాలా విషయాలు గ్రహిస్తాడు. శిశువు ప్రపంచాన్ని చూసి చాలా నేర్చుకున్నా, ఎక్కు వగా చూసేది తల్లి కదలికలే కనుక ఆమె నుంచే ఎక్కువ విషయాలు గ్రహిస్తాడు. ఆ తర్వాతే లౌకిక విద్యలు నేర్పే గురువులు, మంత్ర విద్యలు నేర్పే మంత్ర గురువులు బోధనలు చేసే బోధ గురువులు వంటి వారందరూ వస్తారు...*✍️

.                      🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Thursday, July 22, 2021

బాలముకుందాష్టకం

బాలముకుందాష్టకం


🍁🍁🍁🍁🍁🍁🍁🍁

కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతమ్ |
వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి || ౧ ||

సంహృత్య లోకాన్వటపత్రమధ్యే శయానమాద్యంతవిహీనరూపమ్ |
సర్వేశ్వరం సర్వహితావతారం బాలం ముకుందం మనసా స్మరామి || ౨ ||

ఇందీవరశ్యామలకోమలాంగం ఇంద్రాదిదేవార్చితపాదపద్మమ్ |
సంతానకల్పద్రుమమాశ్రితానాం బాలం ముకుందం మనసా స్మరామి || ౩ ||

లంబాలకం లంబితహారయష్టిం శృంగారలీలాంకితదంతపంక్తిమ్ |
బింబాధరం చారువిశాలనేత్రం బాలం ముకుందం మనసా స్మరామి || ౪ ||

శిక్యే నిధాయాద్యపయోదధీని బహిర్గతాయాం వ్రజనాయికాయామ్ |
భుక్త్వా యథేష్టం కపటేన సుప్తం బాలం ముకుందం మనసా స్మరామి || ౫ ||

కలిందజాంతస్థితకాలియస్య ఫణాగ్రరంగేనటనప్రియంతమ్ |
తత్పుచ్ఛహస్తం శరదిందువక్త్రం బాలం ముకుందం మనసా స్మరామి || ౬ ||

ఉలూఖలే బద్ధముదారశౌర్యం ఉత్తుంగయుగ్మార్జున భంగలీలమ్ |
ఉత్ఫుల్లపద్మాయత చారునేత్రం బాలం ముకుందం మనసా స్మరామి || ౭ ||

ఆలోక్య మాతుర్ముఖమాదరేణ స్తన్యం పిబంతం సరసీరుహాక్షమ్ |
సచ్చిన్మయం దేవమనంతరూపం బాలం ముకుందం మనసా స్మరామి || ౮ ||

🍁🍁🍁🍁🍁🍁🍁🍁

Wednesday, July 14, 2021

నాన్న ఎవరు??⚜️**బ్రహ్మదేవుడు చాలా బిజీగా తల రాతలు రాసే పనిలో ఉన్నాడు. ఇంతలో నేను, భూమి మీదకు వెళ్ళను అని మారాం చేయడం మొదలుపెట్టాను.*

*⚜️నాన్న ఎవరు??⚜️*

*బ్రహ్మదేవుడు చాలా బిజీగా తల రాతలు రాసే పనిలో ఉన్నాడు. ఇంతలో నేను, భూమి మీదకు వెళ్ళను అని మారాం చేయడం మొదలుపెట్టాను.*

*“భూమి మీద నాకు ఎవ్వరూ తెలీదు. నేను ఎలా బతకగలను? అని అడిగాను. నువ్వేం భయపడకు. నిన్ను కాచి కాపాడటానికి నా అంశగా ఒక అమ్మను తయారుచేశాను. ఆమె కడుపులో నిన్ను పుట్టిస్తా” అన్నాడు బ్రహ్మదేవుడు.*

*“అయితే సరే, కానీ నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఏడవటం మొదలుపెడతా. అప్పుడు మీరు నా ఇబ్బందిని తొలగించాలి” అనే షరతు పెట్టాను.*

*దానికి బ్రహ్మా, “సరే నీకు మాటలు రానంత వరకు బ్రహ్మా విష్ణు మహేశ్వరులం ముగ్గురు నీకు సహాయం చేస్తాం” అన్నాడు.*

*“మరి, ఆ తర్వాత చెయ్యరా?” అని అడిగా.*

*“అదేం లేదులే. నీకు మాటలోచ్చాకా నీకో మహా మంత్రం భోదిస్తాం. నీకు ఏ కష్టం వచ్చినా, ఒక్కసారి ఆ మంత్రం పఠిస్తే తప్పకుండా నీకు సహాయం దొరుకుతుంది.” అని చెప్పాడు బ్రహ్మా.*

*మళ్ళీ ఇంకేదో అడగబోయే లోపల ఆ పరబ్రహ్మ, తన బెడ్రూం బాల్కనీ లోంచి నన్ను కిందకి త్రోసేశాడు. ఎలా వచ్చి చేరానో తెలియదు గానీ, ఆసుపత్రి బెడ్ మీద మా అమ్మ పక్కన వచ్చిపడ్డాను.*

*అమ్మ పక్కన హాయిగా నిద్రపోతున్న నన్ను, ఓ పెద్దమనిషి తన చేతిలోకి తీసుకున్నాడు. భయమేసి, అమ్మ వైపు చూసి ఏడుపు ముఖం పెట్టాను. “మీ నాన్నగారు రా!” అంటూ అమ్మ తన కంటి చూపు తో ఆయన్ని పరిచయం చేసింది.*

*బ్రహ్మాదేవుడు నాకు అమ్మ గురించి చెప్పి పంపాడు. తను అన్ని చోట్ల ఉండటం కుదరక అమ్మని సృష్టించాను అని. మరి నాన్న అంటే ఎవరు? భూమి మీద పడిన మొదటి రోజే నా బుర్రలో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి.ఆ దేవుడినే అడిగి తెలుసుకుందామని ఏడుపు మొదలుపెట్టా.*

*“ఇప్పుడే కదా భూమి మీద పడ్డావు. అప్పుడే నన్ను గుర్తుచేసుకున్నావేమిటి?” అని అడిగాడు. అమ్మ గురించి చెప్పారు గాని, నాన్న గురించి ఏమీ చెప్పలేదెంటని అడిగా.*

*“నీ జన్మకి నాంది, నీ భవితకు పునాది” అని ముక్తసరిగా బదులిచ్చి, “అర్ధమైందా?” అని ప్రశ్నించాడు.*

*“పాలు తాగే పసివాడి ప్రశ్నకి ప్రాస తో బదులిస్తే ఎలా అర్ధం అవుతుంది స్వామి” అని సమాధానం చెప్పాను.*

*ఒక అర్ధం లేని చిరునవ్వు నవ్వి, “నీకూ మీ అమ్మకు కాపుగా నేను నియమించిన అంగరక్షకుడు” అని క్లుప్తంగా చెప్పాడు. అప్పుడు అర్ధమైంది నా బుజ్జి బుర్రకి, నా కష్టం తీర్చేది అమ్మ అని. మాకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాన్నదని.*


*ఆ రోజు నుంచి నా చిన్ని కళ్ళు నాన్న కోసం వెతుకుతూనే ఉండేవి. ఎప్పుడో ఉదయన్నే వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేవాడు. “ఏం, నేనంటే ప్రేమ లేదా” అని ప్రశ్నించా ఆ దేవుడిని మళ్ళీ. “నీ మీద ప్రేమ ఉంది కాబట్టే, రోజు బయటికి వెళ్ళి కష్టపడి పని చేసి వస్తున్నాడు” అని బదులిచ్చాడు బ్రహ్మా. అర్ధం కాలేదని చెప్పాను. కొన్నేళ్లకు నీకే అర్ధం అవుతుందిలే అన్నాడు.*

*ఈయన అన్నీ తల తిక్క సమాధానాలే చెబుతాడులే అనుకుని, నా దగ్గరికి వచ్చిన మా నాన్న మొహం చూసా. మా నాన్న ముఖం నీరసంగా కనిపించింది. పలకరింపు కోసం ఒక చిరునవ్వు నవ్వా. మా నాన్న ముఖం లోని నీరసం మాయమైంది. నన్ను చూసిన ఆయన ముఖం పున్నమి చంద్రుడిలా మెరిసిపోసాగింది. ఆ దేవ దేవుడు నా నవ్వులో ఇంత మహిమ దాచాడా! అని గర్వపడటం మొదలుపెట్టా.*

 *మళ్ళీ మళ్ళీ నవ్వడం నేర్చుకున్నా. నేను నవ్విన ప్రతి సారి, మా నాన్న ముఖంలో ఆనందం పది రెట్లు ఎక్కువగా కనిపించేది. మా నాన్న నన్ను ముద్దులతో ముంచేయటం మొదలుపెట్టారు. అలా ఆ సాయంత్రాలు మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచాయి.*

*కొన్నాళ్ళకి, నా చిట్టి పాదాలకి కొంచెం బలం చేకూరింది. నడక నేర్చుకుందామని ప్రయత్నించా. కానీ ఫలితం లేదు. పదే పదే పడిపోతూనే ఉన్నా. ఇంతలో నాన్న తన చూపుడు వేలును నాకు అందించాడు. నేను నడవలేకపోతున్నానని వెక్కిరిస్తున్నాడనుకున్నా! “నా వేలు పట్టుకుని నిల్చో నాన్నా” అన్నారు.*

*నిలబడగలిగాను కానీ, నా అడుగులు ఇంకా తడబడుతూనే ఉన్నాయి. ఆ మహా శివుణ్ణి, మనసులో  ప్రార్దించడం మొదలుపెట్టా. తన ఢమరుక నాదంతో నా పాదాలని ప్రేరేపించమని ప్రాధేయపడ్డాను. ఆ ఢమరుక నాదపు సడిలో, వడి వడిగా అడుగులు వేయటం నేర్చుకుని మా నాన్నను ఆశ్చర్యపరుద్దామనుకున్నా. ఆ మహా శివుడికి నా మొర వినిపించలేదేమో! నా ప్రార్థనకి జవాబు దొరకలేదు. ఇంతలో మా నాన్న వెల్లకిలా పడుకున్నారు. నన్ను తన రెండు చేతులతో పట్టుకుని తన గుండెల మీద నిలబెట్టుకున్నారు. డమరుక నాదం లేకపోతేనేం!, నా గుండే చప్పుడుని నీ అరికాళ్ళతో అనుభవించి అడుగులు వేయటం నేర్చుకోమని అభయమిచ్చారు. ఏం మాయో తెలీదు. నాన్న గుండె చప్పుడు నా కాళ్ళకి తగలగానే నేనే శివుడిలా మారిపోయా. నడక రాని నేను నాన్న గుండెల మీద యధేచ్చగా నాట్యం చేయటం మొదలుపెట్టా.*

*నడక నేర్చిన నా చిన్ని పాదాలు కొత్త గమ్యాలను వెతకటం ప్రారంభించాయి. నడవటం మొదలుపెట్టాను. కొంత దూరం వెళ్ళాక, అటూ ఇటూ చూశాను. ఎవ్వరూ కనిపించలేదు. భయం వేసింది. ఆ శ్రీ మహా విష్ణువు అన్ని చోట్ల ఉంటాడుగా, మరి నాకు భయమెందుకు. ఆయన్నే పిలుద్దాం అని మనసులో తలుచుకున్నా. ఆయన కనిపించలేదు గాని వినిపించాడు. “ఏమైంది బాలకా” అని అన్నాడు. “భయం వేసింది స్వామి. అందుకే పిలిచా” అన్నా నేను.*

*“భయం ఎందుకు? నీవు నడుస్తుంది మీ నాన్న నీడ లోనేగా” అన్నాడు. ఆశ్చర్యం వేసి వెనక్కి తిరిగి చూసా. అవును నాన్న నా వెనకే ఉన్నారు. నాకు తగినంత స్వేచ్చనిస్తూ, నా ప్రయాణాన్ని గమనిస్తూ, నన్ను ఏ ప్రమాదం తాకకుండా, నాకు రక్షణగా నా వెనకే నడుస్తున్నారు. నా మనసులో భయం తొలగి ముఖంలో చిరునవ్వు మొదలయ్యింది. అప్రయత్నంగానే నా పెదవులు ‘నాన్న’ అని పలకటం మొదలుపెట్టాయి. నాన్న నన్ను ఎత్తుకుని నా ముఖమంతా ముద్దులతో ముంచేశారు. మళ్ళీ మళ్ళీ నాన్న అని పిలవమన్నారు. నేను పిలిచిన కొద్దీ, నాన్న ముఖంలో ఆనందం రెట్టింపు అవుతూనే ఉంది.*


*నాకు ఏ అవసరం వచ్చినా, ఏడ్చి ఆ దేవుడిని పిలిచే బదులు, మా నాన్నని పిలవడమే మేలు అనిపించింది. దేవుడు వచ్చేవాడో, రాడో తెలీదు గాని మా నాన్న మాత్రం నన్ను కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నాడు. నా అవసరాలన్నీ, నేను చెప్పక ముందే తెలుసుకుని మరీ తీర్చేవాడు. కొన్నాళ్ళకు నాన్న కూడా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ ఆయన నేర్పిన జీవిత పాఠాలు నాకు తోడుగా ఉండేవి.*

*ఆఖరికి నేను కూడా ఆ దేవుడి దగ్గరికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను.*

*“నీ జీవిత మజిలీ ఎలా సాగింది?” అని ప్రశ్నించారు బ్రహ్మా విష్ణు మహేశ్వరులు.*

*“మీరు నాకు ఏ మంత్రమూ భోదించకపోయినప్పటికీ, నా జీవన చక్రం బాగానే సాగింది ప్రభు.” అని సమాధానం చెప్పాను గర్వంగా.*

*“అదేంటి అలా అంటావ్! మేము నీ నోట పలికించిన మంత్రాన్ని రోజు నువ్వు పఠిస్తుండటం ఉండటం మేము గమనిస్తూనే ఉన్నాం” అన్నారు మూకుమ్మడిగా.*

*“నాకు ఏం అర్ధం కావట్లేదు స్వామి” అని బదులిచ్చా నేను. బ్రహ్మా విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకరిలో ఒకరు ఐక్యం అవుతూ ఒకే రూపంగా మారి ప్రత్యక్ష్యమయ్యారు. ఆశ్చర్యపోయాను. మా నాన్న రూపం నా ముందు ప్రత్యక్ష్యమైంది. అప్పుడు గానీ అర్ధం కాలేదు ఈ మనిషి బుర్రకి, (మట్టి బుర్రకి). “అమ్మ ఆ దేవుడి అంశ అని” “నాన్న సాక్ష్యాత్ దేవుడని”. మిమ్మల్ని గుర్తించలేకపోయాను, నన్ను క్షమించండి స్వామి. అని ఆయన పాదాలమీద సాగిలపడ్డాను.*

*ఆ దేవుడి ముఖంలో అదే చెరగని చిరునవ్వు. నా భుజాల మీద చేయి వేసి పైకి లేపారు. ప్రేమగా హత్తుకున్నారు. నన్ను క్షమించి, నా ఆత్మకు మోక్షం ప్రసాదించండి స్వామి అని అడిగా ఆయన చెవిలో. క్షమిస్తా, కానీ ఒక్క షరతుతో అన్నాడు ఆ దేవ దేవుడు. ఏమిటది స్వామీ! అని అడిగా ఆశ్చర్యంగా. నన్ను ఆఖరుసారిగా ‘నాన్న’ అని సంభోదించగలవా అని అడిగారు ఆ సర్వేశ్వరులు. ఆ మహా మంత్రాన్ని ఇంకోసారి జపించడానికి, నిముషం కూడా ఆలస్యం చేయలేదు నేను. నాన్న అని పిలిచి ఆయనలోనే ఐక్యం అయిపోయా.*

*🙏“అమ్మ దేవుడి అంశ అయితే, నాన్న సాక్ష్యాత్ దేవుడే”🙏*
*ఈ వ్యాసం ప్రతి ఒక్క నాన్నకు అంకితం... 

నా మనస్సును కదిలించింది. నాన్న గొప్పదనాన్ని వచ్చే తరానికి,యువతకు తెలియాలి. నా బాధ్యత గా మీకు షేర్ చేస్తున్నాను. మీరు షేర్ చెయ్యండి. మంచిని  పెంచుదాం.🙏🙏

మానస సరోవరం 👏