తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనావేసేందుకు రాశి ఫలాలు, వారఫలాలు ఎంతో ఉపయోగపడుతాయి. ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదు:ఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు వార ఫలాలు దోహదపడుతాయి. 12 రాశుల వారికి ఈ వారం (నవంబర్ 15, 2020 నుంచి నవంబర్ 21, 2020) వార ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ... ముందుకు సాగవచ్చు.
మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1) మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. స్థానచలనం ఉంది. స్థలంగానీ, ఇల్లు గానీ కొనే అవకాశం ఉంది. రుణ బాధ తొలగుతుం. ఆదాయం పెరుగుతుంది. స్త్రీలతో అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలు ఉన్నాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి.
వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఈ వారం మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఇల్లు మారతారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. తలచిన పనులు పూర్తవుతాయి. అందరినీ పూర్తిగా నమ్మేయకండి. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పు తీరుస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడ్సాల్సి ఉంటుంది. ఐ.టి, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఇరుగు పొరుగు నుంచి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
మిధునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) కష్టాల్లో ఉన్న బంధువులకు ఆర్థిక సాయం అందిస్తారు. ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అష్టమ శని కారణంగా మధ్య మధ్య చికాకులు తప్పకపోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయించండి. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు... ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయతనాలు ఫలిస్తాయి. బంధువుతో విభేదాలు తలెత్తవచ్చు. కోర్టు కేసుల్లో చిక్కులు ఎదురవుతాయి. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగవు.
కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) సామాజిక కార్యకలాపాల్లో విరివిగా పాల్గొంటారు. పలుకుబడి పెరుగుతుంది. సంపాదన పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సప్తమ శని ప్రభావం కారణంగా మధ్య మధ్య పని ఒత్తిడి, శ్రమ, తిప్పుట తప్పవు. సంతానం నుంచి శుభవార్త వింటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో పై అధికారుల ప్రశంసలు పొందుతారు. సహోద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.
సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1) ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. సంపాదనకు అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఇల్లు సందడిగా ఉంటుంది. త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. గణితం, కంప్యూటర్ విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది.
కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. వృథా వ్యయం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీల్లో మోసపోయే ప్రమాదం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. విద్యార్థులకు పరవాలేదు. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారం ఫలించి విహార యాత్రలు చేస్తారు.
తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. స్త్రీతో పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూంగా ఉంది. ప్రేమ వ్యవహారంలో నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది. కళా సాహిత్య రంగాలకు చెందినవారు, సంగీత విద్వాంసులకు సమయం అనుకూంగా ఉంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు
వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. మీ కుమార్తెకు పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉంటుంది. భార్యాపిల్లలు సహాయ సహకారాలు అందిస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. ప్రేమ వ్యవహారంలో ముందడుగు వేస్తారు. డబ్బు జాగ్రత్త
ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) స్నేహితులతో కలిసి వ్యాపారం చేయాలనే ఆలోచన కలుగుతుంది. సొంత ఇల్లు కొనేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక చింతనతో ఆలయాలు సందర్శిస్తారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూల సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసులో శుభవార్త వింటారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి
మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) పిల్లలు చదువుల్లోనూ, ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. అనుకోని ఖర్చులు మీద పడతాయి. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. స్నేహితులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి. కోర్టు కేసు పరిష్కారమవుతుంది కానీ, మీరు ఆశించినంత ఆశాజనకంగా ఉండదు. విద్యార్థులు చదువు విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు జాగ్రత్త.
కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది కానీ, అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఈ వారం ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. విహార యాత్రకు వెళ్తారు. వ్యాపారం ప్రారంభించగానే ఆటంకం పెరుగుతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. అప్పు నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా ఎదురు చూపులు తప్పవు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవుతుంది.
మీనం (Pices) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4) వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా గడుస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి, చిన్న వ్యాపారులకు లాభాల పంట పండుతుంది. విదేశీ సంస్థలో ఉద్యోగం భించే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉన్న సంతానం విజయాలు సాధిస్తారు. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు సంభవం. సంతాన యోగానికి అవకాశం ఉంది. రెండో ఆదాయ మార్గం ఏర్పడుతుంది. ఆరోగ్యానికి ఢోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. మేథ్స్, ఆర్కియాలజీ, పరిశోధక విద్యార్థులకు బాగుంది.
No comments:
Post a Comment