Monday, November 30, 2020

🌈కార్తీకపురాణం 16 వ అధ్యాయం🌈🪔🪔🪔🪔🪔🌹 స్తంభ దీప ప్రశంస

"

🌈కార్తీకపురాణం 16 వ అధ్యాయం🌈
🪔🪔🪔🪔🪔

🌹 స్తంభ దీప ప్రశంస

వశిష్టుడు చెబుతున్నాడు -
"ఓ రాజా! కార్తీకమాసము దామోదరునికి అత్యంత  ప్రీతికరమైన మాసము. ఆ మాసముందు స్నాన, దాన, వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీకమాసమందు తనకు శక్తి వున్నా దానము చేయరో, అట్టి వారు రౌరవాది నరకబాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూలదానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆవిధముగానే నెలరోజులలో ఏ ఒక్కరోజూ  విడువకుండ, తులసి కోటవద్దగాని - భగవంతుని సన్నిధినిగాని దీపారాధన చేసిన యెడల సమస్త పాపములు నశించుటయే గాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీకశుద్ద పౌర్ణమి రోజున నదీస్నానమాచరించి, భగవంతుని సన్నిధియందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు, నారికేళ ఫలదానము జేసిన యెడల - చిరకాలమునుండి సంతతి లేనివారికి పుత్ర సంతానము కలుగును.

సంతానము వున్న వారు చేసినచో సంతాన నష్టము జరుగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై యు౦దురు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపమునుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు  ఆకాశ దీపముగాని, స్తంభ దీపాము గాని వుంచి నమస్కరించిన స్త్రీపురుషులకు సకలైశర్యములు కలిగి, వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశ దీపము పెట్టు వారు  శాలిధాన్యంగాని, నువ్వులుగాని ప్రమిద అడుగున పోసి దీప ముంచవలమును. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారును, లేక దీపం పెట్టువారి పరిహాసమాడువారును చుంచు జన్మ మెత్తుదురు ఇందులకొక కథ కలదు. చెప్పెదను వినుము.

దీప స్తంభము విప్రుడగుట

ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మంతగ మహాముని ఒక చోట అశ్రమాన్ని ఏర్పరచుకొని, దానికి దగ్గరలో నొక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని, నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీకమాసములో ఆ యాశ్రమము చుట్టు ప్రక్కల మునులు కూడ వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము అలయద్వారాల పై దీపములు వెలిగించి, కడుభక్తితో శ్రీహరిని పూజించి వెళ్లుచుండెడివారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్దడు తక్కిన మునులను జూచి "ఓ సిద్దులారా! కార్తీకమాసములో హరిహరాదుల ప్రీతికోరకు స్తంభదీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకూ తెలిసిన విషయమే కదా! రేపు కార్తీకశుద్ధ  పౌర్ణమి. హరిహరాదుల ప్రీతికొరకు ఈ ఆలయానికెదురుగా ఒక స్త౦భముపాతి, దానిపై దీపమును పెట్టుదము. కావున మనమందరము అడవికి వెళ్లి నిడుపాటి స్తంభము తోడ్కునివత్తము, రండు" అని పలుకగా అందరు పరమానందభరితులై అడవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామి కెదురుగా పాతిరి. దానిపై శాలి ధాన్యముంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తివేసి దీపము వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణపఠనము చేయుచుండగా ఫెళ ఫెళమను శబ్దము వినిపించి, అటుచూడగా వారు పాతిన స్తంభము ముక్కలైపడి, దీపము ఆరిపోయి చెల్లాచెదురై పడియుండెను. ఆ దృశ్యము చూచి  వారందరు ఆశ్చర్యముతో నిలబడియుండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతనిని జూచి "ఓయీ నీ వేవడవు? నీవీ స్తంభమునుండి యేలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి" అని ప్రశించిరి. అంత, ఆ పురుషుడు వారందరకు నమస్కరించి "పుణ్యాత్ములారా! నేను క్రిందటి జన్మమందు బ్రహ్మణుడను. ఒక జమిందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా యైశ్వర్యముండుటచే మదాంధుడనై న్యాయాన్యాయా విచక్షణలు లేక ప్రవర్తించితిని. దుర్భుద్దులలవడుటచే వేదములు చదువక శ్రీహరిని పూజింపక, దానధర్మాలు చేయక మెలగితిని. నేను నా పరివారముతో కూర్చుండియున్న సమయముననే విప్రుడయినా వచ్చినన్ను ఆశ్రయించినను అతనిచె నా కాళ్ళు కడిగించి, ఆ నీళ్ళు నెత్తి మీద వేసుకోమని చెప్పి, నానా దుర్భాషలాడి పంపుచుండెవాడను. నేను వున్నతాసనముపై కూర్చుండి అతిధులను నేలపై కూర్చుండుడని చెప్పెడివాడను. స్త్రీలను, పసిపిల్లలను హీనముగా చూచుచుండెడి వాడెను. అందరును నా చేష్టలకు భయపడువారే కాని, నన్నెవరును మందలింపలేక పోయిరి. నేను చేయు పాపకార్యములకు హద్దులేక పోయెడిది. దానధర్మములు యెట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గడనై, పాపినై అవసానదశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి, లక్ష జన్మలముందు కుక్కనై, పదివేల జన్మలు కాకినై, ఐదువేల జన్మలు తొండనై, ఐదు వేల జన్మలు పేడపురుగునై, తర్వాత వృక్ష  జన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను జేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నాకర్మలన్నియు మీకు తెలియచేసితిని, నన్ను మన్ని౦పు" డని వేడుకొనెను.

ఆ మాటలాలకించిన, మునులందరు నమితాశ్చర్యమొంది "ఆహా! కార్తీకమాసమహిమ మెంత గొప్పది అదియునుగాక, కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు. కఱ్ఱలు, రాళ్లు, స్త౦భములు కూడా మన కండ్ల యెదుట ముక్తి నొందుచున్నవి. వీటన్ని౦టి కన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపముంచిన మనుజునకు వైకుంఠప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే యీ స్త౦భమునకు ముక్తికలిగిన" దని మునులు అనుకోనుచుండగా, ఆ పురుషుడా మాటలాలకించి "మునిపుంగవులారా! నాకు ముక్తి కలుగు మార్గమేదైనా గలదా? ఈ జగంబున నెల్లరుకు నెటుల కర్మ బంధము కలుగును? అది నశి౦చుటెట్లు? నాయీ సంశయము బాపు"డని ప్రార్ధించెను. అక్కడ వున్న మునిశ్వరుల౦దరును తమలో నోకడగు అంగీరసమునితో "స్వామి! మీరే అతని సంశయమును తీర్చగల సమర్ధులు గాన, వివరించు"డని కోరిరి. అంత నా౦గీరసుడిట్లు చెప్పుచున్నాడు.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి షోడశాధ్యాయము - పదహారో రోజు పారాయణము సమాప్తం.

         🪔 ఓం నమః శివాయ 🪔

    🌹సర్వేజనా సుఖినోభవంతు🌹

| ఓం నమశ్శివాయ |||| శ్రీ గురుభ్యోనమః ||కార్తీక పురాణం - 13 వ అధ్యాయము🪔 కన్యాదాన ఫలం, సువీరచరిత్రము 🪔

|| ఓం నమశ్శివాయ ||
|| శ్రీ గురుభ్యోనమః ||

కార్తీక పురాణం - 13 వ అధ్యాయము

🪔 కన్యాదాన ఫలం, సువీరచరిత్రము 🪔

తిరిగి వశిష్టుడు జనకుడితో ఇలా అంటున్నాడు ”ఓ మహారాజా! కార్తీకమాసంలో ఇంకా విధిగా చేయాల్సిన ధర్మాలు చాలా ఉన్నాయి. వాటిని వివరిస్తాను విను… కార్తీకమాసంలో నదీస్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణుడి కుమారుడికి ఉపనయనం చేయడం మరింత ముఖ్యం. ఒకవేళ ఉపనయనానికి అయ్యే ఖర్చు అంతా భరించే శక్తిలేనప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాలు, సంభావనలతో తృప్తిపరిచినా ఫలితం కలుగుతుంది. ఈ విధంగా ఓ పేద బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేసినట్లయితే… ఎంతటి మహాపాపాలైనా తొలగిపోతాయి. ఎన్ని బావులు, చెరువులు తవ్వించినా… పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేస్తే వచ్చే ఫలితానికి సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం. కార్తీకమాసంలో భక్తిశ్రద్ధలతో కన్యాదానం చేసినట్లయితే… తను తరించడమే కాకుండా… తన పితృదేవతలను కూడా తరింపజేసినవారవుతారు. ఇందుకు ఒక వృత్తాంతముంది. చెబుతాను విను…” అని ఇలా చెప్పసాగాడు…

🐚🐚🐚 సువీర చరితం 🐚🐚🐚

పూర్వం వంగ దేశంలో గొప్ప పరాక్రమ వంతుడు, శూరుడు అయిన ”సువిరు”డను ఒక రాజు ఉండేవాడు. అతనికి రుపవతి అయిన భార్య ఉంది. ఒకసారి అతను శత్రురాజులచే పరాజితుడయ్యాడు. దీంతో అతను భార్యతో కలిసి అరణ్యానికి పారిపోయి, ధన హీనుడై, నర్మదానదీ తీరంలో పర్ణశాల నిర్మించుకుని, కందమూలాలు భక్షిస్తూగడపసాగాడు. కొన్నాళ్లకు అతని భార్య ఒక బాలికను కన్నది. ఆ బిడ్డను అతి గారాబంతో పెంచుచుండేవారు. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు లేకపోయినా… శుక్లపక్ష చంద్రుడి మాదిరిగా రోజురోజూ అభివృద్ధి కాసాగింది. అతిగారాబంతో పెరగసాగింది. అలా రోజులుగడుస్తుండగా… ఆ బాలిక యవ్వనవతియైంది. ఒక దినాన వానప్రస్తుడి కుమారుడు ఆ బాలికను చూసి, అందచందాలకు పరవశుడై, తనకు ఇచ్చి వివాహం చేయమని ఆ రాజును కోరాడు. అందుకా రాజు ”ఓ మునిపుత్రా…!

ప్రస్తుతం నేను కడు బీద స్థితిలో ఉన్నాను. అష్టదరిద్రాలు అనుభవిస్తున్నాను. మా కష్టాలు తీరేందుకు కొంత ధనమిచ్చినట్లయితే… నా బిడ్డనిచ్చి పెండ్లి చేస్తానని చెప్పాడు. దాంతో ఆ మునిపుత్రుడు చేతిలో పైసా లేకున్నా… బాలికపై ఉన్న మక్కువతో కుబేరుడిని గురించి ఘోర తపస్సు చేశాడు. కుబేరుడిని మెప్పించి, ధన పాత్ర సంపాదించాడు. రాజు ఆ పాత్రను తీసుకుని, సంతోషించి, తన కుమార్తెను ముని కుమారుడికిచ్చి పెళ్లి చేశాడు. నూతన దంతపతులిద్దరినీ అత్తవారింటికి పంపాడు.
అలా మునికుమారుడు తన భార్యను వెంటబెట్టుకుని, తల్లిదండ్రుల వద్దకు వెళ్లి, నమస్కరించి, జరిగిన సంగతిని చెప్పాడు. తన భార్యతో కలిసి సుఖంగా జీవించసాగాడు. అయితే సువీరుడు మునికుమారుడిచ్చిన పాత్రను తీసుకుని, స్వేచ్ఛగా ఖర్చుచేస్తూ… భార్యతో సుఖంగా ఉండసాగాడు. కొంతకాలానికి అతనికి మరో బాలిక జన్మించింది. ఆమెకు కూడా యుక్తవయసు రాగానే, ఎవరికైనా ధనానికి అమ్మాలనే ఆశతో ఎదురుచూడసాగాడు.

ఒక సాధువు తపతీ నదీ తీరం నుంచి నర్మదా నదీ తీరానికి స్నానార్థం వస్తుండగా… దారిలో ఉన్న సువీరుడిని కలుసుకున్నాడు… ”ఓయీ! నీవెవరు? నీ ముఖ వర్చస్సు చూస్తే రాజవంశంలో పుట్టినవాడిలా ఉన్నావు. ఈ అడవిలో ఏం చేస్తున్నావు? భార్యాపిల్లలతో ఇక్కడ జీవించడానికి కారణమేమిటి?”అని ప్రశ్నించాడు. దానికి సువీరుడిలా చెబుతున్నాడు… ”ఓ మహానుభావా! నేను వంగదేశాన్ని పరిపాలించేవాడిని. నా పేరు సువీరుడు. నా రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించడంతో భార్యాసమేతంగా ఈ అడవిలో నివసిస్తున్నాను. దరిద్రం కంటే కష్టమేది ఉండదు. పుత్రశోకం కంటే దు:ఖం ఉండదు. అలాగే భార్యావియోగం కంటే సంతాపం వేరొకటి లేదు. అందువల్ల రాజ్యభ్రష్టుడనైనా… ఈ కారడవిలో ఉన్నంతలో సంతృప్తి పొందుతూ కుటుంబ సమేతంగా బతుకుతున్నాను. నాకు ఇద్దరు కుమార్తెలు. అందులో మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునకు ఇచ్చి, వాడి వద్ద కొంత దానం తీసుకున్నాను. దాంతో ఇప్పటి వరకు కాలక్షేపం చేస్తున్నాను” అని చెప్పగా… ”ఓ రాజా! నీవు ఎంతటి దరిద్రుడవైనా… ధర్మ సూక్షం ఆలోచించకుండా కన్యను అమ్ముకున్నావు. కన్య విక్రయం మహాపాతకం. కన్యను విక్రయించువాడు అసి పత్రవానమనే నరకాన్ని అనుభవిస్తాడు. ఆ ద్రవ్యాలతో చేసే వ్రతం ఫలించదు. కన్య విక్రయం చేసేవారికి పితృదేవతలు పుత్ర సంతతి కలుగకుండా శపిస్తారు. అలాగే కన్యను ధనమిచ్చి కొని, పెండ్లాడిన వారి గృహస్థధర్మాలు వ్యర్థమగుటయేకాకుండా, అతను మహా నరకం అనుభవిస్తాడు. కన్యను విక్రయించేవారికి ఎలాంటి ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి రాబోయే కార్తీక మాసంలో రెండో కుమార్తెకు శక్తికొలదీ బంగారు ఆభరణాలతో అలంకరించి, సదాచార సంపన్నుడికి, ధర్మబుద్ధిగలవాడికి కన్యాదానం చేయి. అట్లు చేసినట్లయితే గంగాస్నానం, అశ్వమేథయాగ ఫలాలను పొందుతావు. మొదటి కన్యను అమ్మిన పాప ఫలాన్ని తొలగించుకున్న వాడివవుతావు” అని రాజుకు హితోపదేశం చేశాడు.

అందుకారాజు చిరునవ్వుతో… ”ఓ మునివర్యా! దేహసుఖం కంటే దానధర్మాలతో వచ్చిన ఫలం ఎక్కువా? తాను బతికుండగానే భార్యాబిడ్డలు, సిరిసంపదలతో సుఖంగా ఉండకుండా, చనిపోయిన తర్వాత వచ్చే మోక్షం కోసం ప్రస్తుతం ఉన్న అవకాశాలను చేతులారా జార విడుచుకోమంటారా? ధనం, బంగారం కలవాడే ప్రస్తుతం లోకంలో రాణించగలడు. కానీ, ముక్కుమూసుకుని, నోరుమూసుకుని, బక్కచిక్కి శల్యమైనవాడిని లోకం గుర్తిస్తుందా? గౌరవిస్తుందా? ఐహిక సుఖాలే గొప్పసుఖాలు. కాబట్టి నా రెండో బిడ్డను నేనడిగతినంత ధనం ఇచ్చే వారికే ఇచ్చి పెండ్లిచేస్తాను. కానీ, కన్యాదానం మాత్రం చేయను” అని నిక్కచ్చిగా చెప్పాడు. ఆ మాటలకు ఆ సన్యాసి ఆశ్చర్యపడి, తన దారిన తాను వెళ్లిపోయాడు. మరికొన్ని రోజులకు సువీరుడు చనిపోయాడు. వెంటనే యమ భటులు వచ్చి, అతన్ని తీసుకుపోయిరి. యమలోకంలో అసిపత్రవనం అనే నరకంలో పారేశారు. అక్కడ అనేక విధాలుగా బాధించారు. సువీరుడికి పూర్వికుడైన శ్రుతుకీర్తి అనే రాజు ధర్మయుక్తంగా ప్రజల్ని పాలించి, ధర్మాత్ముడై మృతిచెంది, స్వర్గాన్ని పొందాడు. అయితే ఆయన వంశజుడైన సువీరుడు చేసిన కన్యా విక్రయం వల్ల శ్రుతుకీర్తి కూడా స్వర్గం నుంచి నరకానికి వచ్చాడు.  అంతట శ్రుతకీర్తి ”నేను ఒకరికి ఉపకారం చేశానే తప్ప అపకారమెన్నడూ చేయలేదు. దానధర్మాలు, యజ్ఞయాగాదులు చేశాను. అయినా.. నాకు ఈ దుర్గతి ఎలా?” అని నిండు కొలువులో యమధర్మ రాజును ప్రశ్నించాడు.

వినయంగా ఇలా చెబుతున్నాడు… ”ప్రభూ… నీవు సర్వజ్ఞుడవు. ధర్మమూర్తివి. బుద్ధిశాలివి. ప్రాణకోటిని తరతమ తారతమ్య బేధాలు లేకుండా సమానంగా చూస్తావు. నేనెన్నడూ పాపం చేయలేదు. అయితే నన్ను స్వర్గం నుంచి ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చారు? కారణమేమిటి?” అని ప్రశ్నించాడు. దానికి యమధర్మరాజు శ్రుతకీర్తిని చూచి ”ఓయీ… నీవు న్యాయమూర్తివి. ధర్మజ్ఞుడవే. నీవు ఎలాంటి దూరాచారం చేయలేదు. అయినా… నీ వంశీయుడైన సువీరుడు తన జేష్ఠ పుత్రికను అమ్ముకొన్నాడు. కన్యను అమ్ముకునే వారు, వారి పూర్వికులు ఎంతటి పుణ్యవంతులైనా… నరకాలను అనుభవించక తప్పదు. నీచజన్మలు ఎత్తవలసి ఉంటుంది. నీవు పుణ్యాత్ముడవే. అయితే నీకో మార్గం చెబుతాను. నీకు మానవ శరీరాన్ని ఇస్తాను. నీ వంశీయుడైన సువీరుడికి ఇంకో కుమార్తె ఉన్నది. ఆమె నర్మదానదీ తీరంలో తల్లివద్దే పెరుగుతున్నది. అక్కడకు పోయి, ఆ కన్యను వేద పండితుడు, శీలవంతుడికి కార్తీక మాసంలో సాలంకృతంగా కన్యాదానం చేయి. నీవు, మీవాళ్లు ఆ పుణ్యఫలంతో స్వర్గానికి వెళ్తారు” అని చెప్పాడు. ”పుత్రికాసంతానం లేనివారు తమ ద్రవ్యంతో కన్యాదానంచేసినా, విధిగా ఆంబోతుకు వివాహం చేసినా కన్యాదాన ఫలం వస్తుంది. కావున నీవు భూలోకానికి వెళ్లి నేను చెప్పినట్లు చేయి. ఆ కార్యం కారణంగా పితృగణమంతా తరిస్తారు” అని యముడు సెలవిచ్చెను.

శ్రుతకీర్తి యముడికి నమస్కరించి సెలవు తీసుకుని, నర్మదా నదీతీరంలో ఒక పర్ణకుటీరంలో నివసిస్తున్న సువీరుడి భార్యను, కుమార్తెను చూచి, సంతోషపడి, ఆమెతో అసలు విషయం చెప్పి, కార్తీక మాసంలో సువీరుడి కూతురిని కన్యాదానం చేశాడు. ఆ వెంటనే సువీరుడు, శ్రుతకీర్తి, వారి పూర్వీకులు పాపవిముక్తులై, స్వర్గలోకాన్ని చేరారు.

”ఓ జనకమహారాజా! కార్తీకంలో కన్యాదానానికి అంతటి శక్తి ఉంది. అత్యంత పుణ్యఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి కార్తీకమాసంలో కన్యాదానం చేసేవాడు విష్ణుసాన్నిధ్యాన్ని పొందుతాడు” అని వివరించాడు.

🌺 ఇతి శ్రీ స్కాంధపురాణాంతర్గత, వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య: త్రయోదశాధ్యాయ సమాప్త: 🌺

కార్తీక పౌర్ణమి కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అనగా కార్తీక మాసములో శుక్ల పక్షములో పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీకమాసములో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు

కార్తీక పౌర్ణమి 

కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అనగా కార్తీక మాసములో శుక్ల పక్షములో పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీకమాసములో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరి, హారులకు అత్యంత ప్రీతికరమైన మాసం. అన్ని మాసాల్లోను  కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగినది అని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. 'శివునికి, విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున, కావున మానవాళికి వారిద్దరిని కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో 'ప్రాశస్త్యం' కలిగినది అని పురాణాలుతెలుపుతున్నాయి. ఈ మాసంలో ప్రతి దినమూ పవిత్రమైనదే. సోమవారాలు, రెండు ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి. నెలరోజులూ చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం మరొక ఎత్తు. అందువల్ల అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలనీ పురాణాలు వివరిస్తున్నాయి.

విశిష్టత
కార్తీక మాసములో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనదని పురాణాలు చెపుతున్నాయి. ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరి చేరుతాయి. ఇందులో భాగంగా... మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లైతే... కోటి జన్మల పుణ్య ఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం. అంతే కాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుంది. ఈ రోజున సన్నిహితులకు కార్తీక పురాణ పుస్తకాలను శుభాకాంక్షలు తెలుపుతూ అందజేయటం వలన పుణ్యం లభిస్తుంది. మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పుష్పము, తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది. ఇంకా దేవాలయాల్లో సహస్ర లింగార్చన, మహా లింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం. ఏ నది తనకు దగ్గరలో వుంటే ఆ నదిలో ప్రాతఃకాలమున స్నానము చేయవలయును. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరగాని, చెరువునందు గాని స్నానము చేయవచ్చును. అప్పుడు యీ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను.

శ్లో|| గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలే......స్మిన్‌ సన్నిధింకురు||
ఈరోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యముంది. శివ, విష్ణు దేవాలయాలు రెండింటా దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీద, ధ్వజస్తంభం ఎదుట, తులసికోట దగ్గర, దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో, ఉసిరికాయలమీద, బియ్యం పిండితో చేసిన ప్రమీదలలో దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను చక్కగా కుంకుమ, పూలతో అంకరించుకొని వెలిగించాలి. శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందాదీపం పేరుతో అఖండదీపాన్ని, ఆకాశదీపం పేరుతో ఎత్త్తెన ప్రదేశాల్లో భరిణలతో (కుండలు, లోహపాత్రలతో తయారుచేసి) వేలాడదీస్తారు. అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులలో, నదులలో మొదలగు జల వనరుల్లో విడిచి పెడతారు. ఇలాచేయడం పుణ్యప్రథము, అష్టశ్వర్యాలు కలుగుతాయి. వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలను వెలిగుంచే ఆనేక దీపాలవల్ల వాటినుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి, వాతావరణ శుద్ధి అవుతుంది తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది. ఈరోజు ఆచరించే వ్రతాలలో భక్తేశ్వర వ్రతం ఒకటి. ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుంది. భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి దీనికీపేరు.

పురాణ కథ
ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉంది. పాండ్యుడు, కుముద్వతి దంపతులు సంతానార్థం శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు. వారుచేసిన ఆరాధనలోని చిన్నలోపంవల్ల సరైన వరం ఇవ్వదలచుకోలేదట శివుడు. అందుకే 'అల్పాయుష్కుడు, అతిమేధావి అయిన కొడుకు కావాలా... పూర్ణాయుష్కురాలు, విధవ అయిన కుమార్తె కావాలా అని అడిగితే- కుమారుణ్నే కోరుకున్నారా దంపతులు. అతడి వయసు పెరుగుతున్న కొలదీ వారిలో గుబులూ జోరెత్తుతోంది. ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టిపడింది. అమే పిలిస్తే శివుడు పలికేటంత భక్తి, శక్తి కలదని విన్నారా దంపతులు. ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమబిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేశారు. వివాహమైన కొన్నాళ్లకే భర్తకోసం యమభటులు వచ్చేసరికి విషయం తెలుసుకుందా సాధ్వి. తక్షణమే తనభక్తి ప్రభావంతో శివుని ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం. ఇక్కడ ఇంకొక కథ కూడా ప్రాచుర్యం పొందింది. ఈ పౌర్ణమికు త్రిపుర పూర్ణిమ అని మరొకపేరు. తారకాసురుడి ముగ్గురు కుమారులూ బ్రహ్మను మెప్పించి, ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు పురాలను వరంగా పొందారు. ఎవరివల్లా మరణం లేకుండా వరంకోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథంకాని రథంమీద, విల్లుకాని విల్లుతో, నారికాని నారి సారించి, బాణంకాని బాణం సంధించి, మూడు నగరాలూ ఒకే సరళరేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురినీ ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు. ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు. ఆ వర బలంతో పట్టణాలతో సహా సంచారంచేస్తూ లోకాలన్నింటా కల్లోలం సృష్టిస్తున్నారు. వివిధ లోకవాసులు బ్రహ్మకు మొర పెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు. విష్ణువు దగ్గర కెళ్ళమని ఉపాయం చెప్పాడు. విష్ణువు కూడా తనకా శక్తిలేదని, వారిని వెంటపెట్టుకుని శివుడి దగ్గరకు వెళ్లాడు. దేవతలందరూ సహకరిస్తే తానీపని చేయగలనన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది. మేరు పర్వతం విల్లుకాని విల్లుగా, ఆదిశేషువు అల్లెతాడు కాని అల్లెతాడుగా, శ్రీమహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను (మూడు పట్టణాల యజమానులైన రాక్షసులను) సంహరించాడని, అందువల్ల ఈ పేరు వచ్చిందనీ పురాణ కథనం.

ప్రత్యేకంగా చేయవలసినవి సవరించు
దైవ దర్శనం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ దానం, దీపోత్సవ నిర్వహణ ఈ రోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయి అని కార్తీక పురాణంలో పేర్కొనబడింది. ఎవరి శక్తి సామర్ధ్యాలను బట్టి హరి హారులను సేవించి వారి కారుణ కటాక్షాలు పొందుతారు. వీరిని ఎంత నిష్ఠతో తరిస్తే అంత శుభఫలితాలు ఉంటాయి.

🌈కార్తీకపురాణం 14 అధ్యాయం🌈🪔🪔🪔🪔🪔🌹 *ఆబోతును అచ్చుబోసి వదలుట(వృషోత్సర్గము)*మరల వశిష్ఠులవారు, జనకుని దగ్గరగా కూర్చుండ బెట్టుకొని కార్తీకమాస మహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వవిషయములు చెప్పవలెనను కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి.

🌈కార్తీకపురాణం 14 అధ్యాయం🌈
🪔🪔🪔🪔🪔

🌹 *ఆబోతును అచ్చుబోసి వదలుట(వృషోత్సర్గము)*

మరల వశిష్ఠులవారు, జనకుని దగ్గరగా కూర్చుండ బెట్టుకొని కార్తీకమాస మహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వవిషయములు చెప్పవలెనను కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి.

ఓ రాజా! కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామములను దానముచేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకొందురు.

వారికి కోటియాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలును తమ వంశమందెవ్వరు ఆబోతునకు అచ్చువేసి వదలునో అని ఎదురుజూచుచుందురు. ఎవడు ధనవంతుడై యుండి పుణ్యకార్యములు చేయక, దానధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లియైననూ చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయేగాక వాని బంధువులను కూడా నరకమున గురుచేయును. కాన ప్రతి సంవత్సరం కార్తీకమాసమున తన శక్తికొలది దానము చేసి నిష్టతో వ్రతమాచరించి సాయంసమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధనచేసి ఆ రాత్రియంతయు జాగరముండి మరునాడు తమ శక్తికొలది బ్రాహ్మణులకు, సన్యాసులకు భోజనమిడినవారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవింతురు.

*కార్తీకమాసములో విసర్జింపవలసినవి*

ఈ మాసమందు పరాన్నభక్షణ చేయరాదు. ఇతరుల యెంగిలి ముట్టకూడదు, తినకూడదు. శ్రాద్ధభోజనం చేయకూడదు. నీరుల్లిపాయ తినరాదు. తిలాదానము పట్టరాదు. శివార్చన, సంధ్యావందనము చేయనివారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారములనాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందు భోజనం చేయరాదు. కార్తీకమాసమున నెలరోజులూ కూడా రాత్రులు భుజించరాదు, విధవ వండినది తినరాదు. ఏకాదశీ, ద్వాదశీ వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరము ఉండవలెను. ఒక్కపూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీకమాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విమర్శించరాదు. కార్తీకమాసమున వేడినీటితో స్నానము కూడదు చేసిన కల్లుతో సమానము బ్రహ్మదేవుడు చెప్పెను. కావున, వేడినీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యము వుండి యెలాగైనా విడువకుండా కార్తీకమాసవ్రతం చేయవలెనన్న కుతూహలం గలవాడు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును. అటుల చేయువారలు గంగ, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను.

ఏ నది తనకు దగ్గరలో వుంటే ఆ నదిలో ప్రాతఃకాలమున స్నానము చేయవలయును. అటుల చేయనియెడల మహాపాపియై జన్మజన్మములు నరకకూపమున బడి కృశింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరగాని, చెరువునందుగాని స్నానము చేయవచ్చును. అప్పుడు యీ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను.

*గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ |*
*నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు ||*

అని పఠించుచు స్నానము చేయవలయును. కార్తీకమాస వ్రతము చేయువారు పగలు పురాణపఠన శ్రవణం, హరికథా కాలక్షేపములతో కాలము గడుఓవలెను. సాయంకాలమున సంధ్యావందనాదికాది కృత్యములు ముగించి పూజామందిరముననున్న సివుని కల్పోక్తముగా ఈ క్రింది విధమున పూజించవలెను.

*కార్తీకమాస శివపూజాకల్పము*

ఓం శివాయ నమః - ధ్యానం సమర్పయామి
ఓం పరమేశ్వరాయ నమః - ఆవాహనం సమర్పయామి
ఓం కైలాసవాసాయ నమః - నవరత్న సింహాసనం సమర్పయామి
ఓం గౌరీనాథాయ నమః - పాద్యం సమర్పయామి
ఓం లోకేశ్వరాయ నమః - అర్ఘ్యం సమర్పయామి
ఓం వృషభవాహనాయ నమః - స్నానం సమర్పయామి
ఓం దిగంబరాయ నమః - వస్త్రం సమర్పయామి
ఓం జగనాథాయ నమః - యజ్ఞోపవీతం సమర్పయామి
ఓం కపాలధారిణే నమః - గంధం సమర్పయామి
ఓం సంపూర్ణ గుణాయ నమః - పుష్పం సమర్పయామి
ఓం మహేశ్వరాయ నమః - అక్షతాన్ సమర్పయామి
ఓం పార్వతీనాథాయ నమః - ధూపం సమర్పయామి
ఓం తేజోరూపాయ నమః - దీపం సమర్పయామి
ఓం లోకరక్షాయ నమః - నైవేద్యం సమర్పయామి
ఓం త్రిలోచనాయ నమః - కర్పూర నీరాజనం సమర్పయామి
ఓం శంకరాయ నమః - సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
ఓం భవాయ నమః - ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
ఈ ప్రకారముగా కార్తీకమాసమంతయు పూజించవలెను శివసన్నిధిని దీపారాధన చేయవలెను. ఈ విధముగా శివపూజ చేసినయెడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తినిబట్టి బ్రాహమణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలెను. ఇటుల చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము, వెయ్యి వాజిపేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీకమాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్యదీపారాధన, తులసీకోటను కర్పూర హారతులతో దీపారాధన చేసిన యెడల, వారికీ, వారివంశీయులకు, పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగియుండి కూడా యీ వ్రతము నాచరించనివారును వంద జన్మలు నానాయోనులందునా జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, యెలుక మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన యెడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టివారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును.

*ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిఠప్రోక్త కార్తీకమహాత్మ్యమందలి చతుర్దశాధ్యాయము - పద్నాలుగవరోజు పారాయణము సమాప్తము.*
 
         🪔 ఓం నమః శివాయ 🪔

    🌹సర్వేజనా సుఖినోభవంతు🌹

సాలగ్రామము విష్ణుప్రతీకమైన, విశిష్ట ప్రాముఖ్యం కలిగిన ఒక శిలా విశేషము. కలికాలంలో భక్తుల అర్చనాదుల సౌలభ్యం కోసం నారాయణుడు సాలగ్రామ రూపం ధరించాడని దేవీ భాగవతం చెబుతుంది. అందుచేతే గృహదేవతార్చనలలోగానీ, దేవాలయాలలోగానీ సాలగ్రామము (మూర్తి) లేకుండా పూజలు కొనసాగవు. ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు తమతమ దేవతార్చనలలో సాలగ్రామములను పూజకు ఉపయోగిస్తారు.

సాలగ్రామము విష్ణుప్రతీకమైన, విశిష్ట ప్రాముఖ్యం కలిగిన ఒక శిలా విశేషము. కలికాలంలో భక్తుల అర్చనాదుల సౌలభ్యం కోసం నారాయణుడు సాలగ్రామ రూపం ధరించాడని దేవీ భాగవతం చెబుతుంది. అందుచేతే గృహదేవతార్చనలలోగానీ, దేవాలయాలలోగానీ సాలగ్రామము (మూర్తి) లేకుండా పూజలు కొనసాగవు. ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు తమతమ దేవతార్చనలలో సాలగ్రామములను పూజకు ఉపయోగిస్తారు. భారతదేశంలో సాలగ్రామ పూజ బహు పురాతనమైనది. క్రీస్తు కంటే ప్రాచీనుడైన అపస్తంబుడు సాలగ్రామ పూజను పేర్కొన్నాడు. త్రిమతాచార్యులు తమతమ భాష్యాలలో సాలగ్రామాలు విష్ణురూపాలని వివరించారు. దేవాలయాలలో పంచాయతన మూర్తులకు శిలా ప్రతిమలు ఉంటే గృహస్థులకు మణి, స్వర్ణ నిర్మితమైన మూర్తులు, సాలగ్రామములు ఉంటాయి. సాధారణంగా ప్రతిమలకు నిత్య పూజా సమయంలో ఆవాహనాది షోడశోపచారాలు చేయాలి. సాలగ్రామాలలో దేవత నిత్యం సన్నిహితమై ఉండడం వల్ల వాటికి పూజా సమయంలో అవాహనాది ఉపచారాలు అవసరం లేదు.

శిలాజనిర్మిత సాలగ్రామ శిలలు
సాలిగ్రామాలు అన్నవి నునుపుగా, గుండ్రముగా గానీ కోడిగుడ్డు ఆకారములో కాల్వల్లో, నదీ తీరాల్లో దొరికే రాళ్ళు. వాటి ఆకారం, నునుపుదనం చూసి వాటికి అతి త్వరగా ఆకర్షితులం అవటం చాలా సులభం. వీటిని దైవ స్వరూపాలుగా భావించడం జరుగుతుంది. హిందూ దైవిక పూజల్లో వీటికి ప్రత్యేక స్థానం ఉంది కూడా.. చాలా పురాతన కాలాల నుండి వీటి ఉనికి ఉంది. సాలగ్రామాలు గండకీ నదిలో లభిస్తాయి  ఇవి సాధారణముగా నదీ తీరాల వెంట దొరుకుతూ ఉంటాయి. పుణ్యతీర్థాలకు వెళ్ళినప్పుడు - నదుల్లో స్నానాలకి వెళ్ళినపుడు చాలామంది వీటిని ఇంటికి తెచ్చుకొని, పూజామందిరాల్లో పెట్టుకుంటారు. ప్రవహించే నదుల ప్రవాహ ఒరవడికి నదీ జలాలతోటే కొట్టుకవచ్చే చిన్న చిన్న రాళ్ళు ఒకదానితో మరొకటి తగిలి, కాలక్రమాన ఇలా నునుపుగా మారి, ఆకర్షణీయముగా అగుపిస్తాయి. వీటినే సాలిగ్రామాలుగా పరిగణలోకి తీసుకోవడం కద్దు.

వీటిని పూజల్లో పెట్టుకొని వీటికి పూజలు చెయ్యడం మొదలెట్టాక - ఇక వాటికి ఎల్లప్పుడూ పూజలు చెయ్యడం చాలా మంచిది. అలాగే కొనసాగాలి కూడా. ఆ పూజల ధనాత్మక శక్తి వీటికి బాగా అంటుకొని, అవి ఉన్న చోట అంతా శుభమే కలుగుతుంది. ఏదైనా కారణాల వల్ల వీటికి ఆ పూజలను కొనసాగించలేమో - అప్పుడు ఆ ధనాత్మక శక్తి హరించుకపోయి, ఋణాత్మక శక్తిని వెదజల్లుతుంది. అప్పుడు ఆ రాళ్ళు ఉన్న చోట అంతా చెడు జరుగుతుందని చెబుతుంటారు. వీటికి మొదట ఏదైతే నైవేద్యముగా సమర్పిస్తామో, వాటినే ఎప్పుడూ సమర్పిస్తూనే ఉండాలి. అంటే పాయసం పెట్టడం మొదలెడితే అదే ఎల్లప్పుడూ పెడుతూనే ఉండాలి. అందుకే చాలామంది నీటినే - నైవేద్యముగా పెడుతూ ఉంటారు. వీటిని గురించి నేను ఒకరి వద్ద తెలుసుకున్నప్పుడు వారి కొన్ని వివరాలతో బాటు ఒక కథ కూడా చెప్పారు. అది ఎంతవరకు నిజమో తెలీదు కానీ వాటి శక్తి గురించి తెలిసినవారికి ఈ కథని తేలికగా నమ్ముతారు. ఆ కథని మీకోసం అందిస్తున్నాను.

కథ

లక్ష్మీనరసింహ సాలగ్రామ శిల

శంఖు రూప సాలగ్రామం
దస్త్రం:
సాలగ్రామ శిలలు

సాలగ్రామ శిలలు

సాలగ్రామ శిలలను ఇళ్ళలో ఇలా పూజిస్తుంటారు

సాలగ్రామ రూప మీరాభాయి
పూర్వం ఒక ఊరిలో మాంసం అమ్మే విక్రయదారుడు ఉండేవాడు. ( ఈ చండాలుడి ప్రస్తావన నిజమే - నేను మార్చినది కాదు. సాంప్రదాయ వాళ్ళు మన్నించాలి. ) అతనికి సరియైన బేరాలు లేక ఎప్పుడూ అంతంత మాత్రం ఉండే ఆదాయముతో జీవనాన్ని కొనసాగించేవాడు. ఒకరోజు అతను నదీస్నానాలకు వెళ్ళినప్పుడు స్నానం చేసిన చోట కొన్ని రాళ్ళు అగుపిస్తాయి. అందులో ఒక రాయి నల్లగా, చాలా నునుపుగా ఉండి, చాలా ఆకర్షించింది. వద్దని అక్కడే వదిలేసి, ఒడ్డుకి వచ్చినా ఆ రాయి అతని మది నుండి దూరం కాలేదు. ఎందుకిలా అవుతున్నది.. అనుకుంటూ మళ్ళీ నదిలోకి దిగి ఆ రాయిని తీసుకొని, ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినా అతని దృష్టిపథం నుండి ఆ రాయి తొలగిపోలేదు. ఆరోజు అంతా ఆ రాయి ఆకర్షణలో పడిపోయాడు. కానీ ఆ రాయి ఒక సాలిగ్రామం అని అతనికి తెలీదు.

మరునాడు యధావిధిగా తన మాంసం అమ్మే విక్రయశాలకు వెళ్ళినప్పుడు కూడా వెంట ఆ రాయిని పట్టుకెళ్ళాడు. దాన్ని ఎక్కడ ఉంచాలో తెలీక డబ్బులు ఉంచే గల్లా పెట్టెలో పెడతాడు. మాంసం ముట్టిన చేతులతో, డబ్బులని తీసిస్తున్న సమయాల్లో ఆ రాయికి మాసం వాసన తగిలేది. అలా దానికి నైవేద్యముగా పెట్టినట్లయ్యింది. నిత్యం ఉండే మాంసం విక్రయాల వల్ల ప్రతిరోజూ నైవేద్యం చాలా బాగా అందేది. అలా రాయి ధనాత్మక శక్తిని క్రమక్రమేణా పొందుతూ ఉంది. అలాగే ఆ రాయి వచ్చినప్పటి నుండి ఆ మాంసం విక్రయశాల అమ్మకాలు జోరందుకున్నాయి. అంచలంచలుగా అంతాని వ్యాపారం పెరిగి, బాగా ధనికుడయ్యాడు. ఈ రాయి వల్ల బాగా వృద్ధిలోకి వచ్చాను అనుకున్న ఆ మాంసం కొట్టు విక్రేత దాన్ని అదే గల్లా పెట్టిలోనే అట్టిపెట్టాడు.

అతి త్వరలోనే ఆ కొట్టువాడు గొప్పవాడు అయిన విధానం ఏమిటో చూచాయగా తెలుసుకున్న ఒక పండితుడు ఒక పూజకని ఆ కొట్టు అతని వద్దకి వెళ్ళుతాడు. అప్పుడు ఆ రాయిని గురించి తెలుసుకొని పరిశీలనగా చూసి, అసలైన సాలిగ్రామంగా తెలుసుకొని, ఆ కొట్టువాడు ఏమరుపాటుగా ఉన్న సమయాన ఆ రాయిని కొట్టేసి, ఇంటికి తెచ్చుకుంటాడు. ఆ సాలిగ్రామానికి ఎన్నో పూజలు చేస్తాడు. ఎన్నెన్నో రకాల పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తాడు. కానీ మాంసం నైవేద్యానికి అలవాటు పడ్డ ఆ సాలిగ్రామం ఆకలిగా ఉండిపోయి, తన ధనాత్మక శక్తి స్థానంలో ఋణాత్మక శక్తిని విడుదల చేస్తుంది. అప్పుడు ఆ పండితుడు నానా అగచాట్లకి గురి అయ్యి నాశనం అవుతాడు.

సాలిగ్రామం ఇంతటి శక్తివంతం అని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చును.

కార్తీక మాసానికి ఉసిరి చెట్టు, ఉసిరికాయకు వున్న సంబంధం అంతా ఇంతా కాదు. అలాగే కార్తీక పౌర్ణమి రోజు ముఖ్యంగా ఉసిరికాయలో దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు చేకూరుతాయి. ఉసిరిచెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా భావిస్తారు. అందుకే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, సోమవారం, పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు. 
 
అలాగే కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయను తీసుకుని... దానిలో నెయ్యి నిండేలా కట్ చేసుకుని.. నేతితో నింపాలి. ఆపై తామర కాడల వత్తులను వేసి దీపమెలిగించాలి. ఇలా చేస్తే.. మహిళలు దీర్ఘసుమంగళీ ప్రాప్తాన్ని చేజిక్కించుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం. అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు, ఈశ్వర అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అంతేగాకుండా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే.. నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. 
 
నవగ్రహాలతో పాటు సమస్త దోషాలను తొలగించుకోవాలంటే.. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయతో దీపం వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. అలాగే ఆర్థిక ఇబ్బందులు అంటూ వుండవు. అష్ట దారిద్ర్యాలు తొలగిపోతాయి. మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

🌈కార్తీకపురాణం 15 అధ్యాయం🌈🪔🪔🪔🪔🪔🌹*దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మస్మృతితో నరరూపమందుట*

"

🌈కార్తీకపురాణం 15 అధ్యాయం🌈
🪔🪔🪔🪔🪔

🌹*దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మస్మృతితో నరరూపమందుట*

అంతట జనకమహారాజుతో వశిష్ఠమహాముని - జనకా! కార్తీకమహాత్మ్యము గురించి యెంత వివరించిననూ పూర్తికానేరదు. కాని, మరియొక యితిహాసము తెలియ చెప్పెదను సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పెను.

ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవులవద్ద దీపారాధనను చేయుట, పురాణమును చదువుట, లేక, వినుట, సాయంత్రము దేవతాదర్శనము చేయలేనివారు కాలసూత్రమనెడి నరకమునబడి కొట్టుమిట్టాడుదురు. కార్తీకశుద్ద ద్వాదశీ దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు యిచ్చిన యెడల, విశేషఫలము పొందగలరు. ఈ విధముగా నెలరోజులు విదువక చేసిన యెడల అట్టివారు దేవదుందుభులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెలరోజులు చేయలేనివారు కార్తీకశుద్ద త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపమునుంచవలెను.

ఈ మహాకార్తీకములో ఆవుపాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన యెడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును. ఇతరులు వుంచిన దీపము యెగద్రోసి వృద్ధి చేసినయెడలను, లేక, ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివారల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు, వినుమని వశిష్ఠులవారు యిట్లు చెప్పుచున్నారు.

సరస్వతీ నదీతీరమున శిధిలమైన దేవాలయమొకటి కలదు. కర్మ నిష్ఠుడనే దయార్ద్ర హృదయుడగు ఒక యోగిపుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీకమాసమంతయు అచటనే గడిపి పురాణపఠనముజేయు తలంపురాగా ఆ పాడుబడియున్న దేవాలయమును శుభ్రముగా వూడ్చి, నీళ్లతో కడిగి, బొట్లుపెట్టి, ప్రక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి, దూదితో వత్తులుజేసి, పండ్రెండు దీపములుంచి, స్వామిని పూజించుచు, నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీకమాసము ప్రారంభమునుండి చేయుచుండెను. ఒకరోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి, నలుమూలలు వెదకి, తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయియున్న వత్తిని తినవలసినదేనని అనుకొని నొట కరచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను. నోటకరచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తికూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీకమాస మగుటవలనను, శివాలయములో ఆరిపోయిన వత్తి యీ యెలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను.

ధ్యాన నిష్ఠలో వున్న యోగిపుంగవుడు తన కన్నులను తెరచిచూడగా, ప్రక్కనొక మానవుదు నిలబడి యుండుటను గమనించి "ఓయీ! నీవెవ్వడవు? ఎందుకిట్లు నిలబడియుంటివి?" అని ప్రశ్నించగా, "ఆర్యా! నేను మూషికమును, రాత్రి నేను ఆహారమును వెదుకుకొంటూ ఈ దేవాలయములోనికి ప్రవేశించి యిక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యివాసనలతో నుంది ఆరిపోయిన వత్తిని తినవలెనని దానిని నొటకరచి ప్రక్కనున్న దీపంచెంత నిలబడి వుండగ, నా అదృష్టము కొలదీ ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తితిని. కాని, ఓ మహానుభావా! నేను యెందుకీ మూషికజన్మ మెత్తవలసివచ్చెనో దానికి గల కారణమేమిటో విశదీకరింపు"మని కోరెను.అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టిచే సర్వము తెలుసుకొని, "ఓయీ! క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు. నిన్ను బాహ్లికుడని పిలిచెడివారు. నీవు జైనమత వంశానికి చెందిన వాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ, ధనాశపరుడై దేవపూజలు, నిత్యకర్మలు మరచి, నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచు, మంచివారలను, యోగ్యులను నిందించుచు పరులచెంత స్వార్థచింత గలవాడై ఆడపిల్లలను అమ్మువృత్తిచేస్తూ, దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు, సమస్త తినుబండారములను కడుచౌకగా కొని, తిరిగి వాతిని యెక్కువ ధరకు అమ్మి, అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక యితరులకు యివ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తరువాత యెలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపమనుభవించుచుంతివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి. దానివలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన, నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్తిన ధనమును త్రవ్వి, ఆ ధనముతో దానధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షముపొందు"మని అతనికి నీతులు చెప్పి పంపించెను.

*ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీకమహాత్మ్యమందలి పంచదశాధ్యాయము - పదిహేనోరోజు పారాయణము సమాప్తము.*
 
         🪔 ఓం నమః శివాయ 🪔

    🌹సర్వేజనా సుఖినోభవంతు🌹

కార్తీక మాసంలో దారి చూపే ఆకాశ దీపం... ఎందుకు వెలిగించాలి

కార్తీక మాసంలో దారి చూపే ఆకాశ దీపం... ఎందుకు వెలిగించాలి?
కార్తీక మాసం... ఆకాశ‌దీపం. ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. గుడుల్లో ఆకాశ‌ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారో మీకు తెలుసా... శివుడికి, విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్ర‌మైన‌ది కార్తీక మాసం. ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజ స్తంభానికి ‘ఆకాశ దీపం’ వేళ

కార్తీక మాసం... ఆకాశ‌దీపం. ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. గుడుల్లో ఆకాశ‌ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారో మీకు తెలుసా... శివుడికి, విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్ర‌మైన‌ది కార్తీక మాసం. ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజ స్తంభానికి ‘ఆకాశ దీపం’ వేళాడదీస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేసిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. 
 
తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి, ధ్వజ స్తంభం పైభాగాన వేలాడదీస్తారు. ఈ దీపంలో నూనె పోయడానికి, ఈ దీపాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకి వెళుతూ వుంటారు. అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి … ధ్వజ స్తంభానికి వేలాడదీయడానికి కారణం ఉంది. ఆకాశ దీపం దూరంగా ఉన్న మానవులు దర్శించడానికి కాదు. 
 
ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని శాస్త్రం చెబుతోంది. ‘దీపావళి’ రోజున రాత్రి లక్ష్మీ పూజ చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు మధ్యాహ్నం చాలామంది తమ పితృ దేవతలకు తర్పణం వదులుతుంటారు. కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృ దేవతలంతా ఆకాశమార్గాన తమతమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు. ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారు.

Saturday, November 28, 2020

🌈కార్తీకపురాణం 11 వ అధ్యాయం🌈🪔🪔🪔🪔🪔🌹మ౦థరుడు - పురాణ మహిమ*

🌈కార్తీకపురాణం 11 వ అధ్యాయం🌈
🪔🪔🪔🪔🪔

🌹మ౦థరుడు - పురాణ మహిమ*

ఓ జనక మహారాజా! యీ కార్తీకమాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని. ఇంకనూ దీనిని గురించి యెంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసె పూలతో పూజించిన యెడల చంద్రాయణ వ్రతము చేసిన౦త ఫలము కలుగును. విష్ణ్యర్చనానంతరం పురాణ పఠనం చేసినా, చేయించినా, వినినా, వినిపించినా అటువంటి వారూతప్పని సరిగా వైకుంఠాన్నేపొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను. శ్రద్దగా ఆలకి౦పుము. అని వశిష్టుల వారు ఈ విధముగా చెప్ప దొడంగిరి.
పూర్వము కళింగ దేశమునకు మంధరుడను విప్రుడు గలడు. అతడు ఇతరుల యిండ్లలో వంటలు చేయుచు అక్కడే భుజించుచు, మద్య మా౦సాది పానీయాలు సేవించుచూ తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నానజప, ధీపారాదనాదికములను ఆచారములును పాటింపక దురాచారుడై మెలుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతమంతురాలు, భర్త యెంత దుర్మార్గుడయిననూ, పతనే దైవముగానెంచి విసుగు చెందక సకలోపచారములు జేయుచు, పతివ్రతా ధర్మమును నిర్వర్తించుచుండెను. మంధరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పని చేయుచున్ననూ ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవక పోవుటచే దొంగ తనములు చేయుచూ, దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద నున్న ధనము, వస్తువులు అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిని బడి పోవుచుండ నతనిని భయపెట్టి కొట్టి ధనమపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని జంపి ధనము మూటగట్టుకొని వచ్చుచుండెను. సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్ర మొకటి గాడ్రించుచు వచ్చి కిరాతుకుని పైబడెను. కిరాతుకుడు దానిని కూడా చంపెను. కానీ అ పులి కూడా తన పంజా తో కిరాతుకకుని కొట్టి యుండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధముగా ఒక కాలమున నలుగురూ నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమ లోకమున అనేక శిక్షలు అనుభావి౦చుచు రక్తము గ్రక్కుచు భాద పడుచు౦డిరి.

మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యమూ హరి నామ స్మరణ చేయుచు సదాచర వర్తినియై భర్తను తలచుకోని దుఃఖిoచుచు కాలము గడుపుచు౦డెను. కొనాళ్ళుకు ఆమె యిoటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్య పాద్యాదులచే పూజించి " స్వామి!నేను దీ నురాలను, నాకు భర్త గాని, సంతతిగానిలేరు. నేను సదా హరి నామ స్మరణ చేయుచు జీవించుచున్న దానను, కాన, నాకు మోక్ష మార్గము ప్రసాదించు" మని బ్రతిమాలుకోనేను. ఆమె వినయమునకు, ఆచారమునకు ఆ ఋషి సంతసించి" అమ్మా! ఈ దినము కార్తిక పౌర్ణమి, చాల పవిత్రమైన దినము. ఈ దినమును వృథాగా పాడు చేసుకోనువద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చుదువుదురు. నేను చమురు తీసికొన వచ్చేదను. నీవు ప్రమిదను, వత్తి ని తీసికొని రావాలయును. దేవాలయములో ఈ వత్తిని దెచ్చిన ఫలమును నీ వందుకోనుము" అని చెప్పిన తోడనే అందుకామె సంత సించి, వెంటనే దేవాలయమునకు వెళ్లి శుబ్రముచేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానె స్వయముగా వత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనే ప్రమిదెలో పోసి దీపారాధ న చేసెను. అటు తరువాత యింటికి వెడలి తనకు కనిపించిన వారి నెల్ల " ఆరోజు రాత్రి ఆలయ ముందు జరుగు పురాణ కాలక్షేపము నకు" రమ్మని చెప్పెను. ఆమె కూడా రాత్రి అంతయు  పురాణమును వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంతకాలమున కు మరణించెను. ఆమె పుణ్యత్మురాలగుటచే వల్ల విష్ణుదూతలు వచ్చి విమాన మేక్కించి వైకుంట మునకు దీ సికోనిపోయిరి. కానీ - ఆమెకు పాపత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషముందుట చేత మార్గ మధ్యమున యమలోకమునకు దీ సికోనిపోయిరి. అచట నరక ముందు మరి ముగ్గురితో భాద పడుచున్న తన భర్త ను జూచి " ఓ విష్ణుదూత లారా! నా భర్తా మరి ముగ్గురును యీ నరక  బాధపడుచునారు . కాన, నాయ౦దు దయయుంచి వానిని వుద్ద రింపు "డ ని ప్రాధేయపడెను. అంత విష్ణుదూతలు " అమ్మా! నీ భర్త బ్రాహ్మణుడై యుండియు స్నాన సంధ్యా దులు మాని పాపాత్ముడై నాడు. రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైననూ అతడు కూడా ధనాశ చే ప్రాణహితుని చంపి ధనమపహరించెను. మూడవ వాడు వ్యాఘ్రము నలుగవ వాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినాను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము, మద్య మాంసభక్షణ చేసినాడుగాన పాపాత్ముడైనాడు. అందుకే యీ నలుగురు నరకబాధలు పడుచునారు. " అని వారి చరిత్రలు చెప్పిరి. అందులకు ఆమె చాలా విచారించి "ఓ పుణ్యాత్ములారా! నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపు" డని ప్రార్ధించగా , అందులకా దూతలు " అమ్మా! కార్తిక శుద్ధ పౌర్ణమినాడు నీవు వత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు, ప్రమిదఫలము కిరాతకునకు, పురాణము వినుటవలన కలిగినఫలము ఆ విప్రునకు ధారపోసినచో వారికి మోక్షము కలుగు" నని  చెప్పుగా అందులకామె అట్లే ధార పోసేను. ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్లిరి. కావున, ఓరాజా! కార్తికమాసమున పురాణము వినుటవలన, దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగెనో వింటివా? అని వశిష్టులవారు నుడివిరి.

*పదకొండవ రోజు పారాయణము సమాప్తము.*

        🪔 ఓం నమః శివాయ 🪔

    🌹సర్వేజనా సుఖినోభవంతు🌹

కార్తీకపురాణం 12 అధ్యాయం🌈🪔🪔🪔🪔🪔🌹*ద్వాదశి ప్రశంస*

🌈కార్తీకపురాణం 12 అధ్యాయం🌈
🪔🪔🪔🪔🪔

🌹*ద్వాదశి ప్రశంస*

"మహారాజా! కార్తీకమాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశీవ్రతమును గురించి, సాలగ్రామపు మహిమలను గురించి వివరించెదను విను"మని వశిష్ట మహాముని ఈవిధముగా తెలియచేసిరి.

కార్తీక సోమవారమునాడు ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్లి స్నానముచేసి ఆచమనము చేయవలయును. తరువాత శక్తి కొలది బ్రహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసము౦డి, సాయంకాలము శివాలయమునకు గాని, విష్ణ్వాలయమునకు గాని వెళ్లి దేవుని పూజించి, నక్షత్ర దర్శనము చేసికొని పిమ్మట భుజింపవలయును. ఈవిధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే గాక, మోక్షము కూడా పొందుదురు.

కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన యెడల నా వత్రమాచరించినచో నూరు రేట్లు ఫలితము కలుగును. కార్తీక శుద్ధ యేకాదశిరోజున, పూర్ణోపవాసముండి ఆ రాత్రి వివ్ష్ణ్వాలయమునకు వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి, శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన, కోటి యజ్ఞముల ఫలితము కలుగును. ఈవిధముగా చేసిన వారాలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానముచేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసిన నెంత పుణ్యము కలుగునో దానికంటే నధికముగా ఫలము కలుగును. కార్తిక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయుణుడు శేషపానుపు నుండి లేచును గనుక, కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు యిష్టము. అరోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి, ఆవుకాళ్ళకు వెండి డెక్కలు తగిలించి, దూడతో సహా బ్రహ్మణునకు దానమిచ్చిన యెడల ఆయావు శరీర ముందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరాములు యింద్ర లోకములో స్వర్గ సుఖములందుదురు. కార్తీకశుద్ధ పాడ్యమి రోజున, కార్తిక పౌర్ణమిరోజున కంచుపాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మ మందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశినాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టునుగాని, సాలగ్రామమునుగాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చినయెడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును.

దీనికి ఉదాహరణముగా ఒక కథ గలదు - శ్రద్దగా అలకింపుము.

సాలగ్రామ దానమహిమ

పూర్వము అఖ౦డ గోదావరి నదీ తీరమ౦దలి ఒకానొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు మిగుల దురాశాపరుడై నిత్యము ధనమును కూడా బెట్టుచు, తాననుభవించక, యితరులకు బెట్టక, బీదలకు దానధర్మములు చేయక, యెల్లప్పుడు పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విఱ్ఱ్వీగుచూ యేజీవికీ కూడా ఉపకారమైననూ చేయక "పరులద్రవ్యము నెటుల అపహరింతునా!"యను తలంపుతో కుత్సిత బుద్ది కలిగి కాలము గడుపుచుండెను.

అతడొకనాడు తన గ్రామమునకు సమీపమున నున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పుయిచ్చెను. మరి కొంత కాలమునకు తన సొమ్ము తనకిమ్మనిని అడుగగా ఆ విప్రుడు "అయ్యా! తమకీయవలసిన ధనము ఒక నెలరోజుల గడువులో యివ్వగలను. మీ ఋణముంచుకోను. ఈజన్మలో తీర్చని యెడల మరుజన్మమున మీ యింట యేజంతువుగానో పుట్టి అయినా, మీ ఋణము తీర్చుకోగలను" అని సవినయముగా వేడుకోనెను. ఆ మాటలకు కోమటి మండిపడి" అట్లు వీలులేదు. నాసొమ్ము నాకిప్పుడే యీయవలయును. లేనియెడల నీక౦ఠమును నరికి వేయుదును" అని ఆవేశం కొలదీ వెనుక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కొసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తన్నుకొని చనిపోయెను. ఆ కోమటి భయపడి, అక్కడనే యున్నచో రాజభటులు వచ్చి పట్టుకొందురని జడిసీ తన గ్రామమునకు పారిపోయెను. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక, అప్పటి నుండి అ వైశ్యునకు బ్రహ్మహత్యా పాపమావహించి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలూ పడుచూ మరి కొనాళ్లకు మరణించెను. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకోనిపోయి రౌరవాది నరకకూపముల బడద్రోసిరి.

ఆ వైశునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి స౦పాదించిన ధనమును దానదర్మాలు చేయుచు పుణ్యకార్యము లాచరించుచు, నీడకొరకై చెట్లు నాటించుచు, నూతులు, చెరవులు త్రవ్వించుచు, సకల జనులను సంతోషపెట్టుచు మంచికీర్తిని సంపాదించెను. ఇటులుండగా కొంత కాలమునకు త్రిలోకసంచారియగు నారదులవారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి, త్రోవలో ధర్మవీరుని యింటికి వెంచేసిరి. ధర్మవీరుడు నారదులవారికి సాష్టాంగ దండ ప్రణామము లాచరించి, విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి, చేతులు జోడించి "మహానుభావా! నాపుణ్యం కొలదీ నేడు తమ దర్శనం లభించినది. నేను ధన్యుడను. నాజన్మ తరించినది. నాయిల్లు పావనమైనది. శక్తి కొలదీ నే జేయు సత్కారములను స్వీకరించి తమరువచ్చిన కార్యమును విశధీకరింపుడు" అని సవినయుడై వేడుకొనెను. అంత నారదుడు చిరునవ్వు నవ్వి "ఓ ధర్మవిరా! నేను నీకోక హితవు చెప్పదలచి వచ్చితిని. శ్రీమహావిష్ణువునకు కార్తీకమాసంలో శుద్ధద్వాదశి మహాప్రితికరమైన దినము. అరోజున స్నాన, దాన, జపాదులు ఏవి చేసిననూ అత్యంత ఫలం కలుగును. నాలుగు జాతులలో నేజాతివారైననూ - స్త్రీ అయినా పురుషుడైనా, జారుడైనా, చోరుడైన, పతివ్రతమైనా, వ్యభిచారిణియైనా కార్తీకశుద్ద ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు వుండగా నిష్ఠగా ఉపవాసముండి, సాలగ్రామదానములు చేసిన యెడల వెనుకటి జన్మలందూ, ఈ జన్మమందూ చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకంలో మహా నరకమనుభవించుచున్నాడు. అతనిని వుద్ధరించుటకై నీవు సాలగ్రామదానము చేయక తప్పదు. అట్లుచేసి నీతండ్రి ఋణం తిర్చుకోనుము." అని చెప్పెను. అంతట ధర్మవీరుడు "నారద మునివర్యా! మేడల వెనుకటి జనమలందు, ఈ జన్మ మందూ చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలో కాంలో మహానరక మనుభ వించుచునాడు. అత నిని వుద్దరించుటకై నివు సాలగ్రమదానము చేయక తప్పదు. అట్లు చేసి ని తండ్రి ఋణం తిర్చుకోనుము, అని చెప్పెను. అంతట దర్మవిరుడు " నారద మునివర్యా! నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసియుంటిని, అటువంటి దానములు చేయగా నాతండ్రికి మోక్షము కలుగనప్పుడీ "సాలగ్రామ" మనే జాతిని దానము చేసినంత మాత్రమున ఆయన యెట్లు వుద్ధరింపబడునాయని సంశయము కలుగుచున్నది. దీనివలన ఆకలిగొన్నవాని ఆకలితీరునా! దాహంగొన్న వానికి దాహం తీరునా? కాక, యెందులకీ దానము చేయవలయును? నేనీ సాలగ్రామదానము మాత్రము చేయజాల"నని నిష్కర్షగా పలికెను.

ధర్మవీరుని అవివేకమునకు విచారించి "వైశ్యుడా! సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించితివి. అది శిలకాదు. శ్రీహరి యొక్క రూపము. అన్నిదానములకంటె సాలగ్రామదానము చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తని గావింప నెంచితివేని, యీ దానముతప్ప మరొక మార్గము లేదు" అని చెప్పి నారదుడు వెడలిపోయాను.

ధర్మవీరుడు ధనబలము గలవాడై యుండియు, దానసామర్థ్యము కలిగియుండియు కూడా సాలగ్రామ దానము చేయలేదు. కొంత కాలమునకు అతడు చనిపోయెను. నారదుడు చెప్పిన హితభోధను పెడచెవిని పెట్టుటచేత మరణాంతర మేడు జన్మలయందు పులియై పుట్టి, మరి మూడు జన్మలందు వానరమై పుట్టి, ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి, పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి, పదిజన్మలు పందిగా జన్మించి యుండెను. అట్లు జరగిన తరువాత పదకొండవా జన్మలో ఒక పేద బ్రాహ్మణునింట స్త్రీగా పుట్టిగా ఆమెకు యౌవనకాలము రాగా ఆపేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేసెను. పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను.

చిన్నతనమందే ఆమెకు అష్టకష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాల దుఃఖించిరి. తండ్రి ఆమెకు ఈవిపత్తు యెందువలన కలిగే నాయని దివ్యదృష్టితో గ్రహించి వెంటనే అమెచేత సాలగ్రామదానము చేయించి "నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక" యని చెప్పించి సాలగ్రామ దానఫలమును ధారవోయిఒచెను. ఆరోజు కార్తీక సోమవారమగుట వలన అ సాలగ్రామ దానఫలముతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలమునకు సకల సౌఖ్యములతో జీవిం, జన్మాంతరమున స్వర్గమున కరిగిరి. మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యమూ సాలగ్రామదానము చేయుచు ముక్తినొందెను.

కావున, ఓ జనకా! కార్తీకశుద్ద ద్వాదశిరోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము యింతింత గాదు. ఎంతో ఘనమైనది. కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయుము.

*ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి ద్వాదశాధ్యాయము -* *పన్నె౦డో రోజు పారాయణము సమాప్తము.*

   🪔 ఓం నమః శివాయ 🪔

    🌹సర్వేజనా సుఖినోభవంతు🌹

ఎగసి పడే మంటలను జ్వాలా తోరణము అంటారు.ఉదాహరణకు అగ్ని పర్వతముల నుంచి ఎగసి పడే మంటలు.

ఎగసి పడే మంటలను జ్వాలా తోరణము అంటారు.
ఉదాహరణకు అగ్ని పర్వతముల నుంచి ఎగసి పడే మంటలు.
అగ్ని ప్రమాదములు జరిగినపుడు ఎగసి పడే మంటలను జ్వాలా తోరణము అంటారు.
జ్వాలా తోరణము పదము పురాణ ప్రసిద్ధమైనది. దేవతలు, రాక్షసులు అమృతము కోసము సముద్రాన్ని చిలికినప్పడు మొదటగా హాలాహలము ఉద్భవించినది. ఇది లోకములను సర్వ నాశనము చేసే ప్రమాదము ఉన్నందున, బ్రహ్మాదులు ఈ ఉత్పాతం నుంచి రక్షించ వలసినదని మహాశివుని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించి, మహాశివుడు ఆ హాలాహలాన్ని మ్రింగటానికి సిద్ధ పడ్డాడు. ఆ హాలాహలం బయట ఉంటే పై లోకాలను, కడుపు లోనికి వెడితే అధో లోకాలను దహించివేస్తుందనే ఉద్దేశంతో మహాశివుడు ఆ విషాన్ని కంఠ మధ్యములో నిక్షేపించాడు. ఈ దృశ్యాన్ని చూసి, పార్వతీ దేవి తన భర్తకు ప్రమాదం వాటిల్లుతుందని భయపడి, శివునికి ప్రమాద నివారణ కోసం ప్రతి సంవత్సరము అగ్ని జ్వాల క్రింది నుంచి తన భర్తతో సహా దూరి వెడతానని మ్రొక్కుకుంది. మహాశివునికి ప్రమాదము జరుగలేదు. కనుక ప్రతి సంవత్సరము కార్తీక శుద్ధ పౌర్ణమి నాటి రాత్రి శివాలయములలో, ఎండు గడ్డితో చేసిన తోరణమును, రెండు కర్ర స్తంభముల మధ్య కట్టి, దానికి అగ్నిని ముట్టించి, ఆ తోరణము జ్వాలగా వెలుగుతుంటే, ఆ జ్వాల క్రింది నుంచి శివ, పార్వతుల పల్లకీని మూడు సార్లు మోసుకొని వెడతారు. జ్వాల వలె వెలిగే ఈ తోరణాన్ని "జ్వాలా తోరణము" అంటారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, పూర్వ కవి, శ్రీనాథుడు వ్రాసిన పద్యం :

 మ్రింగెడిది గరళమని తెలిసి
 మ్రింగెడివాడు ప్రాణవిభుడని, మేలని ప్రజకున్
 మ్రింగుమనె సర్వ మంగళ
 మంగళసూత్రమ్మునెంత మది నమ్మినదో

ఇక్కడ ఒక చిన్న విశేషం చెప్పడం కూడా అవసరం. హాలాహలమును కంఠ మధ్యములో ఉంచిన కారణంగా, మహాశివుని శరీరములో మంట బయలు దేరింది. ఈ మంటను అదుపు చేయడానికి, శివునికి నిరంతరం గంగాజలాన్ని అభిషేకిస్తుంటారు. ఆ విధంగా, శివుడు అభిషేకప్రియుడు అయ్యాడు.
ఆధునిక కాలంలో కూడా జ్వాలాతోరణం ఒక కాంతిని, వినోదంగా ఇచ్చే వస్తువు. దీపావళి నాడు జనం వినోదంగా కాల్చే వస్తువులలో మతాబులు, కాకరపువ్వొత్తులు, అగ్గిపెట్టెలతో పాటు మందుతో కూరిన, "జ్వాలా తోరణం" అని పిలువబడే ఒక తాడును కూడా కాలుస్తారు. ఈ తాడును కాలుస్తున్నప్పుడు, అది వెలువరించే కాంతి, మతాబులు, కాకరపువ్వొత్తులు కాల్చినప్పుడు వచ్చే కాంతివలె ఉండి, పిల్లలకు వినోదాన్ని, సంతోషాన్ని ఇస్తుంది.

_*శ్రీ శివ మహాపురాణం - 13 వ అధ్యాయ_

_*శ్రీ శివ మహాపురాణం - 13 వ అధ్యాయ_

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*సదాచారము - శౌచము - ధర్మమానుష్ఠానము*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*ఋషులిట్లు పలికిరి -*

సదాచారము వలన వివేకి పుణ్యలోకములను జయించగల్గును. అట్టి సదాచారమును మాకు వెంటనే వినిపింపుము. స్వర్గము నిచ్చు ధర్మకార్యములను, నరకమును కల్గించు అధర్మకార్యములను కూడ చెప్పుము .

*సూతుడిట్లు పలికెను -*

సదాచారము కలిగిన విద్వాంసుడు బ్రాహ్మణుడనియు , వేదోక్త కర్మలను అనుష్ఠించువాడు విప్రుడనియు నామమును పొందుదురు. సదాచారము , విద్య వేదోక్త కర్మానుష్ఠానము అనువాటిలో ఏదో ఒక గుణము గలవాడు ద్విజుడనబడును . తక్కువ ఆచారము, తక్కువ వేదాధ్యయనము కలిగి , రాజసేవ చేయు బ్రాహ్మణుడు క్షత్రియ బ్రాహ్మణుడనబడును. కొద్ది ఆచారము కలిగి , వ్యవసాయ వ్యాపారములను చేయు బ్రాహ్మణుడు వైశ్య బ్రాహ్మణు డనబడును . స్వయముగా భూమిని దున్ను బ్రాహ్మణుడు శూద్రబ్రాహ్మణు డనబడును. ఇతరుల యందు అసూయ కలిగి , వారికి ద్రోహము చేయు బ్రాహ్మణుడు చండాల బ్రాహ్మణుడనబడును . భూమిని పాలించువాడు రాజు అనియు , ఇతర రాజవంశీయులు క్షత్రియులనియు అనబడుదురు. ధాన్యాదులను అమ్మువాడు వైశ్యుడనియు, ఇతర వైశ్యవంశీయులు వణిక్‌ అనియు పిలువబడుదురు .

బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు సేవచేయువాడు శూద్రుడు అనియు, వ్యవసాయము చేయు ఇతరులు కర్షకులనియు, మిగిలినవారు దస్యులనియు తెలియవలెను . వీరందరు ఉషఃకాలము నందు తూర్పువైపు తిరిగి పరమేశ్వరుని ధ్యానించి, ధర్మార్థ ములను, వాటిలోని క్లేశములను, ఆదాయ వ్యయములను గూర్చి ఆలోచించవలెను. ప్రాతః కాలము నందు నిద్రను వీడే సమయమును, పద్ధతిని బట్టి, మానవులకు ఆయుర్దాయము, ద్వేషము, మరణము, పాపము, సంపద, వ్యాధి పుష్టి మరియు శక్తి అను ఫలములు కలుగును . రాత్రిలోని ఆఖరి యామమునకు ఉషస్సు అనియు, దానిలోని సగభాగమునకు సంధి అనియు పేరు. ద్విజుడు ఆ సమయములో లేచి, కాలకృత్యములను తీర్చుకొనవలెను . ఇంటికి దూరముగా బయటకు వెళ్లి ఉత్తరముఖముగా కూర్చుండవలెను. దానికి ఇబ్బంది ఉన్నచో ఇతర దిక్కునకు అభిముఖముగా కూర్చుండవలెను.

జలము, అగ్ని, బ్రాహ్మణుడు మొదలగు వాటికి, దేవతలకు ఎదురుగ కూర్చుండరాదు. ఎడమచేతితో గుహ్యమును, కుడిచేతితో నోటిని మూసి , మలవిసర్జన చేసి, పైకిలేచి, దానిని చూడరాదు. జలాశయము నుండి బయటకు తీసుకువచ్చిన జలముతో మాత్రమే శౌచము నాచరించవలెను. దేవ, పితృ, ఋషి తీర్థములలో దిగకుండగా, ఏడు, ఐదు లేక మూడుసార్లు మట్టితో గుదమును శుద్థి చేయవలెను . కొద్ది మట్టితో గుహ్యమును, చేతినిండా మట్టితో గుదమును శుద్ధి చేయవలెను. తరువాత లేచి, కాళ్లను చేతులను కడుగుకొని ఎనిమిది సార్లు నీటిని పుక్కిలించి ఉమ్మి వేయవలెను .

ఏదో ఒక ఆకుతో గాని, పుల్లతో గాని జలాశయమునకు బయట చూపుడువ్రేలిని ఉపయోగించకుండగా దంతధావనమును చేయాలి . జలాధిష్ఠాన దేవతలకు నమస్కరించి మంత్రపూర్వకముగా స్నానము చేయవలెను. కంఠము వరకు నీటిలో దిగి, అట్లు చేయ శక్తి లేనిచో, నడుము వరకు , లేదా మోకాళ్ల వరకు గాని నీటిలో దిగి, మంత్రపూర్వక స్నానమును చేయవలెను. విద్వాంసుడచటనే తీర్థజలముతో దేవ పితృ తర్పణములను చేయవలెను . తెల్లని వస్త్రమును తీసుకొని, అయిదు కచ్చలతో ధరించవలెను. సర్వ కర్మల యందు ఉత్తరీయమును తప్పక ధరించవలెను .

నదుల యందు, ఇతర తీర్థముల యందు స్నానము చేసినప్పుడు స్నానవస్త్రమును అచట ఉతకరాదు. విద్వాంసుడు స్నానాంతరము దానిని బావి వద్దకు గాని, ఇంటికి గాని తీసుకువెళ్లి , రాతిపై గాని, దుంగపై గాని, గట్టి నేలపై గాని, లేదా నీటి యందు గాని ఉతికి పిండవలెను. ఓ ద్విజులారా! ఆ వస్త్రజలము పితృదేవతలకు తృప్తినిచ్చును . జాబాలోపనిషత్తులోని 'అగ్నిరితి భస్మ' అను మంత్రమును ఉచ్చరించి, భస్మతో త్రిపుండ్రమును ధరించవలెను. అట్లు గాక, భస్మను నీట పారవేసినచో, ఆ వ్యక్తి దేహ త్యాగనంతరము నరకమును పొందును. పాపమును తొలగించుట కొరకై 'ఆపో హిష్ఠా' అను మంత్రముతో జలమును శిరస్సుపై చల్లుకొనవలెను.'యస్య క్షయాయ' అను మంత్రముతో పాదములపై చల్లుకొనవలెను. దీనికి సంధ్యాప్రోక్షణమని పేరు .

ఆపోహిష్ఠేత్యాది మంత్రములతో పాదమును, శిరస్సును, హృదయమును, ఆ తరువాత, శిరస్సును, హృదయమును, పాదమును, మరియు హృదయమును, పాదమును, శిరస్సును సంప్రోక్షణ చేయవలెను. పండితులు దీనిని మంత్ర స్నానమందురు . అపవిత్ర స్పర్శ కొద్దిగా కలిగినప్పుడు గాని, ఆరోగ్యము లేనప్పుడు గాని రాజునకు, రాష్ట్రమునకు భయము కలిగినప్పుడుగాని, యాత్రాకాలము నందు గాని మంత్రస్నానము చేయవలెను . ఉదయము 'సూర్యశ్చ' అను మంత్రముతో, సాయంకాలము 'అగ్నిశ్చ' అను మంత్రముతో నీటిని త్రాగి, మరల మంత్ర ప్రోక్షణమును చేయవలెను . ఓ బ్రహ్మణులారా! ఉదయము గాయత్రితో అభిమంత్రించిన జలమును తూర్పున కభిముఖముగా సూర్యునకు ఆర్ఘ్యము నీయవలెను. మధ్యాహ్నము మంత్రపూర్వకముగా ఒకే అర్ఘ్యము నీయవలెను .

సాయం సంధ్యలో భూమిపై కూర్చుండి పడమర వైపుకు తిరిగి అర్ఘ్యము నీయవలెను. ఉదయము తూర్పువైపుకు తిరిగి నీటిని కొద్దిగా పైకి విసిరి అర్ఘ్యము నీయవలెను. మధ్యాహ్నము వ్రేళ్లనుండి అర్ఘ్యము నిచ్చి , వ్రేళ్ల మధ్య గుండా లంబముగా సూర్యుని చూడవలెను. తరువాత ఆత్మ ప్రదక్షిణము చేసి, శుద్ధాచమనమును చేయవలెను . సాయంకాల సంధ్య నుండి గంట దాటిన తరువాత సంధ్యను ఉపాసించుట వ్యర్థము. కాలాతిక్రమము కాకుండా సంధ్యోపాసనమును చేయవలెను . నిత్య కర్మలేకుండా ఒక దినము గడచినచో, వంద గాయత్రిని జపించవలెను. నిత్యకర్మ పది దినములు లుప్తమైనచో లక్ష గాయత్రిని చేయవలెను . నిత్య కర్మ అయిన సంధ్యావందనము మాసము దాటి లుప్తమైనచో, మరల ఉపనయనమును చేయవలెను.

శివుడు, గౌరి, గుహుడు, విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు, మరియు యముడు  మొదలగు దేవతల నుద్దేశించి కార్య సిద్ధి కొరకు తర్పణముల నీయవలెను. తరువాత బ్రహ్మర్పణమును, శుద్ధాచమనమును చేయవలెను . విద్వాంసుడు తీర్థమునకు దక్షిణముగా నుండే ప్రశస్తమైన మఠములో గాని, మంత్రాలయములో గాని, దేవలయములో గాని, గృహము నందు గాని, ఒక నియమిత స్థలము నందు గాని , స్థిరమగు ఆసనము నందున్నవాడై, నిశ్చలమగు మనస్సు గలవాడై, దేవతలందరికీ నమస్కరించి, ముందుగా ఓంకారమును, తరువాత గాయత్రిని జపించవలెను . జీవబ్రహ్మల అభేదమును అనుసంధానము చేయుచూ, ఓంకారమును జపించవలెను.

'ముల్లోకములను సృష్టించిన బ్రహ్మను, స్థితికర్త యుగు విష్ణువును , సంహారకర్త యగు రుద్రుని ఆత్మ ప్రకాశరూపముగా ఉపాసించెదము. ఓంకారము మా యొక్క జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియములను, మనోవృత్తులను, ధీవృత్తులను , సర్వకాలముల యందు, భోగమోక్షముల నిచ్చు ధర్మము నందు, మరియు జ్ఞానము నందు ప్రేరేపించుగాక!' ఈ తీరున ఓంకారము యొక్క అర్థమును బుద్ధితో ధ్యానించువాడు నిశ్చయముగా మోక్షమును పొందును . ఈ అర్థము తెలియకున్ననూ బ్రాహ్మణ్యము పరిపూర్తి చెందుటకై నిత్యము ఓంకారమును జపించవలెను. బ్రాహ్మణుడు ప్రతిదినము గాయత్రిని ఉదయము వేయి జపించి , యథాశక్తి ఇతర మంత్రములను కూడ జపించవలెను. మధ్యాహ్నము గాయత్రిని వందసార్లు, సాయంకాలము నందు ఇరువది ఎనిమిది సార్లు జపించవలెనని తెలియవలెను.

మూలాధారము నుండి సహస్రారము వరకు గల ఆరు చక్రములలో విద్యేశ్వర, బ్రహ్మ, విష్ణు, ఈశ, జీవాత్మ , పరమాత్మలను ధ్యానించవలెను . 'సోహం (అది నేనే)' అను పరబ్రహ్మ బుద్ధితో ఆ దేవతలతో ఐక్యమును భావన చేయుచూ, గాయత్రిని జపించవలెను. మరియు, ఆ దేవతలను బ్రహ్మ రంధ్రము నందు, దేహమునకు బయట కూడ భావన చేయవలెను . మహత్తత్త్వము నుండి ఈ వేలాది శరీరములు బయల్వెడలినవి. ఒక్కొక్క గాయత్రీ జపముచే ఒక్కొక్క శరీరమును మెల్లమెల్లగా అతిక్రమించి , జీవుని పరమాత్మ యందు లీనము చేయవలెను. ఇదియే జపము యొక్క తత్త్వము అని చెప్పబడినది.

గాయత్రిని వందగాని, ఇరువది ఎనిమిది గాని జపించవలెను . ఈ విధముగా భావనలో శరీరమును అధిగమించి (తాదాత్మ్యమును వీడి) జపించవలెను. వేయి జపము వలన బ్రహ్మలోకము, వంద జపించినచో ఇంద్రలోకము లభించును . ఇతరులు గాయత్రిని జపించి ఉత్తమ జన్మను పొంది ఆత్మోద్ధారమును గాంచెదరు. ఈ తీరున జపము చేసి సూర్యున కభిముఖముగా ఉపస్థానమును చెప్పవలెను . పన్నెండు లక్షల గాయత్రిని జపించినవాడు పూర్ణ బ్రాహ్మణు డనబడును. లక్షకు తక్కువ గాయత్రిని జపించిన వాడు వైదిక కర్మలకు అర్హుడు కాడు .

డెబ్బది ఏండ్ల వరకు నియమములను పాటించి, తరువాత సన్న్యసించవలెను. సన్న్యాసి ఉదయమే పన్నెండు వేలు ఓంకారమును జపించవలెను . ఒకరోజు జపమును వీడినచో, మరునాడు రెండురోజుల జపమును పూర్తి చేయవలెను. నెలరోజులు జపమును మానినచో, ఏభై వేలు జపించిన ఆ దోషము తొలగును . అంతకు మించి జపమును వీడినచో, మరల గురువు వద్ద దీక్షను పొందవలెను. అట్లు చేసినచో, దోషము శాంతించును. లేదా, రౌరవ నరకమును పొందును.

కామనలు గలవాడు ఆ కామనలను సిద్ధింపజేసే వేదోక్త కర్మలను ఆచరించుటకు యత్నించవలెను. వాటి కొరకు ధనమును సంపాదించవలెను. కామనలు లేనివానికి ఈ ప్రయత్నము అనావశ్యకము. బ్రాహ్మణుడు ముముక్షువు అయి, సర్వదా బ్రహ్మజ్ఞానమును అభ్యసించవలెను . ధర్మము వలన ధనము, ధనము వలన భోగము లభించును. ధర్మముగా సంపాదించిన ధనముతో లభించిన భోగము వైరాగ్యమునకు హేతువు అగును . అధర్మార్జితమైన ధనముతో అనుభవించే భోగములు రాగమును కలిగించును. ధర్మము ద్రవ్య ధర్మము, దేహధర్మము అని రెండు రకములు . యజ్ఞము మొదలగునవి ద్రవ్యధర్మములు. తీర్థములలో స్నానము చేయుట మొదలగునవి దేహధర్మములు. ధనము వలన మరింత ధనము పుట్టును. తపస్సు వలన దివ్యరూపము లభించును . నిష్కామముగా ధర్మము నాచరించినచో, అంతఃకరణ శుద్ధి కలుగును. శుద్ధి వలన జ్ఞానము కలుగుననుటలో సందియము లేదు.

కృతము మొదలగు యుగములలో తపస్సు ప్రశస్తమైనది కాగా, కలియుగములో ద్రవ్యధర్మము (దానము) ప్రశస్తమైనది . కృతయుగములో ధ్యానము వలన, త్రేతా యుగములో తపస్సు వలన, ద్వాపరములో యజ్ఞానుష్ఠానము వలన, కలియుగములో మూర్తిపూజ వలన జ్ఞానము కలుగును . పుణ్యపాపములు ఎట్టివియో, వాటి ఫలము కూడ అట్టిదిగనే యుండును. దానాదులలో ద్రవ్యమును బట్టి, తపస్సులో కాయక్లేశమును బట్టి పుణ్యఫలములో హేచ్చుతగ్గులు ఉండును . అధర్మము పీడను, ధర్మము సుఖమును వర్థిల్లజేయును . మంచి ప్రవర్తన వలన దుఃఖము, సత్ర్పవర్తన వలన సుఖము కలుగును. కావున, భోగమోక్షములు సిద్ధించుట కొరకై ధర్మమును సంపాదించవలెను.

నల్గురు వ్యక్తులతో కూడిన కుటుంబము గల బ్రాహ్మణునకు వంద సంవత్సరముల వరకు జీవకను సమకూర్చినచో, అట్టి దానము వలన బ్రహ్మలోకము లభించును . వేయి చాంద్రాయణ వ్రతములను చేసినచో, బ్రహ్మలోకము లభించునని చెప్పుదురు.

వేయి కుటుంబములకు జీవికను సమకూర్చిన క్షత్రియుడు  ఇంద్రలోకమును పొందును. పదివేల మందికి జీవికను కలుగుజేసినచో, బ్రహ్మలోకము లభించును. మానవుడు ఏ దేవతను ఉద్దేశించి దానము చేయునో , ఆ లోకమును పొందునని వేదవేత్తలు చెప్పుదురు. ధనము లేనివాడు అన్నివేళలా తపస్సును ఆర్జించవలెను .

తీర్థసేవనము వలన, తపస్సు వలన అక్షయ సుఖము లభించును.

ఇపుడు న్యాయముగా ధనము నార్జించు విధమును చెప్పెదను . బ్రాహ్మణుడు సమాహిత చిత్తము గలవాడై పవిత్రమగు ప్రతిగ్రహము వలన, పవిత్రమగు యాజనము (యజ్ఞాదులను చేయించుట) వలన ధనమును సంపాదించవలెను. ధనార్జనలో దైన్యమునకు, అత్యధిక శ్రమకు తావీయరాదు . క్షత్రియుడు భుజబలముతోను, వైశ్యులు వ్యవసాయము చేత, గోపాలన చేత ధనార్జన చేయవలెను. న్యాయముగా సంపాదించిన ధనమును దానము చేయుట వలన జ్ఞానము సిద్ధించును. గురువు యొక్క అనుగ్రహముచే జ్ఞానము ఉదయించిన సర్వులకు మోక్షము సిద్ధించును. మోక్షము వలన ఆత్మ సాక్షాత్కారము కలిగి, పరమానందము లభించును . ఓ ద్విజులారా! ఇది అంతయూ మానవులకు సత్సంగము వలన లభించును. గృహస్థు ధనధాన్యాదులను ఇతరులకు దానము చేయవలెను .

ఏయే కాలముల యందు ఏయే వస్తువులు, ఫలములు, మరియు ధాన్యములు లభించునో, వాటి నన్నిటినీ, హితము గోరు మానవుడు బ్రాహ్మణులకు ఈయవలెను . ఇతరులకు త్రాగునీటిని సర్వదా ఈయవలెను. ఆకలి అను రోగమును శాంతింపజేయుటకై అన్నము నీయవలెను. భూమిని, ధాన్యమును, బియ్యమును, భక్ష్యభోజ్య లేహ్య చోష్యములను నాల్గు విధముల అన్నమును దానము చేయవలెను . దాత పెట్టిన అన్నమును తినిన వ్యక్తి ఆ శక్తితో ఎంతవరకు శ్రవణాదులచే పుణ్యమును సంపాదించునో, దానిలో సగము పుణ్యము ఆ దాతకు లభించు ననుటలో సందేహము లేదు . దానమును స్వీకరించిన వ్యక్తి దానిలో కొంత భాగమును మరల దానము చేసి, మరియు తపస్సును చేసి, ఆ పాపమును పోగొట్టుకొనవలెను. అట్లు గానిచో, రౌరవనరకమును పొందెదరు.

మానవుడు తనవద్దనున్న ధనమును, ధర్మ, వృద్ధి, భోగముల కొరకు మూడు భాగములు చేసి, ధర్మ భాగముతో నిత్య నైమిత్తిక, కామ్య కర్మలను చేయవలెను . వృద్ధి భాగముతో ధనమును వృద్ధి చేసుకొనవలెను. సాధకుడు భోగభాగముతో హితము, పవిత్రము నగు భోగమును మితముగా సేవించవలెను . వ్యవసాయము వలన లభించే ధనములో పదవ వంతును పాప నిర్మూలన కొరకు దానము చేయవలెను. మిగిలిన ధనముతో ధర్మ , వృద్ధి , భోగములను చేయవలెను. అట్లు గానిచో రౌరవ నరకమును పొందును . లేదా, పాపముతో నిండిన బుద్ధి కలవాడగును; లేదా నిశ్చితముగా వినాశమును పొందును. వివేకులైన వారు వ్యాపారుములో లభించిన ధనములో ఆరవ భాగమును దానము చేయవలెను .

బ్రహ్మణులు తాము పొందిన పవిత్రమగు ప్రతిగ్రహములో నాల్గవ వంతును , అకస్మాత్తుగా లభించిన ధనములో సగమును దానము చేయవలెను . అపవిత్రమగు ప్రతి గ్రహము వలన లభించిన సర్వమును సముద్రములో పడవేయవలెను. మానవుడు తనకు భోగభాగ్యములు కలుగుట కొరకై విద్వాంసులను ఆహ్వానించి , దానము చేయవలెను .  యాచకుడు అడిగిన వాటిని సర్వమును తన శక్తి మీరకుండగా దానము చేయవలెను. కోరిన వస్తువును దానము చేయనిచో , కోరబడినవాడు ఆ ఋణమును మరుజన్మలో తీర్చవలయును . వివేకులు ఇతరుల దోషమును వర్ణించరాదు. ఓ బ్రాహ్మణులారా! మనము కనిన , లేక వినిన పరదోషములను ప్రకటించరాదు .

వివేకి ఇతరుల హృదయమునకు దుఃఖమును కలిగించే విధంగా పలుకరాదు. ఐశ్వర్యప్రాప్తి కొరకై ఉభయసంధ్యలలో అగ్నిహోత్రమును అనుష్ఠించవలెను . రెండుసార్లు అగ్నిహోత్రమును చేయుటకు శక్తి లేనిచో ఏకకాలము నందైననూ సూర్యాగ్నులకు బియ్యము , ధాన్యము , నేయి , పండు , దుంప , ఇత్యాది హవిస్సును యాథాశాస్త్రముగా అర్పించవలెను . మరియు , యథావిధిగా స్థాలీపాకమును చేయవలెను. హవిస్సు లేనిచో ప్రధాన హోమమునైననూ చేయవలెను . ఏనాడూ ఆరిపోని అగ్నిని విద్వాంసులు అజస్రమని పిలుతురు. అట్లు అగ్నిని ఉపాసించలేనివాడు జపమునైననూ , కనీసము సూర్యునకు నమస్కారమునైననూ చేయవలెను .

ఆత్మ జ్ఞానమును గోరువారు , మరియు ధనమును కోరువారు ఈ విధముగా యథాశాస్త్రముగా ఉపాసించవలెను. బ్రహ్మయజ్ఞమును శ్రద్ధతో అనుష్ఠించువారు , ప్రతిదినము ఈశ్వరుని పూజించువారు . అగ్ని ఉపాసనాపరులు , గురు శశ్రూషను శ్రద్ధగా చేయువారు , బ్రాహ్మణులకు తృప్తిని కలిగించువారు వీరందరు స్వర్గమును పొందెదరు.

*శ్రీ శివ మహాపురాణములోని విద్యేశ్వర సంహిత యందు పదమూడవ అధ్యాయము ముగిసినది.*

|| ఓం నమశ్శివాయ |||| శ్రీ గురుభ్యోనమః ||కార్తీక పురాణం - 13 వ అధ్యాయము

|| ఓం నమశ్శివాయ ||
|| శ్రీ గురుభ్యోనమః ||

కార్తీక పురాణం - 13 వ అధ్యాయము

🪔 కన్యాదాన ఫలం, సువీరచరిత్రము 🪔

తిరిగి వశిష్టుడు జనకుడితో ఇలా అంటున్నాడు ”ఓ మహారాజా! కార్తీకమాసంలో ఇంకా విధిగా చేయాల్సిన ధర్మాలు చాలా ఉన్నాయి. వాటిని వివరిస్తాను విను… కార్తీకమాసంలో నదీస్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణుడి కుమారుడికి ఉపనయనం చేయడం మరింత ముఖ్యం. ఒకవేళ ఉపనయనానికి అయ్యే ఖర్చు అంతా భరించే శక్తిలేనప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాలు, సంభావనలతో తృప్తిపరిచినా ఫలితం కలుగుతుంది. ఈ విధంగా ఓ పేద బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేసినట్లయితే… ఎంతటి మహాపాపాలైనా తొలగిపోతాయి. ఎన్ని బావులు, చెరువులు తవ్వించినా… పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేస్తే వచ్చే ఫలితానికి సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం. కార్తీకమాసంలో భక్తిశ్రద్ధలతో కన్యాదానం చేసినట్లయితే… తను తరించడమే కాకుండా… తన పితృదేవతలను కూడా తరింపజేసినవారవుతారు. ఇందుకు ఒక వృత్తాంతముంది. చెబుతాను విను…” అని ఇలా చెప్పసాగాడు…

🐚🐚🐚 సువీర చరితం 🐚🐚🐚

పూర్వం వంగ దేశంలో గొప్ప పరాక్రమ వంతుడు, శూరుడు అయిన ”సువిరు”డను ఒక రాజు ఉండేవాడు. అతనికి రుపవతి అయిన భార్య ఉంది. ఒకసారి అతను శత్రురాజులచే పరాజితుడయ్యాడు. దీంతో అతను భార్యతో కలిసి అరణ్యానికి పారిపోయి, ధన హీనుడై, నర్మదానదీ తీరంలో పర్ణశాల నిర్మించుకుని, కందమూలాలు భక్షిస్తూగడపసాగాడు. కొన్నాళ్లకు అతని భార్య ఒక బాలికను కన్నది. ఆ బిడ్డను అతి గారాబంతో పెంచుచుండేవారు. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు లేకపోయినా… శుక్లపక్ష చంద్రుడి మాదిరిగా రోజురోజూ అభివృద్ధి కాసాగింది. అతిగారాబంతో పెరగసాగింది. అలా రోజులుగడుస్తుండగా… ఆ బాలిక యవ్వనవతియైంది. ఒక దినాన వానప్రస్తుడి కుమారుడు ఆ బాలికను చూసి, అందచందాలకు పరవశుడై, తనకు ఇచ్చి వివాహం చేయమని ఆ రాజును కోరాడు. అందుకా రాజు ”ఓ మునిపుత్రా…!

ప్రస్తుతం నేను కడు బీద స్థితిలో ఉన్నాను. అష్టదరిద్రాలు అనుభవిస్తున్నాను. మా కష్టాలు తీరేందుకు కొంత ధనమిచ్చినట్లయితే… నా బిడ్డనిచ్చి పెండ్లి చేస్తానని చెప్పాడు. దాంతో ఆ మునిపుత్రుడు చేతిలో పైసా లేకున్నా… బాలికపై ఉన్న మక్కువతో కుబేరుడిని గురించి ఘోర తపస్సు చేశాడు. కుబేరుడిని మెప్పించి, ధన పాత్ర సంపాదించాడు. రాజు ఆ పాత్రను తీసుకుని, సంతోషించి, తన కుమార్తెను ముని కుమారుడికిచ్చి పెళ్లి చేశాడు. నూతన దంతపతులిద్దరినీ అత్తవారింటికి పంపాడు.
అలా మునికుమారుడు తన భార్యను వెంటబెట్టుకుని, తల్లిదండ్రుల వద్దకు వెళ్లి, నమస్కరించి, జరిగిన సంగతిని చెప్పాడు. తన భార్యతో కలిసి సుఖంగా జీవించసాగాడు. అయితే సువీరుడు మునికుమారుడిచ్చిన పాత్రను తీసుకుని, స్వేచ్ఛగా ఖర్చుచేస్తూ… భార్యతో సుఖంగా ఉండసాగాడు. కొంతకాలానికి అతనికి మరో బాలిక జన్మించింది. ఆమెకు కూడా యుక్తవయసు రాగానే, ఎవరికైనా ధనానికి అమ్మాలనే ఆశతో ఎదురుచూడసాగాడు.

ఒక సాధువు తపతీ నదీ తీరం నుంచి నర్మదా నదీ తీరానికి స్నానార్థం వస్తుండగా… దారిలో ఉన్న సువీరుడిని కలుసుకున్నాడు… ”ఓయీ! నీవెవరు? నీ ముఖ వర్చస్సు చూస్తే రాజవంశంలో పుట్టినవాడిలా ఉన్నావు. ఈ అడవిలో ఏం చేస్తున్నావు? భార్యాపిల్లలతో ఇక్కడ జీవించడానికి కారణమేమిటి?”అని ప్రశ్నించాడు. దానికి సువీరుడిలా చెబుతున్నాడు… ”ఓ మహానుభావా! నేను వంగదేశాన్ని పరిపాలించేవాడిని. నా పేరు సువీరుడు. నా రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించడంతో భార్యాసమేతంగా ఈ అడవిలో నివసిస్తున్నాను. దరిద్రం కంటే కష్టమేది ఉండదు. పుత్రశోకం కంటే దు:ఖం ఉండదు. అలాగే భార్యావియోగం కంటే సంతాపం వేరొకటి లేదు. అందువల్ల రాజ్యభ్రష్టుడనైనా… ఈ కారడవిలో ఉన్నంతలో సంతృప్తి పొందుతూ కుటుంబ సమేతంగా బతుకుతున్నాను. నాకు ఇద్దరు కుమార్తెలు. అందులో మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునకు ఇచ్చి, వాడి వద్ద కొంత దానం తీసుకున్నాను. దాంతో ఇప్పటి వరకు కాలక్షేపం చేస్తున్నాను” అని చెప్పగా… ”ఓ రాజా! నీవు ఎంతటి దరిద్రుడవైనా… ధర్మ సూక్షం ఆలోచించకుండా కన్యను అమ్ముకున్నావు. కన్య విక్రయం మహాపాతకం. కన్యను విక్రయించువాడు అసి పత్రవానమనే నరకాన్ని అనుభవిస్తాడు. ఆ ద్రవ్యాలతో చేసే వ్రతం ఫలించదు. కన్య విక్రయం చేసేవారికి పితృదేవతలు పుత్ర సంతతి కలుగకుండా శపిస్తారు. అలాగే కన్యను ధనమిచ్చి కొని, పెండ్లాడిన వారి గృహస్థధర్మాలు వ్యర్థమగుటయేకాకుండా, అతను మహా నరకం అనుభవిస్తాడు. కన్యను విక్రయించేవారికి ఎలాంటి ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి రాబోయే కార్తీక మాసంలో రెండో కుమార్తెకు శక్తికొలదీ బంగారు ఆభరణాలతో అలంకరించి, సదాచార సంపన్నుడికి, ధర్మబుద్ధిగలవాడికి కన్యాదానం చేయి. అట్లు చేసినట్లయితే గంగాస్నానం, అశ్వమేథయాగ ఫలాలను పొందుతావు. మొదటి కన్యను అమ్మిన పాప ఫలాన్ని తొలగించుకున్న వాడివవుతావు” అని రాజుకు హితోపదేశం చేశాడు.

అందుకారాజు చిరునవ్వుతో… ”ఓ మునివర్యా! దేహసుఖం కంటే దానధర్మాలతో వచ్చిన ఫలం ఎక్కువా? తాను బతికుండగానే భార్యాబిడ్డలు, సిరిసంపదలతో సుఖంగా ఉండకుండా, చనిపోయిన తర్వాత వచ్చే మోక్షం కోసం ప్రస్తుతం ఉన్న అవకాశాలను చేతులారా జార విడుచుకోమంటారా? ధనం, బంగారం కలవాడే ప్రస్తుతం లోకంలో రాణించగలడు. కానీ, ముక్కుమూసుకుని, నోరుమూసుకుని, బక్కచిక్కి శల్యమైనవాడిని లోకం గుర్తిస్తుందా? గౌరవిస్తుందా? ఐహిక సుఖాలే గొప్పసుఖాలు. కాబట్టి నా రెండో బిడ్డను నేనడిగతినంత ధనం ఇచ్చే వారికే ఇచ్చి పెండ్లిచేస్తాను. కానీ, కన్యాదానం మాత్రం చేయను” అని నిక్కచ్చిగా చెప్పాడు. ఆ మాటలకు ఆ సన్యాసి ఆశ్చర్యపడి, తన దారిన తాను వెళ్లిపోయాడు. మరికొన్ని రోజులకు సువీరుడు చనిపోయాడు. వెంటనే యమ భటులు వచ్చి, అతన్ని తీసుకుపోయిరి. యమలోకంలో అసిపత్రవనం అనే నరకంలో పారేశారు. అక్కడ అనేక విధాలుగా బాధించారు. సువీరుడికి పూర్వికుడైన శ్రుతుకీర్తి అనే రాజు ధర్మయుక్తంగా ప్రజల్ని పాలించి, ధర్మాత్ముడై మృతిచెంది, స్వర్గాన్ని పొందాడు. అయితే ఆయన వంశజుడైన సువీరుడు చేసిన కన్యా విక్రయం వల్ల శ్రుతుకీర్తి కూడా స్వర్గం నుంచి నరకానికి వచ్చాడు.  అంతట శ్రుతకీర్తి ”నేను ఒకరికి ఉపకారం చేశానే తప్ప అపకారమెన్నడూ చేయలేదు. దానధర్మాలు, యజ్ఞయాగాదులు చేశాను. అయినా.. నాకు ఈ దుర్గతి ఎలా?” అని నిండు కొలువులో యమధర్మ రాజును ప్రశ్నించాడు.

వినయంగా ఇలా చెబుతున్నాడు… ”ప్రభూ… నీవు సర్వజ్ఞుడవు. ధర్మమూర్తివి. బుద్ధిశాలివి. ప్రాణకోటిని తరతమ తారతమ్య బేధాలు లేకుండా సమానంగా చూస్తావు. నేనెన్నడూ పాపం చేయలేదు. అయితే నన్ను స్వర్గం నుంచి ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చారు? కారణమేమిటి?” అని ప్రశ్నించాడు. దానికి యమధర్మరాజు శ్రుతకీర్తిని చూచి ”ఓయీ… నీవు న్యాయమూర్తివి. ధర్మజ్ఞుడవే. నీవు ఎలాంటి దూరాచారం చేయలేదు. అయినా… నీ వంశీయుడైన సువీరుడు తన జేష్ఠ పుత్రికను అమ్ముకొన్నాడు. కన్యను అమ్ముకునే వారు, వారి పూర్వికులు ఎంతటి పుణ్యవంతులైనా… నరకాలను అనుభవించక తప్పదు. నీచజన్మలు ఎత్తవలసి ఉంటుంది. నీవు పుణ్యాత్ముడవే. అయితే నీకో మార్గం చెబుతాను. నీకు మానవ శరీరాన్ని ఇస్తాను. నీ వంశీయుడైన సువీరుడికి ఇంకో కుమార్తె ఉన్నది. ఆమె నర్మదానదీ తీరంలో తల్లివద్దే పెరుగుతున్నది. అక్కడకు పోయి, ఆ కన్యను వేద పండితుడు, శీలవంతుడికి కార్తీక మాసంలో సాలంకృతంగా కన్యాదానం చేయి. నీవు, మీవాళ్లు ఆ పుణ్యఫలంతో స్వర్గానికి వెళ్తారు” అని చెప్పాడు. ”పుత్రికాసంతానం లేనివారు తమ ద్రవ్యంతో కన్యాదానంచేసినా, విధిగా ఆంబోతుకు వివాహం చేసినా కన్యాదాన ఫలం వస్తుంది. కావున నీవు భూలోకానికి వెళ్లి నేను చెప్పినట్లు చేయి. ఆ కార్యం కారణంగా పితృగణమంతా తరిస్తారు” అని యముడు సెలవిచ్చెను.

శ్రుతకీర్తి యముడికి నమస్కరించి సెలవు తీసుకుని, నర్మదా నదీతీరంలో ఒక పర్ణకుటీరంలో నివసిస్తున్న సువీరుడి భార్యను, కుమార్తెను చూచి, సంతోషపడి, ఆమెతో అసలు విషయం చెప్పి, కార్తీక మాసంలో సువీరుడి కూతురిని కన్యాదానం చేశాడు. ఆ వెంటనే సువీరుడు, శ్రుతకీర్తి, వారి పూర్వీకులు పాపవిముక్తులై, స్వర్గలోకాన్ని చేరారు.

”ఓ జనకమహారాజా! కార్తీకంలో కన్యాదానానికి అంతటి శక్తి ఉంది. అత్యంత పుణ్యఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి కార్తీకమాసంలో కన్యాదానం చేసేవాడు విష్ణుసాన్నిధ్యాన్ని పొందుతాడు” అని వివరించాడు.

🌺 ఇతి శ్రీ స్కాంధపురాణాంతర్గత, వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య: త్రయోదశాధ్యాయ సమాప్త: 🌺

Sunday, November 22, 2020

ఓం నమో భగవతే వాసుదేవాయ నమః:#karthika_puranam *కార్తీకపురాణం 4 వ అధ్యాయము*🌺🌺🌺🌺🌺🌺🌺🌺*దీపారాధన మహిమ*

ఓం నమో భగవతే వాసుదేవాయ నమః:
#karthika_puranam 

*కార్తీకపురాణం 4 వ అధ్యాయము*
🌺🌺🌺🌺🌺🌺🌺🌺

*దీపారాధన మహిమ*

ఈ విధముగా వశిష్టుడు కార్తిక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొ౦దెదరని చెప్పుచుండగా జనకుడు 'మహితపస్విత ! తమరు తెలియజేయు యితిహాసములు వినిన కొలది తనివి తిరకున్నది. కార్తీక మాసము ముఖ్యముఘ యేమేమి చేయవలయునో, యెవరి నుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు' అని కోరగా వశిష్టుల వారు యిట్లు చెప్పదొడగిరి. 
జనకా! కార్తీక మాసమందు సర్వ సత్కార్యములనూ చేయవచ్చును. దీపారాధన మందు అతి ముఖ్యము దీని వలన మిగుల ఫలము నొ౦ద వచ్చును. సూర్యాస్తమయ మందు, అనగా, సంధ్య చీకటి పడు సమయమున శివకేశవులు సన్నిధినిగాని ప్రాకారంబున౦దు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని  వైకుంట ప్రాప్తి నొ౦దుదురు. కార్తిక మాసమందు హరి హరాదులు సన్నిధిలో ఆవునేతితో గాని, కొబ్బరి నూనెతో గాని, విప్ప నూనెతో గాని, యేది దొరకనప్పుడు  అముదముతో గాని దీపము వెలిగించి వుంచవలెను. దీపారాధన యే నూనెతో చేసిననూ మిగుల పుణ్యత్ములుగాను, భక్తి పరులగాను  నగుటయేగాక అష్టైశ్వర్యములూ కలిగి శివ సన్నిధి కేగుదురు. ఇందు కొక కథ గలదు, వినుము.

*శతృజిత్ కథ* 

పూర్వము పాంచాల దేశమును పాలించు చున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి, తుదకు విసుగుజెంది తీరమున నిష్ఠతో తపమాచరించు చుం డగా నచ్చుటకు 
పికెదుడను ఇడీముని పుంగవుడు వచ్చి ' పాంచాల రాజా! నివెందుల కింత తపమాచరించు చున్నావు? ని కోరిక యేమి?' యని ప్రశ్ని౦చగా, ' ఋషిపుంగవా! నాకు అష్ఠ యిశ్వర్యములు, రాజ్యము, సంపదావున్ననూ, నావ౦శము నిల్పుటకు పుత్ర సంతానము లేక, కృంగి కృశించి యీ తీర్ధ స్థానమున తపమాచరించు చున్నాను' అని   చెప్పెను. అంత మునిపున్గావుడు' ఓయీ! కార్తిక మాసమున శివ సన్నిధిని శివ దేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన యెడల ని కోరిక నేర వేరగలదు ' యని చెప్పి వెడలిపోయెను.

వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తి కై అతి భక్తి తో శివాలయమున కార్తిక మాసము నెలరొజులూ దీపారాధన చేయించి, దన ధర్మాలతో  నియమను సారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు ప౦చిపెట్టుచు , విడువకుండా నెలదినములూ అటుల చేసెను. తత్పుణ్య కార్యమువలన నా రాజు భార్య గర్భవతియై క్రమముగా నవమాసములు నిండిన తరువాత నొక శుభ ముర్తుమున నొక కుమారుని గనెను. రాజ కుటు౦బికులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రో త్సవములు చేయించి, బ్రాహ్మణులకు దానధర్ములు జేసి, ఆ బాలునకు ' శత్రుజి' యని నామకరణ ము చేయించి అమిత గరబముతో పెంచుచు౦డిరి. కార్తిక మాస  దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తిక మాస వ్రతములు, దీపారాధనలు చేయుడని రాజు శాసించెను.
రాకుమారుడు శత్రుజి దినదిన ప్రవర్థ మనుడగుచు సకల శాస్త్రములు చదివి, ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కాని, యవ్వనమునము  రాగానే దుష్టుల సహవాసము చేతను, తల్లితండ్రుల గారాబము చేతను తన కంటి కింపగు స్రీలకు బలత్కరించుచు,యెదిరించిన వారిని దండి౦చుచు తన కమావా౦ఛా తిర్చుకోను చుండెను.
తల్లితండ్రులు కూడా, తమకు లేక లేక కలిగిన కుమారుని యెడల చూచి చూడనట్లు - విని విననట్లు వుండిరి. శత్రుజి ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పు వారలను నరుకుదున ని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను జేయుచుండెను. అటుల తిరుగుచుండగా నొక దినమున నొక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను.  ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ భార్య మిగుల రూపవతి. ఆమె అందచందములను వ ర్ణి౦ చుట మన్మదునకై ననూ శక్యము గాదు.  అట్టి స్రీ క౦టపడగానే రాజకుమారుని మతి మందగించి కోయ్యబోమ్మవలె నిశ్చే ష్టుడై  కమవికరముతో నామెను సమీపించి తన కమవా౦ఛ తెలియచేసేను. ఆమె కూడా నాతని సౌదర్యానికి ముద్దురాలై  కులము, శిలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొనిపొయి భోగములను భావించెను. 

ఇట్లుఒకరికొకరు ప్రేమలో పరవశులగుటచేత వారు ప్రతి దినము నర్ద రాత్రివేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసు కొనుచు తమ కామవా౦చ తీర్చు కొనుచు౦డిరి. ఇటుల కొంత కాలం జరిగెను. ఎటులనో యీ సంగతి ఆమె మగనికి తెలిసి, పసిగట్టి, బార్యనూ, రాజకుమారుని ఒకేసారిగా చంపవలయునని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచు౦డెను.

ఇట్లుండగా కార్తిక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురు శివాలయమును కలుసుకొనవలెనని నిర్ణయి౦చుకొని, యెవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి యెటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో  సహా బయలు దేరి గర్భ గుడిలో దాగి యుండెను. అ కాముకులిద్దరూ గుడిలో కలుసుకొని గాడాలింగన మొనర్చు కొను సమయమున ' చీకటిగా వున్నది, దీపము౦డిన బాగుండును గదా,' యని రాకుమారుడనగా, ఆమె తన  పైట చెంగును చించి అక్కడ నున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగెంచెను. తర్వాత వారిరువురూ మహానందముతో  రతి క్రీడలు సలుపుటకు వుద్యుక్తులగుచుండగా, అదే యదనుగా నామె భర్త, తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భర్యనూ, ఆ రాజకుమారుని

ఖండించి తనుకూడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తిక శుద్ధ పౌర్ణమి, సోమవారమగుట వలనను, ఆ రోజు ముగ్గురునూ చనిపోవుట వలననూ శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటకునూ - యమదూతలు  బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడకు వచ్చిరి. అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు ' ఓ దూతలార! నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు ? కామా౦ధకారముతో  కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన అ వ్యభిచారుల కొరకు శివ దూతలు విమానములో వచ్చుటేల? చిత్రముగా నున్నదే! అని ప్రశ్నించెను . అంత యమకింకరులు ' ఓ బాపడ!ఎ వరెంతటి  నీచులైననూ, యీ పవిత్ర దినమున, అంగ, కార్తిక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయములో శివునిసన్నిదిన దీపం వేలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నియును నశి౦ఛిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొనిపోవుటకు శివధూతలు వచ్చినారు' అని చెప్పగా- యీ సంభాషణ మంతయు వినుచున్న రాజకుమారుడు ' అల యెన్నటికిని జరగనివ్వను.  తప్పొప్పులు యెలాగునున్నపటికి మేము ముగ్గురమునూ ఒకే సమయములో ఒక స్థలములో మరణి౦చితిమి. కనుక ఆ ఫలము మా యందరికి  వర్తి౦చ వలసినదే ' అని, తాము చేసిన దీపారాధన ఫలములో  కొంత అ బ్రాహ్మణునకు దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమన మెక్కించి శివ సాన్నిద్యమునకు జేర్చిరి. 
వింటివా రాజా ! శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు పాపములు పోవుటయేగాక, కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన, కార్తిక మాసములో నక్షత్రమాల యందు దీపముంచిన వారు జన్మరాహిత్య మొ౦దుదురు.

*ఇట్లు స్కాంద పురాణా౦తర్గత త వశిష్ట ప్రోక్త  కార్తిక మహాత్యమందలి*
*నాలుగో అధ్యయము- నాల్గవ రోజు పారాయణము సమాప్తం.*
*ఉ || ఎల్ల శరీర దారులకు నీళ్ళను చీకటి నులిలోపలన్*
*ద్రెళ్లక ' మీరుమే' మనుమమతి భ్రమ* *ణంబున భిన్నులై*
*ప్రవర్తిల్లక సర్వమున్నతని* *దివ్యకళమయమంచు విష్ణు న౦*
*దుల్లము జేర్చి తారడ విను౦డుట మేలు నిశాచ రాగ్ర ణి ||*

#karthika_puranam

#karthika_puranam 

🕉ధర్మ ప్రచారం🕉
 *ॐ* *ఓం నమః శివాయ* *ॐ*
రేపు నాగుల చవితి

భక్తి శ్రద్ధలతో నాగుల చవితి .... నాగుల చవితి విశిష్టత .....
పుట్టకు పాలు పోసి, పుట్టకు ప్రదక్షిణ, నమస్కారాలు చేస్తూ ఏం కొరుకోవాలి ....???
నాగుపాము కాటు పొందిన నరుడు మరణించిన పిదప ఆత్మ ఏక్కడికి పోతుంది ....???
ఆంధ్రదేశాన్ని పాలించిన నాగరాజుల వంశం ....
.
పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ! అనంతాది మహానాగ రూపాయ వరదాయచతుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా !

ప్రకృతి మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని - ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకొంటూ! పూజిస్తూవస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే ... అందులో భాగంగానే ' నాగుపాము" ను కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు.

శ్రావణ నాగుల చవితి పండుగ శ్రావణ చతుర్థినాడు జరుపుకుంటారు. మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.

ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుబాము' అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే ' శ్రీమహావిష్ణువు"కు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ... ఈ నాగుపాము పుట్టలో పాలు పోయడంలో గల అంతర్యమని చెప్తారు. ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజచేసి చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు మున్నగునవి నివేదన చేస్తారు. ఇలా స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖసంతానము; అదే కన్నె పిల్లలు ఆరాధిస్తే! మంచి భర్త లభించునని పలువురి విశ్వాసము. ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిదికాదు. యుగాలనాటిది. సౌభాగ్యానికి, సంతానప్రాప్తికి సర్పపూజ చేయుట అనేది లక్షల శరత్తులనాడే ఉన్నట్లు మన పురాణాలలో ఎన్నో గాధలు కానవస్తున్నాయి.

పుట్టకు పాలు పోసి, పుట్టకు ప్రదక్షిణ, నమస్కారాలు చేస్తు ఏం కొరుకోవాలి ....???

నాగుల చవితి రోజున నాగదేవతలను పూజించేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. అందుచేత నాగుల చవితి రోజున "నాగేంద్రా! మేము మా వంశములో వారము నిన్ను ఆరాధిస్తున్నాము.

నీ పుట్టదరికి నాపాప లొచ్చేరు పాపపుణ్యమ్ముల వాసనే లేని బ్రహ్మస్వరూపులౌ పసికూనలోయి!
కోపించి బుస్సలు కొట్టబోకోయి! నాగులచవితికీ నాగేంద్ర! నీకు పొట్టనిండా పాలు పోసేము తండ్రి!

చీకటిలోన నీ శిరసు తొక్కేము కసితీర మమ్మల్ని కాటేయబోకు కోవపుట్టలోని కోడెనాగన్న
పగలు సాధించి మాప్రాణాలు దీకు నాగులచవితికీ నాగేంద్ర! నీకు పొట్టనిండా పాలు పోసేము తండ్రి!

అర్ధరాత్రీవేళ అపరాత్రీవేళ పాపమే యెఱగని పసులు తిరిగేని ధరణికి జీవనాధార మైనట్టి
వాటిని రోషాన కాటేయబోకు నాగులచవితికీ నాగేంద్ర! నీకు పొట్టనిండా పాలు పోసేము తండ్రి!

అటు కొండ యిటు కొండ ఆ రెంటినడుమ నాగులకొండలో నాట్యమాడేటి దివ్యసుందరనాగ! దేహియన్నాము
కనిపెట్టి మమ్మెపుడు కాపాడవోయి! నాగులచవితికీ నాగేంద్ర! నీకు పొట్టనిండా పాలు పోసేము తండ్రి!

పగలనక రేయనక పనిపాటలందు మునిగి తేలేటి నా మోహాలబరిణె కంచెలు కంపలూ గడచేటివేళ
కంపచాటున వుండి కొంప దీకోయి! నాగులచవితికీ నాగేంద్ర! నీకు పొట్టనిండా పాలు పోసేము తండ్రి!
అంటూ పుట్టకు ప్రదక్షిణ, నమస్కారాలు చేయాలని పురోహితులు అంటున్నారు.

నాగు పాముకాటు పొందిన నరుడు మరణించిన పిదప ఆత్మ ఏక్కడికి పోతుంది ....???

''నాగదష్టో సరో రాజన్‌ ప్రాప్యమృత్యుం ప్రజత్యథః అధోగత్వా భవేత్సర్పో నిర్తిషో నాత్ర సంశయః''-

''రాజా! పాముకాటు పొందిన నరుడు మరణించిన పిదప పాతాళ లోకానికి పోయి విషరహితుడై సర్పజన్మ పొందుతా''డని సుమంతుడు చెప్పగా శతానీకుడు పాముకరచినవాని కుటుంబీకులు అతని మోక్షప్రాప్తికి ఏమి చేయాలని ప్రశ్నిస్తే నాగపూజను వివరించినట్లు కథ. కొన్నిచోట్ల నాగపంచమి ప్రాచుర్యం పొందితే, కొన్ని ప్రాంతాల ప్రజలు కార్తీక చతుర్థినాడు నాగపూజ చేయడం పరిపాటి. స్కందపురాణంలో దీనిని 'శాంతి వ్రతం' అన్నారు.

హైందవ సంప్రదాయంలోనే గాక జైన బౌద్ధధర్మాల్లోను నాగారాధనకు ప్రాముఖ్యం ఉంది. అమరావతీ స్తూపంలో ఫణీంద్రుడు పడగవిప్పిన చిత్రాలు ఉన్నాయి. దుర్గాదేవి పరివారంలో ఒక సర్పం కూడా ఉంది. శివుడు నాగభూషణుడు, అతని వింటినారి వాసుకి. శ్రీమహావిష్

ణువు మేను వాల్చింది నాగతల్పం పైనే. వినాయకునికి సర్పం ఆభరణం, యజ్ఞోపవీతం కూడా. కుమారస్వామి వాహనమైన మయూరం కాళ్లకు సర్పాలు చుట్టుకొని ఉంటాయి.

తెలుగునాట పాలించిన నాగరాజుల వంశం ....

''నాగులచవితికి నాగన్న, స్నానం సంధ్యలు నాగన్న పువ్వులు పడగలు నాగన్న మడిబట్టలతో నాగన్న''

తెలుగునాట దాదాపు 2500 సంవత్సరాల క్రితం నాగరాజుల ఏలుబడిలో ఉన్నట్లు, వారివల్లనే ఈ దేశానికి నాగభూమి అని పేరు ఏర్పడిందని బౌద్ధగాథలు వెల్లడిస్తున్నాయి. సర్పం జాతీయచిహ్నంగా గల ప్రాచీన తెగ నాగులని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. ఆంధ్రదేశంలో నాగపూజ పరంపరాగతంగా వస్తోంది. శాతవాహనుల నాటి బౌద్ధాచార్యుడు నాగార్జునుని పేరులో నాగశబ్దం ఉంది. నాగవరం, నాగపట్నం, నాగులపాడు మొదలైన గ్రామనామాలు; నాగయ్య, నాగమ్మ వంటి వ్యక్తి నామాలు; నాగులేరు, నాగరం, నాగుల చీర మొదలైన విశేషనామాలు తెలుగునాట ప్రసిద్ధం. అమరావతి స్తూపంలో నాగబు శాసనస్థమైన తొలి తెలుగు మాటగా వేటూరి ప్రభాకరశాస్త్రి గుర్తించారు. మహావిష్ణువు చాతుర్మాస్యానంతరం నిద్రలేచే ఉత్థానేకాదశికి ఈ నాగులచవితి దగ్గరగా ఉన్నందున కార్తీక శుద్ధ చవితి నాడే నాగపూజ ఆంధ్రుల ఆచారం. ఆనాడు జ్యోతిర్మండలంలో అనంత శయనాకృతి కనిపిస్తుందని చెబుతారు.

🕉ధర్మ ప్రచారం🕉

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

 నాగులచవితి నాడు పుట్టలో పాలుపోసేప్పుడు ఇలా ప్రార్ధించాలి - 

నాగేంద్రా ! నువ్వు నరుల కంట పడకు, నరులు నీకంట పడరాదు.
పొరపాటున నీకంట పడితే, దయతో దీవించి, తప్పుకుపో !
పొరపాటున పడగ తొక్కితే పసివారనుకో, 
నడుమ తొక్కితే నావారనుకో,
తోక తొక్కితే తనవారనుకో,
ప్రతి ఏట నీ చవితి నాడు, చలిమిడితో, చిమ్మిరితో పాలు పోసి నిన్ను ఆరాధిస్తాము. మా పూజలు స్వీకరించి, మా వంశాన్ని వృధ్ధి చెయ్యి. మా వంశంలో ఎవరికి కళ్ళు, చెవులు, ముక్కు, గొంతులకు సంబంధించిన బాధలు కలగకుండా అనుగ్రహించు. 
మేమిచ్చే నూకలు తీసుకుని, రూకలిచ్చి, మూకలిచ్చి ఆశీర్వదించు. మమ్మల్ని ఆశీర్వదించు, నీ అనుగ్రహాన్నే మాతో పంపు కానీ మా ఇంటికి రాబోక !! నీకు వందనములు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

నాగులచవితికి రోజంతా ఉపవాసం ఉండటం నియమం. కానీ పెద్దవారు, ఆరోగ్యం బాగాలేనివారు భోజనం చెయ్యచ్చు.
తలస్నానంచేసి, తయారయ్యాక కాళ్ళకు పసుపు రాసుకుని, ముందు ఇంట్లో పూజచేసి, నాగేంద్రుడిని పాలతో అభిషేకించి ( పాలల్లో నాగేంద్రుడి ప్రతిమ మునిగేలా ), దేవసేనా వల్లీ సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అష్టోత్తర శత నామాలతో కానీ, సహస్ర నామాలతో కానీ ఆరాధించి, చిమ్మిరి, చలిమిడి, అరటిపళ్ళు నైవేద్యం పెట్టి, హారతిచ్చి, పునఃపూజ చేసి, ఉద్వాసన చేసి, అప్పుడు పుట్టలో పాలు పొయ్యటానికి వెళ్ళాలి. కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా పుట్టకు వెళ్ళి పాలుపోసి రావాలి. ఇంటికి వచ్చాక, ఇంటి బయట మూడు రాళ్ళు ట్రయాంగిల్ షేప్ లో పెట్టి, ఆ రాళ్ళను నాగేంద్రునిగా భావించి, వాటిమీద కొద్దిగా చిమ్మిరితో చలిమిడితో కొద్దిగా పాలుపోసి, అగరువత్తి వెలిగించి, నాగేంద్రా ! నా కోసం ఇక్కడిదాకా వచ్చావు చాలు, నా పూజ స్వీకరించి, ఆనందించి, నన్ను ఆశీర్వదించి వెనక్కి వెళ్ళిపో ! ఇంక మా ఇంటికి రాబోక ! అని ప్రార్ధించి ఇంటిలోపలికి వెళ్ళేదాకా వెనక్కి చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోవాలి.

 *ॐ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః:

🕉. వెదమయీ   🕉

🕉.వెదమయీ 🕉

 *ॐ వెదమయీ **

ఓం నమో భగవతే వాసుదేవాయ నమః:#karthika_puranam కార్తీక స్నాన మంత్రము :-కార్తీకేహం కరిష్యామి ప్రాతః స్నానం జనార్దన!ప్రీత్యర్ధం తన దేవేశ దామోదర మయా సహ!!#karthika_puranam *కార్తీకపురాణం 3 వ అధ్యాయము*🌺🌺🌺🌺🌺🌺🌺🌺

ఓం నమో భగవతే వాసుదేవాయ నమః:
#karthika_puranam 

కార్తీక స్నాన మంత్రము :-

కార్తీకేహం కరిష్యామి ప్రాతః స్నానం జనార్దన!
ప్రీత్యర్ధం తన దేవేశ దామోదర మయా సహ!!

#karthika_puranam 

*కార్తీకపురాణం 3 వ అధ్యాయము*
🌺🌺🌺🌺🌺🌺🌺🌺

*కార్తీక మాస  స్నాన మహిమ*

జన క మహరాజా ! కార్తి క మాసమున యే ఒక్క చిన్న దానము చేసిన నూ, అది గొప్ప ప్రభావము గలదై వారికి సక లైశ్వర్యములు కలుగుట యే గాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ, కొంత మంది ఆస్థిరములైన భోగ భాగ్య ములు విడువలేక, కార్తిక స్నానములు చేయక , అవినీతి పరులై, భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి , కుక్క, పిల్లి గ జన్మింతురు..
అధమము కార్తీక మాస శుక్ల పార్ణమి రోజు న యిన నూ స్నాన దాన జపత పాదులు చేయక పోవుట వలన న నేక చండాలాది జన్మ లెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టిదురు. దీనిని గురుంచి నాకు తెలిసిన యితిహాసమొకటి  వినిపించెదను. సపరి వారముగా శ్రద్దగా ఆలకి౦పుము.

*బ్రహ్మ రాక్ష సులకు ముక్తి కలుగుట*

ఈ భారత ఖండ మదలి దక్షిణ ప్రా౦తమున ఒకానొక గ్రామములో మహా విద్వాంసుడు, తపశాలి, జ్ఞాన శాలి, సత్య వ్యాక్య పరిపాలకుడు అగు ' తత్వనిష్టుడు' అను బ్రాహ్మణుడొక  డుండెను. ఒక నాడా  బ్రాహ్మణుడు తీర్ధ యాత్ర సక్తుడై  అఖండగోదావరికి బయలుదేరును. ఆ తీర్ధ సమీపమున ఒక మహా వట వృక్ష౦బు  పై భయంకర ముఖములతోను, దీర్ఘ  కేశములతోను, బలిష్ట౦బులైన కోరలతోను, నల్లని బాన పొట్టలతోను, చూచువారుకి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసి౦చుచూ , ఆ దారిన బ్రోవు బాట సారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంత మంతయు భయక౦పితము చెయుచు౦డిరి. తీర్ధ యాత్రకై  బయలుదేరి అఖండ గోదావరి పుణ్య క్షేత్రమున  పితృ దేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు అ వృక్షము చెంతకు చేరుసరికి  యథా ప్రకారము బ్రహ్మ రాక్షసులు క్రిందకు దిగి అతనిని చ౦పబోవు 
సమయమున, బ్రాహ్మణుడు ఆ భయ౦కర రూపములను చూచి గజ గజ వణుకుచూ యేమియు తోచక నారాయణ స్తోత్రం భిగ్గరగా పటి౦చుచు ' ప్రభో ! ఆర్త త్రాణ పరాయణ! ఆ నాధ రక్షక ! ఆపధలోనున్న గజేంద్రుని, ని౦డు సభలో అవమానాలు పలగుచున్న మహాసాద్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే - యి పిశాచములు  బారినుండి నన్ను రక్షించు తండ్రీ!  యని వేడుకొనగా, ఆ ప్రార్ధనలు విన్న బ్రహ్మ రాక్షసులుకు జ్ఞానో దయ౦ కలిగి ' మహానుభావా! మీ నోటినుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు  జ్ఞానో దయ౦ అయినది మమ్ము రక్షింపుడు' యని ప్రాదేయపడిరి. వారి మాటలకూ విప్రుడు ధైర్యం తెచ్చుకొని' ఓయీ! మీరెవరు ? ఎందులకు మికి రాక్షస రూప౦బులు కలిగెను? మీ వృత్తా౦తము తెలుపుడు' యని పలుకగా వారు' విప్ర పుంగవా! మీరు పూజ్యులు, ధర్మాత్ములు , వ్రతనిష్టాపరులు, మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వ జన్మ మందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మా వలన యే ఆపద కలగదు' అని అభయమిచ్చి, అందొక  బ్రహ్మ రాక్షసుడు తన వృ త్తాంతము యీవిదముగా చెప్పసాగెను. నాది ద్రావిడ దేశం . బ్రహ్మనుడను. నేను మహా పండితుడనని గర్వము గలవాడై నై యుంటిని. న్యాయాన్యాయ విచాక్షణలు మని పసువునై ప్రవర్తి౦చితిని, బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యం గా దానం లాగుకోనుచు, దు ర్వ్యనాలతో  భార్య పుత్రా దులను సుఖపెట్టాక, పండితుల నవమాన పరచుచు, లుబ్దు డనై లోక కంట కుడిగ నుంటిని.
ఎట్లుండగా ఒకానొక పండితుడు కార్తిక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమర్ధన చేయు తల౦పుతొ పదార్ధ సంపాదన నిమి త్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచెను. వచ్చిన పండితుని నేను దూషించి, కొట్టి అతనికి వద్ద నున్న ధనము, వస్తువులు తీసుకోని ఇంటినుండి గెంతి వైచితిని. అందులకా విప్రునకు కోపము వచ్చి ' ఓరి ని చూడ ! అన్యక్రా౦తముగ డబ్బుకూడా బెట్టినది చాలక, మంచి చెడ్డలు తెలియక, తోటి బ్రాహ్మణుడని గూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకొంటివి గాక, నివు రాక్షసుడవై నార భక్ష కు డువుగా నిర్మానుష్య ప్రేదేశాములలో నుందువు'గాక! యని శపించు టచే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మస్త్రమునైన తపెంచుకొవచును కానీ బ్రాహ్మణ శాపమును తపెంచాలేము గదా! కాన నయాప రాదము క్ష మి౦ పుమని వానిని ప్రా ర్ధి౦ చితిని. అందులకాతాడు దయదలచి' ఒయీ! గోదావరి క్షే త్రమ౦దొక వట వృక్షము గలదు. నివండు నివసించుచు యే బ్రాహ్మణువలన పునర్జన్మ నొ౦దు దు వు గాక' యని వేదలిపోయాను. ఆనతి నుండి నేని రాక్షస స్వరుపమున నభాక్ష ణము చేయుచున్దిని. కాన, ఓ విప్రోతమ! నన్ను న కుటుంబము వారిని రక్షిమ్పుదని మొదటి రాక్షసుడు తన వ్రుతంతమును జెప్పెను.

ఇక రెండవ రాక్షసుడు- ' ఓ ద్విజోత్త మా ! నేను కూడా పూర్వ జన్మలో బ్రహ్మనుడునే. నేను నీచుల సహవాసముచేసి తల్లితండ్రులను భాదించి వారికీ తిండి పెట్టక మాడ్చి  అన్నమో రామచంద్రాయను నటులచేసి, వారి యెదుటనే ణ బార్య బిడ్డలతో పంచభక్ష్య పరమన్నములతో భుజించుచు౦డేడివాడను.  నేను యెట్టి దానధర్మములు చేసి మెరుగును, నా బ౦ధువులను కూడా హింసించి వారి ధనమపహరి౦చి రాక్షసుని వలె ప్రవ ర్తి౦చితిని. కాన, నాకీ రాక్షస  సత్వము కలిగెను. నన్ని పాపప౦కిలము నుండి ఉద్దరి౦పుము' అని బ్రాహ్మణుని పాదములపై  బడి పరి పరి విధముల వేడు

కొనెను.
మూడవ రాక్షసుడు కూడా తన వృ త్త౦తమును యిటుల తెలియ జేసెను. ' మహాశయా! నేనొక సంపన్న కుటుంబములో పుట్టిన బ్రహ్మణుడను. నేను విష్ణు  ఆలయములో అర్చకునిగా నుంటిని. స్నాన మైనను చేయక, కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచు౦డేడి వాడను భగవంతునికి ధూప దీప నైవేద్యము  లైనాను నర్పించక, భక్తులు గొనితేచ్చిన సంభారములను  నా వుంపుడు గత్తెకు అందజేయుచు మధ్య మాంసము సేవించుచు పాపకార్యములు  చేసినందున నా మరణన౦ తరము యి రూపము ధరించితిని, కావున నన్ను కూడా పాప విముక్తి ని కావి౦పు' మని ప్రార్ధించెను.ఓ జనక మహారాజ! తపోనిష్టుడగు ఆ విప్రుడు పిశాచములు దినలపము లాలకించి 'ఓ బ్రహ్మ రాక్షసులరా! భయపడకుడు. మీరు పూర్వ జన్మలో చేసిన ఘోర క్రుథ్య౦బులవల్ల మీకీ రూపములు కలిగెను. నా వెంట రండు మీకు విముక్తిని కలిగింతును' యని, వారి నోదార్చి తనతో గొనిపోయి ఆ మువ్వురి చేతనవిముక్తి సంకల్పము చెప్పుకొని తనే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్య ఫలమున ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంటమున కేగిరి. కార్తిక మాసములో గోదావరి స్నానమాచరించినాచో హరిహరాదులు సంతృప్తి నొంది, వారికీ సకలైశ్వర్యములు ప్రసాది౦చుతురు. అందువలన, ఎంత ప్రయత్నించిన సరే కార్తిక స్నానాలనా చరించాలి.

*ఇట్లు స్కాంద పురాణా౦ తర్గత, వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య* *ముందలి*
*మూడవ రోజు* *అధ్యాయము -* *మూడవ రోజు పారాయణము సమాప్తము.*

#karthika_puranam

#karthika_puranam 🌋🌋🌋🌋.త్రిలోచన గౌరీ వ్రతం 🌋🌋3వ రోజు 

       కార్తీకమాసంలో తదియ తిథి రోజున త్రిలోచనగౌరి వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతం చేయటం వెనకున్న తత్వాన్ని చాగంటి కోటేశ్వరరావు శర్మ వివరిస్తారు.
సంస్కృత భాష నేర్చుకునే వాళ్ళందరూ
వాగర్థా వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
       జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ॥ అనే శ్లోకాన్ని తప్పనిసరిగా నేర్చుకుంటారు. వాక్కు, అర్థము- ఈ రెండింటినీ విడదీయలేరు. వీటికున్న సంబంధం అవినాభావమైనది. శివపార్వతులు కూడా ఈ వాక్కు, అర్థములాంటివారేనని ఈ శ్లోక అర్ధం. అందుకే వీరిద్దరినీ ప్రకృతి పురుషులుగా వర్ణిస్తూ ఉంటారు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా అది అయోమయానికి, అవ్యవస్థకు, అనాచారానికి దారి తీస్తుంది. ప్రకృతినుంచి పురుషుడు విడిపోయాడనుకోండి శివం కాస్తా – శవమవుతుంది. ఈ విధంగా ప్రకృతిపురుషుల కేళి జరిగే ప్రదేశమే కైలాసం. ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు మూర్తీభవించినట్టుగా వుంటుంది. శివుడు చిన్మయ రూపంలో ఉంటాడు. అంతే కాదు శివలింగం ఎంత తడిస్తే ఎంత చల్లబడితే ఎంత ఆరాధన చేస్తే లోకాలు అంత చల్లబడుతాయి. కార్తిక మాసం ఉపాసనా కాలం కాబట్టి శివలింగానికి అభిషేకం చేస్తే పాపాలు తీరుతూ ఉంటాయి. ఈ పాపాలు ఎందుకు తీరాలనే ప్రశ్న చాలా మందికి ఉదయిస్తుంది. దీనికి సమాధానమే
– శంకరాచార్య విరిచిత
       పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం
       ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే॥ స్తోత్రం. ఈ సంసార భ్రమణ పరితాపం వదిలిపోవటానికి, రెండు జన్మాల మధ్య పరితాపాన్ని త్యజించటానికి తోడ్పడేవాడు ఈశ్వరుడు. అంతే కాదు మానవ జననానికి కారణం కోరిక. ఈ కోరికకు ఒక రూపం మన్మథుడు. అలాంటి మన్మ«థుడిని తన మూడో కంటి మంట చేత దహనం చేసిన వాడు ఈశ్వరుడు. అయితే ఈ చర్యలన్నింటిలోను అమ్మవారి ప్రమేయం కూడా ఉంటుంది. అందుకే పరమేశ్వరుడి కన్ను శివుడిది మాత్రమే కాదు, పార్వతీ దేవిది కూడా. అందుకే ఆమెను త్రిలోచన అని కూడా పిలుస్తారు. తన భక్తులకు శివుడు ఎలాంటి వరాలిస్తాడో.. అమ్మవారు కూడా అంతే దయతో భక్తులను కనికరిస్తుంది. ఆమెను ప్రసన్నం చేసుకుంటే భక్తుల కోరికలన్నీ తీరినట్లే. అందుకోసమే కార్తిసమాసంలో తిదియనాడు త్రిలోచనగౌరి వ్రతం చేస్తారు. ఆ రోజు కొన్ని ప్రత్యేకమైన పూలతో పూజ చేస్తారు.
#karthika_puranam

Sudhakar P:
*ఉర్వారుక మివ బంధనం అంటే.....*

ఇసుకలో ఆడుకొంటున్న పిల్లల్ని చూస్తుంటాం. అద్భుతంగా గుడి కడతారు. తీరికగా అలంకారాలు అద్దుతారు. తోచినంతసేపు హాయిగా ఆడుకుంటారు. 

పొద్దు వాలేటప్పటికి, ఆ కట్టడాలన్నింటినీ చటుక్కున కూలదోస్తారు. కిలకిల నవ్వులతో నిశ్చింతగా ఇంటిదారి పడతారు. అక్కడి ఆ నిర్మాణాలకు సంబంధించిన మమకారాలు, వియోగ దుఃఖాలు ఏవీ వారికి ఉండవు. ‘అంతగా అయితే, మరునాడు వచ్చి మళ్ళీ కడతాం. పోయేదేముందీ’ అనే ధీమాతో పిల్లలందరూ ‘సొంతిళ్ల’కు వెళ్లి పోతారు. 

‘త్య్రంబకం యజామహే...’ అనే మృత్యుంజయ మహామంత్ర సారాంశమూ అదే.

 *‘జీవితాన్ని ఎంతైనా నిర్మించుకో... ఆత్మీయ బంధాలెన్నింటినో పెంచుకో. ప్రేమానురాగాల్ని గాఢంగా పంచుకో. ఆట ముగిసే సమయానికి, వాటిని అదేవిధంగా సునాయాసంగా తెంచుకో’* అని ఆ మంత్రం బోధిస్తుంది. 

వాటికి, మనిషికి మధ్య ముడి *‘ఉర్వారుక మివ బంధనం’* లా ఉండాలంటుంది. పచ్చి దోసకాయ ముచికకు, దోస తీగకు మధ్య బంధం ఎంత గట్టిగా ఉంటుందంటే- ఆ కాయను పట్టుకు లాగితే ఆ తీగ మొత్తం వచ్చేస్తుంటుంది. అవి ఒకదాన్ని మరొకటి అంత గట్టిగా పట్టుకొని ఉంటాయి.

అదే రీతిలో మనిషి తన చుట్టూ ఉన్న పరివారంతో, ప్రపంచంతో బంధాన్ని అంత గట్టిగానూ పెనవేసుకొని ఉంటాడు. పిల్లలు ఇసుక గూళ్ళు కట్టినంత ప్రీతిగా తన, తనవారి జీవితాల్ని తీర్చిదిద్దుకుంటాడు.

దోసపండు మిగలముగ్గేనాటికి పరిస్థితి మారుతుంది. ఉన్నట్లుండి ఆ తీగ నుంచి అది చటుక్కున విడిపోతుంది. అప్పడు చూస్తే ముచిక గాని, తీగ గాని ఎండి ముదిరిపోయినట్లు ఉంటాయి. అంతవరకు ఆ రెండూ ఒకదానితో మరొకటి గాఢంగా, బలంగా అతుక్కునే ఉన్నాయా అనే అనుమానం వస్తుంది. 

ప్రపంచంతో అన్నింటినీ చివరన తెంచుకోగలిగితే, *‘ఈ ఆత్మ నిత్యం’* అని నమ్మగలిగితే మృత్యుభయాన్ని అధిగమించడం సాధ్యమవుతుంది.

సాయంత్రం అయ్యేసరికి పిల్లలు నిశ్చింతగా సొంతింటికి తిరిగి వెళ్లిపోయినట్లు, ఈ అద్దె ఇంటితో అనుబంధాన్ని వీడాలన్నదే ఆ మంత్ర మహోపదేశం! *‘దేహం వీడి వెళుతున్నాను’* అనేది అసురీ భావం. *‘అద్దె గృహాన్ని వీడుతున్నాను’* అనేది అమృత భావన! అలా అమృతత్వ స్థితిలోకి చేరుకోవడమే ముక్తి అనిపించుకుంటుంది. 

మనిషి జీవించి ఉండగానే సాధించాల్సిన స్థితి అది. అందుకే దాన్ని *‘జీవన్ముక్తి’* అంటారు...

🙏🙏🙏🙏🙏