Saturday, October 31, 2020

శ్రీమద్రామాయణ మహాకావ్య సృష్టికర్త వాల్మీకి. ఆయన జయంతిని ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకొంటారు. వసిష్ఠ, నారద పులస్త్య మహర్షుల సోదరుడైన ప్రచేతసుడి పుత్రుడు. ఆయన పూర్వ నామధేయం రత్నాకరుడు. ఆ జన్మలో ఇతడు బోయవాడని స్కాందపురాణం చెబుతోంది. శంఖరుషి ఉపదేశం పొంది మరుజన్మలో వాల్మీకిగా అవతరించినట్లు వెల్లడిస్తోంది.సత్యయుగంలో బ్రహ్మ ఓసారి స్వర్గలోకానికి వెళ్లి ఇంద్రసభలో పాల్గొన్నాడు. అక్కడి అప్సరసలను చూసి, మనసు చలించడంతో బ్రహ్మ రేతస్సు పతనమై పంకం(బురద)లో పడింది. ఆ పంకం నుంచి ప్రాచేతసుడు జన్మించాడు. అతడు తన జన్మ రహస్యాన్ని సభలో వెల్లడించడంతో బ్రహ్మ ఆగ్రహించి ‘నీవు బోయవాడివై క్రూర కర్మలతో, అతిహేయమైన జీవితం గడుపుతావు’ అని శపిస్తాడు. శాప విముక్తికి మార్గం తెలపాల్సిందిగా తండ్రిని కోరతాడు. సత్పురుషుల కృపతో రామనామం జపించి, రామాయణం రచించి కృతార్థుడవుతావని శాప నివారణోపాయం చెబుతాడు.శాపగ్రస్తుడైన అతడు బోయవాడై కిరాతులతో స్నేహం చేసి, బోయ యువతిని వివాహమాడి, బిడ్డల్ని కని, అడవి మృగాలను వేటాడి, పచ్చిమాంసం తింటూ బాటసారుల్ని దోచుకుంటూ హేయజీవనం కొనసాగించేవాడు.ఓసారి అడవిలో వెళ్తున్న సత్పరుషుల్ని అడ్డగించి, వారి దగ్గరున్నది దోచుకోవాలనుకున్నాడు. ‘నీవింత పాపం మూటకట్టు కుంటున్నావు కదా! ఈ పాపఫలితాన్ని నీ భార్య బిడ్డలు కూడా పంచుకుంటారేమో అడిగి రా!’ అని రుషులు చెబుతారు. రత్నాకరుడు ఇంటికి వెళ్లి రుషులడిగిన ప్రశ్నే వేశాడు భార్యకు. ఆమె అంగీకరించలేదు. తిరిగి రుషుల దగ్గరికి వెళ్లి, జరిగింది చెప్పి, పశ్చాత్తప్తుడైనాడు. తనకు తరణోపాయం చెప్పమని వారిని వేడుకున్నాడు. రామనామజపం చేయమని మంత్రోపదేశం చేసి రుషులు వెళ్లిపోయారు. అది సరిగ్గా గుర్తులేక రత్నాకరుడు ‘మరామరా’ అంటూ జపం చేస్తూ కొన్ని వందల సంవత్సరాలు కదలకుండా కూర్చుని, తపస్సు చేశాడు. అతడి చుట్టూ మట్టి పుట్టలు పుట్టలుగా పేరుకుంది. పుట్టను ‘వల్మీకం’ అంటారు. ఆ కారణంగా అతడు వాల్మీకి అయ్యాడు. నారదమహర్షి వచ్చి అతడికి రామకథ వినిపించాడు.ఒక రోజున ఓ చెట్టుమీద దాంపత్యానుభవం పొందుతున్న క్రౌంచ పక్షుల జంటను చూసి బోయవాడొకడు బాణం వదలగా, ఆ శరాఘాతానికి మగపక్షి కింద పడి ప్రాణం విడిచింది. ఆడపక్షి దుఃఖంతో విలవిల్లాడింది. ఆ హృదయవిదారక దృశ్యం చూసిన వాల్మీకి హృదయం ద్రవీభూతమైంది. కాకతాళీయంగా ఆ శోకంనుంచి ఒక శ్లోకం ఆవిర్భవించింది. ఆ శ్లోకం ‘మానిషాద’ అనే పదంతో ఆరంభమై శ్రీమద్రామాయణ మహాకావ్యంగా రూపొందింది. బ్రహ్మ సంకల్పంతో శ్రీరాముడి భూతభవిష్యద్వర్తమాన కాల వృత్తాంతమంతా ఓ మహావరమై సంప్రాప్తించింది వాల్మీకికి. ఈ భూమి మీద అవతరించిన ఆది కావ్యం రామాయణం. అది రచించిన వాల్మీకి ఆదికవి. రామకథను అందించి లోకానికి ధర్మప్రబోధం చేశాడు. ధర్మార్థకామ మోక్షాలనే నాలుగు మూలస్తంభాలపైన మానవ చైతన్య సౌధానికి పునాదులు వేసిన క్రాంతదర్శి. మానవజాతికి మార్గదర్శి. జీవితంలో అవరోధాలు ఎదురైనప్పుడు, దృఢచిత్తంతో వాటినెలా అధిగమించాలో, మనిషి మనిషిగా ఎలా బతకాలో, ఎలా ఎదగాలో, ఎలా ఒదగాలో నేర్పిన దూరదర్శి. రామకథ మానవ జీవన ప్రస్థానానికి ఉపయోగపడే దివ్యసుధ. ధర్మానికి రాముడి రూపంలో ప్రతిష్ఠచేసిన ప్రసిద్ధ సిద్ధుడు వాల్మీకి.

శ్రీమద్రామాయణ మహాకావ్య సృష్టికర్త వాల్మీకి. ఆయన జయంతిని ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకొంటారు. వసిష్ఠ, నారద పులస్త్య మహర్షుల సోదరుడైన ప్రచేతసుడి పుత్రుడు. ఆయన పూర్వ నామధేయం రత్నాకరుడు. ఆ జన్మలో ఇతడు బోయవాడని స్కాందపురాణం చెబుతోంది. శంఖరుషి ఉపదేశం పొంది మరుజన్మలో వాల్మీకిగా అవతరించినట్లు వెల్లడిస్తోంది.
సత్యయుగంలో బ్రహ్మ ఓసారి స్వర్గలోకానికి వెళ్లి ఇంద్రసభలో పాల్గొన్నాడు. అక్కడి అప్సరసలను చూసి, మనసు చలించడంతో బ్రహ్మ రేతస్సు పతనమై పంకం(బురద)లో పడింది. ఆ పంకం నుంచి ప్రాచేతసుడు జన్మించాడు. అతడు తన జన్మ రహస్యాన్ని  సభలో వెల్లడించడంతో బ్రహ్మ ఆగ్రహించి ‘నీవు బోయవాడివై క్రూర కర్మలతో, అతిహేయమైన జీవితం గడుపుతావు’ అని శపిస్తాడు. శాప విముక్తికి మార్గం తెలపాల్సిందిగా తండ్రిని కోరతాడు. సత్పురుషుల కృపతో రామనామం జపించి, రామాయణం రచించి కృతార్థుడవుతావని శాప నివారణోపాయం చెబుతాడు.
శాపగ్రస్తుడైన అతడు బోయవాడై కిరాతులతో స్నేహం చేసి, బోయ యువతిని వివాహమాడి, బిడ్డల్ని కని, అడవి మృగాలను వేటాడి, పచ్చిమాంసం తింటూ బాటసారుల్ని దోచుకుంటూ హేయజీవనం కొనసాగించేవాడు.
ఓసారి అడవిలో వెళ్తున్న సత్పరుషుల్ని అడ్డగించి, వారి దగ్గరున్నది దోచుకోవాలనుకున్నాడు. ‘నీవింత పాపం మూటకట్టు కుంటున్నావు కదా! ఈ పాపఫలితాన్ని నీ భార్య బిడ్డలు కూడా పంచుకుంటారేమో అడిగి రా!’ అని రుషులు చెబుతారు. రత్నాకరుడు ఇంటికి వెళ్లి రుషులడిగిన ప్రశ్నే వేశాడు భార్యకు. ఆమె అంగీకరించలేదు. తిరిగి రుషుల దగ్గరికి వెళ్లి, జరిగింది చెప్పి, పశ్చాత్తప్తుడైనాడు. తనకు తరణోపాయం చెప్పమని వారిని వేడుకున్నాడు. రామనామజపం చేయమని మంత్రోపదేశం చేసి రుషులు వెళ్లిపోయారు. అది సరిగ్గా గుర్తులేక రత్నాకరుడు ‘మరామరా’ అంటూ జపం చేస్తూ కొన్ని వందల సంవత్సరాలు కదలకుండా కూర్చుని, తపస్సు చేశాడు. అతడి చుట్టూ మట్టి పుట్టలు పుట్టలుగా పేరుకుంది. పుట్టను ‘వల్మీకం’ అంటారు. ఆ కారణంగా అతడు వాల్మీకి అయ్యాడు. నారదమహర్షి వచ్చి అతడికి రామకథ వినిపించాడు.
ఒక రోజున ఓ చెట్టుమీద దాంపత్యానుభవం పొందుతున్న క్రౌంచ పక్షుల జంటను చూసి బోయవాడొకడు బాణం వదలగా, ఆ శరాఘాతానికి మగపక్షి కింద పడి ప్రాణం విడిచింది. ఆడపక్షి దుఃఖంతో విలవిల్లాడింది. ఆ హృదయవిదారక దృశ్యం చూసిన వాల్మీకి హృదయం ద్రవీభూతమైంది. కాకతాళీయంగా ఆ శోకంనుంచి ఒక శ్లోకం ఆవిర్భవించింది. ఆ శ్లోకం ‘మానిషాద’ అనే పదంతో ఆరంభమై శ్రీమద్రామాయణ మహాకావ్యంగా రూపొందింది. బ్రహ్మ సంకల్పంతో శ్రీరాముడి భూతభవిష్యద్వర్తమాన కాల వృత్తాంతమంతా ఓ మహావరమై సంప్రాప్తించింది వాల్మీకికి. ఈ భూమి మీద అవతరించిన ఆది కావ్యం రామాయణం. అది రచించిన వాల్మీకి ఆదికవి. రామకథను అందించి లోకానికి ధర్మప్రబోధం చేశాడు. ధర్మార్థకామ మోక్షాలనే నాలుగు మూలస్తంభాలపైన మానవ చైతన్య సౌధానికి పునాదులు వేసిన క్రాంతదర్శి. మానవజాతికి మార్గదర్శి. జీవితంలో అవరోధాలు ఎదురైనప్పుడు, దృఢచిత్తంతో వాటినెలా అధిగమించాలో, మనిషి మనిషిగా ఎలా బతకాలో, ఎలా ఎదగాలో, ఎలా ఒదగాలో నేర్పిన దూరదర్శి. రామకథ మానవ జీవన ప్రస్థానానికి ఉపయోగపడే దివ్యసుధ. ధర్మానికి రాముడి రూపంలో ప్రతిష్ఠచేసిన ప్రసిద్ధ సిద్ధుడు వాల్మీకి.

Friday, October 30, 2020

హనుమ నేర్పిన నీతి...🍁🍁🍁🍁

హనుమ నేర్పిన నీతి...
🍁🍁🍁🍁
 
సాక్షాత్తు భగవంతుడిని కూడా ప్రశ్నించవచ్చా? ఎవరిని.. ఎలా అడగాలి? అన్న ప్రశ్నలకు హనుమంతుడు ఒక సమాధానంగా నిలుస్తాడు.

 సీతాదేవిని రావణుడు అపహరించిన తర్వాత ఆమెను వెదుకుతూ రామలక్ష్మణులు రుష్యమూక పర్వత ప్రాంతానికి చేరుకుంటారు. 

సుగ్రీవుడి నివాస ప్రాంతం అది. తనను చంపడానికి తన అన్న వాలి వీరిని పంపించారా అని అనుమానించి, విషయం తెలుసుకునేందుకు తన మంత్రి అయిన హనుమంతుడిని పంపుతాడు. 

మారుతి మారు వేషంలో రామలక్ష్మణుల దగ్గరకు వచ్చి అనేక విధాలుగా ప్రశ్నిస్తాడు.

 ‘రాజర్షి దేవ ప్రతిమౌ తాపసౌ సంశితవ్రతౌ! దేశం కథమిమం ప్రాప్తౌ భవంతౌ వరవర్ణినౌ!!’

 మీరిద్దరూ మంచి తేజోవంతుల్లా, తీవ్రమైన తపోదీక్ష పట్టిన వారిలా ఉన్నారు. మీ రూపం తాపసుల్లా ఉన్నా మీ తేజం క్షత్రియత్వాన్ని సూచిస్తోంది. గొప్ప పని ఉంటే తప్ప మీవంటి యోధులు క్రూరమృగాలు సంచరించే ఇలాంటి చోటుకు రారు’ అని ప్రశ్నిస్తాడు హనుమ.

 ప్రశ్న అంటే ఇలా ఉండాలి. ఒక్క అక్షరం ఎక్కువ తక్కువ కాకుండా ప్రశ్నలు వేశాడు హనుమ. 
ఇంత కాలం తాను ఎవరి గురించి ఎదురు చూస్తున్నాడో ఆ దైవం ఎదుట నిలబడినప్పుడు హనుమ తొందరపడలేదు. వచ్చింది ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. 
ఎంత గొప్పగా ప్రశ్నించాడంటే రాముడే ముచ్చటపడ్డాడు. వ్యాకరణ పండితుడు తప్ప మరొకరు ఇలా మాట్లాడలేడన్నాడు. హనుమ ప్రశ్న స్వీకరించిన వ్యక్తి కూడా ఆనందపడేలా అడిగాడు.. 

మనం కూడా మన సందేహాన్ని ప్రశ్నను కూడా గొప్పగా అడగ గలగాలి..

జై హనుమాన్..

🍁🍁🍁🍁