ఫ్రెండ్స్
కావలనుకొనేదీ, వద్దనుకొనేదీ మనసే
సుఖమైనా - దుఃఖమైనా ఆ అనుభవం కూడా మనస్సుకే. కనుక ఈ రాగ ద్వేషాలు, సుఖ దుఃఖాలు ఇవి అంతఃకరణంలోని వికారాలు.
అంటే మనస్సులోని వికారాలే.
ఈ మనస్సు క్షేత్రానికి సంబంధించినదే గనుక
ఇవి క్షేత్ర వికారాలే.
ఆత్మ కన్న వేరైనదంతా విషయప్రపంచమే - క్షేత్రమే.
ఈ శరీరం, ఇంద్రియాలు, అంతఃకరణాలు, ప్రాణాలు, ఇంద్రియాలు గ్రహించే శబ్ద స్పర్శ రూప రస గంధాలు, మనస్సులోని భావాలైన సుఖదుఃఖాలు, రాగద్వేషాలు, బుద్ధిలోని కోరికలు, అభిప్రాయాలు -
ఈ అన్నీ క్షేత్రానికి సంబంధించినవే.
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ క్షేత్రం
ఒక పెద్ద సామ్రాజ్యం.
అందులో స్వేచ్ఛగా సంచరించే మహారాజే క్షేత్రజ్ఞుడు.
ఒక్కసారి నీటిని చూడండి.
మన దప్పిక తీర్చేది నీరు.
ఏదన్నా తినేటప్పుడు గొంతు పట్టుకుంటే నీరు కావాలి. లేకపోతే ప్రాణానికే ప్రమాదం.
కాలకృత్యాలు తీర్చుకొనుటకు నీరు కావాలి.
అన్నం వండాలంటే నీరు కావాలి.
బురద కడుక్కోవాలంటే నీరు కావాలి.
అయినప్పటికీ ఆ నీటికి ఏమైనా అభిమానం అహంకారం ఉన్నాయా ?
ఎంత మెత్తగా, అణుకువగా ఉంటుందో చూడండి.
నీటికి ఏ రంగూ, రుచీ ఉండవు.
కాని ఏ రంగు కలిపితే ఆ రంగులో కనిపిస్తుంది.
దానిలో ఉప్పు వేస్తే నీరు ఉప్పగా మారిపోతుంది. పంచదార వేస్తే తియ్యగా మారిపోతుంది.
ఆ! నేనింత గొప్పదాన్ని గదా!
వాళ్ళు ఏది వేస్తే దానికి అనుగుణంగా నేనెందుకు మారాలి ? అని అనుకుంటుందా ?
తన గొప్ప తనాన్ని ప్రదర్శించాలనుకుంటుందా ? లేదు. ఎంతటి అభిమానరాహిత్యం ?
కాని మన వ్యవహారం ఎలా ఉంటుంది అంటే
ఎదుటి వాళ్ళకు అనుకూలంగా మనం మారలా
వాళ్ళే మనకు అనుకూలంగా మారాలి.
మనం తగ్గకూడదు.
వారే తగ్గాలి అనుకుంటాం
అలా అనుకుంటూ పోతే
భగవంతుడు ఇచ్చిన ఈ చిన్న జీవితం
ఎప్పటితో ముగుస్తుందో ఎవరికి తెలుసు
ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఉందాం
అందరూ మనవాళ్ళే
అందరూ ఆ పరమాత్మ బిడ్డలమే🙏
No comments:
Post a Comment