Monday, November 30, 2020

సాలగ్రామము విష్ణుప్రతీకమైన, విశిష్ట ప్రాముఖ్యం కలిగిన ఒక శిలా విశేషము. కలికాలంలో భక్తుల అర్చనాదుల సౌలభ్యం కోసం నారాయణుడు సాలగ్రామ రూపం ధరించాడని దేవీ భాగవతం చెబుతుంది. అందుచేతే గృహదేవతార్చనలలోగానీ, దేవాలయాలలోగానీ సాలగ్రామము (మూర్తి) లేకుండా పూజలు కొనసాగవు. ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు తమతమ దేవతార్చనలలో సాలగ్రామములను పూజకు ఉపయోగిస్తారు.

సాలగ్రామము విష్ణుప్రతీకమైన, విశిష్ట ప్రాముఖ్యం కలిగిన ఒక శిలా విశేషము. కలికాలంలో భక్తుల అర్చనాదుల సౌలభ్యం కోసం నారాయణుడు సాలగ్రామ రూపం ధరించాడని దేవీ భాగవతం చెబుతుంది. అందుచేతే గృహదేవతార్చనలలోగానీ, దేవాలయాలలోగానీ సాలగ్రామము (మూర్తి) లేకుండా పూజలు కొనసాగవు. ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు తమతమ దేవతార్చనలలో సాలగ్రామములను పూజకు ఉపయోగిస్తారు. భారతదేశంలో సాలగ్రామ పూజ బహు పురాతనమైనది. క్రీస్తు కంటే ప్రాచీనుడైన అపస్తంబుడు సాలగ్రామ పూజను పేర్కొన్నాడు. త్రిమతాచార్యులు తమతమ భాష్యాలలో సాలగ్రామాలు విష్ణురూపాలని వివరించారు. దేవాలయాలలో పంచాయతన మూర్తులకు శిలా ప్రతిమలు ఉంటే గృహస్థులకు మణి, స్వర్ణ నిర్మితమైన మూర్తులు, సాలగ్రామములు ఉంటాయి. సాధారణంగా ప్రతిమలకు నిత్య పూజా సమయంలో ఆవాహనాది షోడశోపచారాలు చేయాలి. సాలగ్రామాలలో దేవత నిత్యం సన్నిహితమై ఉండడం వల్ల వాటికి పూజా సమయంలో అవాహనాది ఉపచారాలు అవసరం లేదు.

శిలాజనిర్మిత సాలగ్రామ శిలలు
సాలిగ్రామాలు అన్నవి నునుపుగా, గుండ్రముగా గానీ కోడిగుడ్డు ఆకారములో కాల్వల్లో, నదీ తీరాల్లో దొరికే రాళ్ళు. వాటి ఆకారం, నునుపుదనం చూసి వాటికి అతి త్వరగా ఆకర్షితులం అవటం చాలా సులభం. వీటిని దైవ స్వరూపాలుగా భావించడం జరుగుతుంది. హిందూ దైవిక పూజల్లో వీటికి ప్రత్యేక స్థానం ఉంది కూడా.. చాలా పురాతన కాలాల నుండి వీటి ఉనికి ఉంది. సాలగ్రామాలు గండకీ నదిలో లభిస్తాయి  ఇవి సాధారణముగా నదీ తీరాల వెంట దొరుకుతూ ఉంటాయి. పుణ్యతీర్థాలకు వెళ్ళినప్పుడు - నదుల్లో స్నానాలకి వెళ్ళినపుడు చాలామంది వీటిని ఇంటికి తెచ్చుకొని, పూజామందిరాల్లో పెట్టుకుంటారు. ప్రవహించే నదుల ప్రవాహ ఒరవడికి నదీ జలాలతోటే కొట్టుకవచ్చే చిన్న చిన్న రాళ్ళు ఒకదానితో మరొకటి తగిలి, కాలక్రమాన ఇలా నునుపుగా మారి, ఆకర్షణీయముగా అగుపిస్తాయి. వీటినే సాలిగ్రామాలుగా పరిగణలోకి తీసుకోవడం కద్దు.

వీటిని పూజల్లో పెట్టుకొని వీటికి పూజలు చెయ్యడం మొదలెట్టాక - ఇక వాటికి ఎల్లప్పుడూ పూజలు చెయ్యడం చాలా మంచిది. అలాగే కొనసాగాలి కూడా. ఆ పూజల ధనాత్మక శక్తి వీటికి బాగా అంటుకొని, అవి ఉన్న చోట అంతా శుభమే కలుగుతుంది. ఏదైనా కారణాల వల్ల వీటికి ఆ పూజలను కొనసాగించలేమో - అప్పుడు ఆ ధనాత్మక శక్తి హరించుకపోయి, ఋణాత్మక శక్తిని వెదజల్లుతుంది. అప్పుడు ఆ రాళ్ళు ఉన్న చోట అంతా చెడు జరుగుతుందని చెబుతుంటారు. వీటికి మొదట ఏదైతే నైవేద్యముగా సమర్పిస్తామో, వాటినే ఎప్పుడూ సమర్పిస్తూనే ఉండాలి. అంటే పాయసం పెట్టడం మొదలెడితే అదే ఎల్లప్పుడూ పెడుతూనే ఉండాలి. అందుకే చాలామంది నీటినే - నైవేద్యముగా పెడుతూ ఉంటారు. వీటిని గురించి నేను ఒకరి వద్ద తెలుసుకున్నప్పుడు వారి కొన్ని వివరాలతో బాటు ఒక కథ కూడా చెప్పారు. అది ఎంతవరకు నిజమో తెలీదు కానీ వాటి శక్తి గురించి తెలిసినవారికి ఈ కథని తేలికగా నమ్ముతారు. ఆ కథని మీకోసం అందిస్తున్నాను.

కథ

లక్ష్మీనరసింహ సాలగ్రామ శిల

శంఖు రూప సాలగ్రామం
దస్త్రం:
సాలగ్రామ శిలలు

సాలగ్రామ శిలలు

సాలగ్రామ శిలలను ఇళ్ళలో ఇలా పూజిస్తుంటారు

సాలగ్రామ రూప మీరాభాయి
పూర్వం ఒక ఊరిలో మాంసం అమ్మే విక్రయదారుడు ఉండేవాడు. ( ఈ చండాలుడి ప్రస్తావన నిజమే - నేను మార్చినది కాదు. సాంప్రదాయ వాళ్ళు మన్నించాలి. ) అతనికి సరియైన బేరాలు లేక ఎప్పుడూ అంతంత మాత్రం ఉండే ఆదాయముతో జీవనాన్ని కొనసాగించేవాడు. ఒకరోజు అతను నదీస్నానాలకు వెళ్ళినప్పుడు స్నానం చేసిన చోట కొన్ని రాళ్ళు అగుపిస్తాయి. అందులో ఒక రాయి నల్లగా, చాలా నునుపుగా ఉండి, చాలా ఆకర్షించింది. వద్దని అక్కడే వదిలేసి, ఒడ్డుకి వచ్చినా ఆ రాయి అతని మది నుండి దూరం కాలేదు. ఎందుకిలా అవుతున్నది.. అనుకుంటూ మళ్ళీ నదిలోకి దిగి ఆ రాయిని తీసుకొని, ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినా అతని దృష్టిపథం నుండి ఆ రాయి తొలగిపోలేదు. ఆరోజు అంతా ఆ రాయి ఆకర్షణలో పడిపోయాడు. కానీ ఆ రాయి ఒక సాలిగ్రామం అని అతనికి తెలీదు.

మరునాడు యధావిధిగా తన మాంసం అమ్మే విక్రయశాలకు వెళ్ళినప్పుడు కూడా వెంట ఆ రాయిని పట్టుకెళ్ళాడు. దాన్ని ఎక్కడ ఉంచాలో తెలీక డబ్బులు ఉంచే గల్లా పెట్టెలో పెడతాడు. మాంసం ముట్టిన చేతులతో, డబ్బులని తీసిస్తున్న సమయాల్లో ఆ రాయికి మాసం వాసన తగిలేది. అలా దానికి నైవేద్యముగా పెట్టినట్లయ్యింది. నిత్యం ఉండే మాంసం విక్రయాల వల్ల ప్రతిరోజూ నైవేద్యం చాలా బాగా అందేది. అలా రాయి ధనాత్మక శక్తిని క్రమక్రమేణా పొందుతూ ఉంది. అలాగే ఆ రాయి వచ్చినప్పటి నుండి ఆ మాంసం విక్రయశాల అమ్మకాలు జోరందుకున్నాయి. అంచలంచలుగా అంతాని వ్యాపారం పెరిగి, బాగా ధనికుడయ్యాడు. ఈ రాయి వల్ల బాగా వృద్ధిలోకి వచ్చాను అనుకున్న ఆ మాంసం కొట్టు విక్రేత దాన్ని అదే గల్లా పెట్టిలోనే అట్టిపెట్టాడు.

అతి త్వరలోనే ఆ కొట్టువాడు గొప్పవాడు అయిన విధానం ఏమిటో చూచాయగా తెలుసుకున్న ఒక పండితుడు ఒక పూజకని ఆ కొట్టు అతని వద్దకి వెళ్ళుతాడు. అప్పుడు ఆ రాయిని గురించి తెలుసుకొని పరిశీలనగా చూసి, అసలైన సాలిగ్రామంగా తెలుసుకొని, ఆ కొట్టువాడు ఏమరుపాటుగా ఉన్న సమయాన ఆ రాయిని కొట్టేసి, ఇంటికి తెచ్చుకుంటాడు. ఆ సాలిగ్రామానికి ఎన్నో పూజలు చేస్తాడు. ఎన్నెన్నో రకాల పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తాడు. కానీ మాంసం నైవేద్యానికి అలవాటు పడ్డ ఆ సాలిగ్రామం ఆకలిగా ఉండిపోయి, తన ధనాత్మక శక్తి స్థానంలో ఋణాత్మక శక్తిని విడుదల చేస్తుంది. అప్పుడు ఆ పండితుడు నానా అగచాట్లకి గురి అయ్యి నాశనం అవుతాడు.

సాలిగ్రామం ఇంతటి శక్తివంతం అని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చును.

కార్తీక మాసానికి ఉసిరి చెట్టు, ఉసిరికాయకు వున్న సంబంధం అంతా ఇంతా కాదు. అలాగే కార్తీక పౌర్ణమి రోజు ముఖ్యంగా ఉసిరికాయలో దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు చేకూరుతాయి. ఉసిరిచెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా భావిస్తారు. అందుకే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, సోమవారం, పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు. 
 
అలాగే కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయను తీసుకుని... దానిలో నెయ్యి నిండేలా కట్ చేసుకుని.. నేతితో నింపాలి. ఆపై తామర కాడల వత్తులను వేసి దీపమెలిగించాలి. ఇలా చేస్తే.. మహిళలు దీర్ఘసుమంగళీ ప్రాప్తాన్ని చేజిక్కించుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం. అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు, ఈశ్వర అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అంతేగాకుండా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే.. నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. 
 
నవగ్రహాలతో పాటు సమస్త దోషాలను తొలగించుకోవాలంటే.. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయతో దీపం వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. అలాగే ఆర్థిక ఇబ్బందులు అంటూ వుండవు. అష్ట దారిద్ర్యాలు తొలగిపోతాయి. మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

No comments:

Post a Comment