Thursday, November 12, 2020

ప్రాణాఘాతాన్నివృత్తిః పరధనహరణే సంయమః సత్యవాక్యం

🍁. నేటి సుభాషితం 🍁



ప్రాణాఘాతాన్నివృత్తిః పరధనహరణే సంయమః సత్యవాక్యం
కాలే శక్య్తా ప్రదానం యువతిజనకథా మూకభావః పరేషామ్‌ ।
తృష్ణా స్రోతో విభంగో గురుషు చ వినయః సర్వ భూతానుకంపా
సామాన్యః సర్వ శాస్త్రేష్వనుపహత విధిః శ్రేయసామేష పంథాః ॥ 


జీవహింసను వదులుట,

 పరద్రవ్యముపై మనసును బోనీయక నిగ్రహించుట,

 సత్యము పలుకుట,

 సందర్భానుసారం శక్తి కొలది దానము చేయుట, 

పరస్త్రీ ప్రసంగము చేయక మౌనము వహించుట,

 అత్యాశను వదులుట,

 గురువుల యెడల అణకువ,

 సర్వ ప్రాణుల యందు దయ, సమస్త శాస్త్రములందు సమభావము కలిగియుండుట

 యనునవియే సమస్త శ్రేయస్సులను పొందుటకు అనుసరించదగిన మార్గములు. 

అనగా అహింస, మనోనిగ్రహం, సత్యవాక్కు, దానము, పరదారాగమనము నందు విముఖత, తృప్తి, అణుకువ, దయ, శాస్త్ర సమత్వములు మహాత్ముల లక్షణములని భావము.


🌺జై శ్రీమన్నారాయణ🌺

No comments:

Post a Comment