భాగవత పద్యాలు
🍁🍁🍁🍁
పైలుండు ఋగ్వేద పఠనంబు దొరఁకొనె;
సామంబు జైమిని సదువుచుండె
యజువు వైశంపాయనాఖ్యుండు గైకొనెఁ;
దుది నధర్వము సుమంతుఁడు పఠించె
నఖిల పురాణేతిహాసముల్ మా తండ్రి;
రోమహర్షణుఁడు నిరూఢిఁ దాల్చెఁ
దమతమ వేద మా తపసులు భాగించి;
శిష్యసంఘములకుఁ జెప్పి రంత
శిష్యు లెల్లను నాత్మీయశిష్యజనుల
కంత బహుమార్గములు సెప్పి యనుమతింపఁ
బెక్కుశాఖలు గలిగి యీ పృథివిలోన
నిగమ మొప్పారె భూసుర నివహమందు.
పైలుడు ఋగ్వేదాన్ని చదవటం మొదలు పెట్టాడు.
జైమిని సామవేదం చదువసాగాడు.
వైశంపాయనుడు యజుర్వేదాన్ని అధ్యయనం చేయటం మొదలు పెట్టాడు.
సుమంతుడు అథర్వ వేదాన్ని ఆరంభించాడు.
మా తండ్రిగారైన రోమహర్షణుడు పట్టుదలతో సమస్త పురాణాలూ, ఇతిహాసాలూ పఠించటం ప్రారంభించాడు.
ఇలా తాము నేర్చుకొన్న వేదాలూ, పురాణాలూ, ఇతిహాసాలూ ఆ తపోధనులు తమ శిష్యులకు వేరువేరుగా విభజించి చెప్పారు
. ఆ శిష్యు లందయా తమ తమ శిష్యులకు అనేక విధాలూగా ఉపదేశించారు.
అలా వేదం భూమి మీద అనేక శాఖలతో బ్రాహ్మణ సమాజంలో ప్రకాశించింది.
🌸జై శ్రీమన్నారాయణ🌸
🍁🍁🍁🍁
సేకరణ
No comments:
Post a Comment